Gundeninda Gudigantalu July 9th Episode: మనోజ్‌కు కంటిచూపు వచ్చిందా? బాలుపై ప్రభావతి ఆగ్రహం..
Gundeninda Gudigantalu: గుండె నిండా గుడిగంటలు బుధవారం ఎపిసోడ్ భావోద్వేగాలతో నిండిపోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మనోజ్‌ను డాక్టర్లు అత్యవసరంగా ఆపరేషన్ థియేటర్‌కు తరలించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతారు. కళ్లలో గాజు పెంకులు ఇంకా ఉండటంతో వెంటనే మరో మేజర్ సర్జరీ చేయాల్సి ఉందని, లేకపోతే కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతారు. అదే సమయంలో రూ.1.70 లక్షల ఆస్పత్రి బిల్లు చెల్లించాలని చెప్పడంతో బాలు తీవ్ర ఆందోళన చెందుతాడు.
డబ్బుల కోసం ఎన్నో చోట్ల ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో, మీనాకు బంగారం కొనివ్వాలని రహస్యంగా దాచిన తన పొదుపు మొత్తాన్ని మనోజ్ చికిత్స కోసం ఖర్చు చేయాలని బాలు నిర్ణయించుకుంటాడు. "మీనాకు మళ్లీ బంగారం కొనిపెట్టగలను.. కానీ అన్నయ్య కంటి చూపు తిరిగి తీసుకురాలేను" అంటూ చేసిన త్యాగం హృదయాలను కదిలిస్తుంది. బాలు, మీనా కలిసి ఆస్పత్రి బిల్లు చెల్లించి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు దాచిపెడతారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయినప్పటికీ, మనోజ్‌కు ఇంకా కంటి కట్లు విప్పకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతుంది. స్పృహలోకి వచ్చిన మనోజ్ తనకు చూపు వస్తుందా అంటూ కన్నీళ్లు పెట్టుకోగా, మీనా అతడిని ఓదార్చుతుంది. బాలు చేసిన త్యాగం ఎప్పుడు బయటపడుతుంది? మనోజ్‌కు నిజంగానే కంటి చూపు తిరిగి వస్తుందా? అనే ఆసక్తికర మలుపుతో ఎపిసోడ్ ముగిసింది.



Click it and Unblock the Notifications