Gunde Ninda Gudi Gantalu: గుళ్లో పోలీసుల విచారణ.. బయటపడ్డ మీనా బండారం..

Gunde Ninda Gudi Gantalu: బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న వాటిలో సీరియల్స్ ప్రధానమైనవి. ఈ సీరియల్స్ కు మహిళల నుంచి రోజు రోజుకు మంచి ఆదరణ లభిస్తోంది. మనసుకు అంతుకుపోయే కథనంతో రూపుదిద్దుకోవడంతో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. అలాంటి టాప్ సీరియల్స్ లో 'స్టార్ మా' ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న'గుండె నిండా గుడి గంటలు'(Gunde Ninda Gudi Gantalu serial) ఒకటి. గత కొంత కాలంగా ప్రసారమవుతున్న ఈ సీరియల్‌ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో 'గుండె నిండా గుడి గంటలు' నెక్స్ వీక్ ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి.

శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్ లో శ్రుతి కనిపించకపోవడంతో సురేంద్రకు రవి మీద అనుమానం వస్తుంది. దీంతో తన కూతురు కనిపించడం లేదని రవి, సత్యంపై పోలీసులకు కంప్లీట్ ఇస్తాడు. సురేంద్ర ఆగ్రహంతో సత్యం ఇంటికి వెళ్లి నానా హంగామా చేస్తాడు. ఇంతలోనే పోలీసులు ఎంటర్ అయి.. స్టేట్ మెంట్ పేరిట సత్యం నుంచి అదుపులోకి తీసుకుంటారు.

Gunde Ninda Gudi Gantalu serial expected episode 270 here is full story

కానీ, పోలీసులు ప్లేట్ మార్చుతారు. శృతి దొరికేంతవరకు విడిచి పెట్టేది లేదంటూ తేల్చి చెప్పుతారు. సత్యం ను పోలీసులు అరెస్టు చేయడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండిపోతుంది ప్రభావతి. తండ్రి అరెస్ట్ అయినా.. తనకు ఏమి పట్టనట్లుగా తనకు సంబంధం లేనట్టుగా మనోజ్ వ్యవహరించడంతో ప్రభావతి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

నెక్ట్స్ వీక్ లో ప్రసారం అయ్యే ఎపిసోడ్ లో ప్రోమో ప్రకారం.. మీనా పోలీస్ స్టేషన్ కు చేరుకుంటుంది. తన మామయ్య దగ్గరికి వెళ్లి అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. సత్యం జరిగిన విషయం చెబుతాడు. ఈ క్రమంలో రవి, శ్రుతిల పెళ్లి విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ, తెలిస్తే ఎలా తన అత్తమామలు ఎలా రియాక్ట్ అవుతారో అనే సందేహంతో అసలు విషయం చెప్పకుండా సైలెంట్ అయిపోతుంది.

ఇంతలోనే ఎస్సై వచ్చి నువ్వు ఎవరు? అంటూ మీనాను ప్రశ్నిస్తాడు. తాను సత్యం గారి కోడలు అంటూ తన మమా గురించి చెప్పుకోస్తుంది. తాను కాపురానికి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఎవరి కూడా ఆయన అపకారం చేయలేదని, ఆయన ఎలాంటి తప్పు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది మీనా. కానీ, ఆ ఎస్సై మాత్రం తనకు ఆ విషయాలు ఏమి అవసరం లేదనీ, శ్రుతి, రవిలు కనిపించేంత వరకూ తన ఎవర్ని విడిచిపెట్టననీ, తన ముందు ఎక్కువ మాట్లాడవద్దని వార్నింగ్ ఇస్తాడు.

ఇంతలోనే బాలు కూడా పోలీసు స్టేషన్ కు చేరుకుంటారు. తన తండ్రిని లాక్ అప్ లో చూసి ఆగ్రహంతో ఊగిపోతాడు. నాన్న నేను వచ్చేశాను నీకు ఏం కాదు అంటూ లాక్ అప్ డోర్ తీయాలని ప్రయత్నిస్తాడు. ఇంతలో ఎస్సై వచ్చి.. హాలో హాలో ఏం చేస్తున్నావ్? ఇదేమైనా ఇళ్లా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

దీంతో బాలు ఎస్సై దగ్గరికి వెళ్లి.. మా నాన్న ఏం తప్పు చేశాడని అరెస్టు చేశారంటూ అడుగుతాడు. దీంతో జరిగిన విషయాన్ని చెప్పుతాడు. ఇంతలో శ్రుతి, రవి ల కేసు విచారణలో భాగంగా గుడికి వెళ్లి ఎంక్వయిరీ చేస్తారు కానిస్టేబుల్. ఈ క్రమంలో వారికి షాకింగ్ విషయం తెలుస్తోంది. రవి, శ్రుతిలు గుళ్లో పెళ్లి చేసుకున్నారనే విషయం వారి విచారణలో తెలుస్తోంది. వెంటనే స్టైషన్ కు వచ్చి.. రవి, శ్రుతిల పెళ్లి విషయం ఎస్సైకి చెప్పుతారు కానిస్టేబుల్స్. ఈ విషయం తెలియగానే.. అటు ప్రభావతి కుటుంబం, ఇటు సురేంద్ర కుటుంబం కూడా షాక్ అవుతోంది.

అదే కాదు.. మరో విషయం కూడా తెలిసిందని సాక్షుల వివరాలను కూడా ఎస్పైకి చూపిస్తారు. ఈ విషయాలను పరిశీలించి.. ఇంతకీ మీనా ఎవరని ప్రశ్నిస్తాడు ఎస్సై. వెంటనే బాలు రిప్లే ఇస్తూ..మీనా తన భార్య అని బదులిస్తాడు. ఆమెనే ముందుండి పెళ్లి చేయించి.. సాక్షిగా సంతకం కూడా పెట్టిండంటూ చూపిస్తాడు ఎసై. దీంతో ఓ సారి మీనా కంగుతింటుంది. మిగితా కుటుంబ సభ్యులు కూడా షాక్ అవుతారు. శుత్రి- రవిల పెళ్లి విషయం తెలియడంతో ప్రభావతి ఎలా రియాక్ట్ అవుతోంది. బాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో.. మరోవైపు సురేంద్ర ఏం చేయబోతాడో అనేది చాలా ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X