Gundeninda Gudigantalu July 10th Episode: మనోజ్-బాలు మధ్య భారీ గొడవ.. మాణిక్యం ఎంట్రీతో రోహిణికి ఎండ్ కార్డ్?

Gundeninda Gudigantalu:గుండె నిండా గుడిగంటలు గురువారం ఎపిసోడ్‌లో మనోజ్ తన కళ్లు పోతాయేమోనన్న భయంతో ఆందోళన చెందగా, మీనా, శృతి, కుటుంబ సభ్యులంతా అతడికి ధైర్యం చెబుతారు. సత్యం కూడా కష్టసమయంలో ఒకరికి ఒకరు అండగా నిలబడటమే కుటుంబం గొప్పతనమని చెప్పి మనోజ్‌కు భరోసా ఇస్తాడు. మరోవైపు యాక్సిడెంట్ కేసుపై విచారణకు వచ్చిన పోలీసులకు, రూ.30 లక్షలు మోసం చేసిన విల్లా విజయ్‌ను వెంబడించే క్రమంలో ప్రమాదం జరిగిందని మనోజ్ వివరిస్తాడు. అనంతరం రోహిణి, తన కళ్లు ఇచ్చైనా నీ చూపును కాపాడతానంటూ మనోజ్‌ను ఎమోషనల్‌గా ఓదారుస్తుంది.

ఇంట్లో ప్రభావతి మీనాపై విమర్శలు చేయగా, శృతి, సత్యం ఆమెకు గట్టి క్లాస్ పీకుతారు. మనోజ్ చికిత్స ఖర్చులన్నీ బాలు, మీనానే భరించారని చెప్పడంతో ప్రభావతి నోరు మూసుకుంటుంది. హాస్పిటల్‌లో డాక్టర్ కట్లు విప్పి కళ్ల పరిస్థితి బాగానే ఉందని చెప్పడంతో మనోజ్ ఊపిరి పీల్చుకుంటాడు. అయితే చికిత్స బిల్లు బాలు చెల్లించాడని తెలిసినా అతడిపై సెటైర్లు వేస్తాడు. వెంటనే బాలు రూ.2 లక్షలకు పైగా అయిన మొత్తం బిల్లును మనోజ్ చేతిలో పెట్టి షాక్ ఇస్తాడు. అయినా మనోజ్, రోహిణి ఖర్చులపై అనుమానాలు వ్యక్తం చేయడంతో మీనా వారికి గట్టిగా సమాధానం చెబుతుంది. ఈ ఘర్షణల మధ్య ఎపిసోడ్ ముగుస్తుంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 724 july 10th 2026 here is full story

Photo Courtesy: JioHotstar

శుక్రవారం ఎక్స్‌పెక్టెడ్ ఎపిసోడ్‌లో వరుస ట్విస్టులతో కథ మరింత ఆసక్తికరంగా సాగనుంది. మనోజ్ చికిత్సకు సంబంధించిన హాస్పిటల్ బిల్లు విషయంలో బాలు, మనోజ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. ఈ సమయంలో సత్యం జోక్యం చేసుకుని, "ఇప్పుడు ఇవన్నీ అవసరమా?" అంటూ ఇద్దరినీ శాంతింపజేయాలని ప్రయత్నిస్తాడు. కానీ మనోజ్ మాత్రం ఏమాత్రం వినిపించుకోడు.

అయితే హాస్పిటల్ సిబ్బంది బిల్లు మొత్తం రూ.2 లక్షలు అని చెప్పగానే మనోజ్ ఒక్కసారిగా బాలుపై ఆరోపణలు మొదలుపెడతాడు. తన పరిస్థితిని అవకాశంగా తీసుకుని భారీ మొత్తంలో డబ్బు దోచుకోవాలని బాలు ప్రయత్నిస్తున్నాడని అందరి ముందు నిందిస్తాడు. దీంతో బాలు వెంటనే అసలు బిల్లును చూపించి నిజం ఏంటో నిరూపిస్తాడు. అయినప్పటికీ మనోజ్ తీరు చూసి బాధపడిన బాలు.. "ఇలాంటి వ్యక్తికి అనవసరంగా సాయం చేశాను" అని మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

