Gunde Ninda Gudi Gantalu: మరో సమస్యలో ఇరుక్కున్న మీనా.. సత్యం ఆపరేషన్ సక్సెస్ అయ్యేనా?
Gunde Ninda Gudi Gantalu: బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తున్న వాటిలో సీరియల్స్ ప్రధానమైనవి. ఈ సీరియల్స్ కు మహిళల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మనసుకు అంతుకుపోయే కథనంతో సాగుతున్నతూ సీరియల్స్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. అలాంటి టాప్ రేటింగ్ సీరియల్స్ లో 'స్టార్ మా' ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న'గుండె నిండా గుడి గంటలు'(Gunde Ninda Gudi Gantalu serial)ఒకటి. గత కొంతకాలంగా ప్రసారమవుతున్న ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో 'గుండె నిండా గుడి గంటలు' అప్ కామింగ్ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లూక్కేయండి.
శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో రవి తన చెల్లి మౌనిక కు ఫోన్ చేసి ఇంట్లో పరిస్థితి ఎలా ఉందని అడగగా.. నాన్నకు హార్ట్ ఎటాక్ వచ్చిందని అన్నయ్యలు డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, నాన్న ఆరోగ్యం విషమంగా ఉందని చెబుతుంది. దీంతో వెంటనే హాస్పిటల్ కి బయలుదేరుతారు. ఈ సమయంలో శృతి ఖర్చులకోసం అంటూ రెండు లక్షల రూపాయల చెక్ ఇచ్చి పంపిస్తుంది. మరోవైపు బాలు తన కారును అమ్మి 3 లక్షల రూపాయలను సమకూరుస్తాడు.

ఆ డబ్బులను తీసుకెళ్లి హాస్పిటల్లో కట్టి తన తండ్రి ఆపరేషన్ స్టార్ట్ చేయమని చెబుతాడు. ఇంతలోనే రవి అక్కడికి చేరుకుంటాడు. చూసిన బాలు ఆగ్రహంతో ఊగిపోయి.. కొట్టే ప్రయత్నం చేస్తాడు. ఇంటి సభ్యులంతా.. రవినీ అవమానిస్తారు. తాను తండ్రి ఆపరేషన్ కోసం డబ్బులు తెచ్చానని, ఎంత డబ్బు కట్టమన్నా తాను కడతానని చెప్తాడు. ఆయన వద్దంటూ రవిని అక్కడి నుండి వెళ్లగొడతారు. మిగతా రెండు లక్షల రూపాయల కోసం ప్రభావతి తన బంగారు గాజులు, గొలుసు ఇచ్చి తాకట్టు పెట్టమని చెబుతోంది వీర నిర్ణయంతో అందరూ షాక్ అయితారు.
సోమవారం ఎపిసోడ్ లో ప్రభావతి ఇచ్చిన బంగారం ఆభరణాలను తాకట్టు పెట్టి బాలు డబ్బులు తీసుకొస్తాడు. కట్టాల్సిన మిగతా డబ్బులను కట్టేస్తాడు. దీంతో సత్యం ఆపరేషన్ కు ఏర్పాట్లు చేస్తారు. మరోవైపు.. డాక్టర్.. బాలు, మనోజ్ ను పిలిచి తన తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి వివరిస్తాడు. ఆపరేషన్ సమయంలో ఎలాంటి రిస్కు జరిగిన తమకు సంబంధం లేదంటూ వారితో షూరిటీగా సంతకం పెట్టించుకుంటారు.
మరోవైపు మీనా హాస్పిటల్ కి చేరుకుంటుంది. మామయ్య ను చూడడానికి వెళుతుంది. అక్కడ సత్యం ఫ్రెండ్ రంగా ఉంటాడు. మీనాను చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు . ఏంటమ్మా ఇలా వచ్చావని ప్రశ్నించగా.. తాను మామయ్య కోసం గుడిలో పూజ చేసి తాయత్తు తీసుకొచ్చానని, ఈ తాయత్తు కడితే ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడతాడని చెబుతుంది. ఆ మాటలకు కన్విన్స్ అయినా రంగ. లోపలికి వెళ్ళమని అనుమతిస్తాడు.
దీంతో మీనా తన మామయ్య దగ్గరికి వెళ్లి, తాను తెచ్చిన తాయత్తును చేతికి కడుతుంది. ఇంతలో ప్రభావతి, రోహిణిలు కూడా వస్తారు. దీంతో రంగ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆయనను చూసిన ప్రభావతి ఏమైందని ప్రశ్నించగా .. ఏం జరగలేదంటూ లోపలికి వెళ్ళనని చెప్తాడు. మీనా ప్రభావతి కంటపడుతుందా? లేదా వారి కంట పడకుండా అక్కడి నుండి తప్పించుకుంటుందా? ఒకవేళ ఎదురైతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? మరోసారి మీనా చిక్కుల్లో పడిందా? అనేది ఎక్సైటింగ్ గా మారింది.


Click it and Unblock the Notifications