మరోవైపు రోహిణి మాత్రం తన కల్లబొల్లి మాటలతో మనోజ్‌కు మద్దతుగా నిలుస్తూ పరిస్థితిని మరింత దిగజార్చే ప్రయత్నం చేస్తుంది. కానీ సత్యం మాత్రం తన పెద్ద కుమారుడి ప్రవర్తన చూసి తీవ్రంగా కలత చెందుతాడు. ఇంతకాలం మనోజ్‌పై పెట్టుకున్న ప్రేమ క్రమంగా అసహ్యంగా మారిందని, "వీడు ఇక ఎప్పటికీ మారడు" అంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు.ఇక మరోవైపు సుందరి పెళ్లి ఏర్పాట్లు జోరుగా సాగుతుంటాయి. ఈ సమయంలో పెళ్లికొడుకు కిషోర్ తరఫున మేనమామ అయిన మటన్ కొట్టు మాణిక్యం.. రంగా ఇంటికి పెళ్లి పత్రికలు తీసుకుని వస్తాడు. మొదటి శుభలేఖ అందిస్తూ, ఈ పెళ్లికి పెద్దగా రంగా స్నేహితుడు సత్యం కూడా ఉంటే బాగుంటుందని తన అభిప్రాయాన్ని చెబుతాడు.

దీంతో రంగా వెంటనే సత్యంకు ఫోన్ చేస్తాడు. అయితే అక్కడ మనోజ్‌కు జరిగిన ప్రమాదం గురించి తెలుసుకుని ఒక్కసారిగా షాక్‌కు గురవుతాడు. "సరే.. నేను వెంటనే హాస్పిటల్‌కు వస్తున్నా" అని చెప్పి బయలుదేరుతాడు. రంగా ఆందోళనను గమనించిన మాణిక్యం.. "ఏమైంది?" అని ప్రశ్నించగా, తన స్నేహితుడు సత్యం పెద్ద కొడుకుకు యాక్సిడెంట్ జరిగిందని, అతనే బాలు అన్నయ్య అని చెబుతాడు. అది విన్న మాణిక్యం కూడా "అయ్యో.. నేనూ వస్తాను. ముందు మీరు వెళ్లండి. నేను ఫ్రూట్స్ తీసుకుని వెంటనే వస్తా" అంటూ హాస్పిటల్‌కు రావాలని నిర్ణయించుకుంటాడు.

హాస్పిటల్‌కు చేరుకున్న రంగా.. సత్యంను పరామర్శిస్తూ అసలు ఏం జరిగిందని అడుగుతాడు. జరిగిన విషయమంతా, డబ్బుల ఇబ్బందులు కూడా సత్యం వివరంగా చెబుతాడు. అది విన్న రంగా.. "కనీసం నా దగ్గరికి వచ్చి అడిగుంటే నేనే ఇచ్చేవాడిని కదా! ఎందుకు బయట అప్పు చేయాల్సి వచ్చింది?" అని బాధపడతాడు. అంతలో అక్కడికి వచ్చిన బాలును చూసి.. "నాకైనా ఒక మాట చెప్పొచ్చుగా" అని రంగా అంటాడు. అందుకు బాలు.. "పర్వాలేదు మామయ్య.. నేను అడ్జస్ట్ చేశాను. అంతా బాగానే ఉంది. పెళ్లికొడుకు కిషోర్ వాళ్ల మేనమామ వస్తున్నారు.. ఆయన కోసం ఎదురుచూస్తున్నా" అని సమాధానం ఇస్తాడు.

అయితే ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఫ్రూట్స్ తీసుకుని హాస్పిటల్‌కు వస్తున్న మాణిక్యం.. బాలు, సత్యం, ప్రభావతి కుటుంబ సభ్యులను గుర్తుపడతాడా? ఒకవేళ గుర్తిస్తే రోహిణి ఇప్పటివరకు దాచిన నిజాలు బయటపడతాయా? రోహిణి నాటకానికి మాణిక్యం ఎంట్రీతో ముగింపు పడుతుందా? లేక మరో కొత్త మలుపు తిరుగుతుందా? అన్నది శుక్రవారం ఎపిసోడ్‌లో ఆసక్తికరంగా మారనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X