Gunde Ninda Gudi Gantalu: మీనాకు అడ్డంగా దొరికిపోయిన రోహిణీ.. ఇంతకీ రోహిణి భయపడుతున్న ఆ సీక్రెట్ ఏంటీ?
Gunde Ninda Gudi Gantalu: స్టార్ మా (Star Maa)ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు'(Gunde Ninda Gudi Gantalu serial) ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. శుక్రవారం జరిగిన ఎపిసోడ్లో.. డైనింగ్ హాల్ లో మీనాపై రోహిణి రెచ్చిపోతుంది. బ్రేక్ ఫాస్ట్ లో పూరీలు లాంటి ఆయిల్ ఫుడ్ చేయొద్దని, అలాంటివి ఆరోగ్యానికి మంచిది కాదని మీనా పై ఫైర్ అవుతోంది రోహిణీ. అవును.. ఆయిల్ ఫుడ్ తినడం వల్లే తన భర్త ఆరోగ్యం కూడా చెడిపోయిందని రోహిణికి వత్తాసు పలుకుతుంది ప్రభావతి.
తాను బాలు కోసం పూరీలు చేశానని చెప్పగా.. ఆ మాట విన్న బాలు నేను ఏమైనా చేయమని చెప్పానా ? అంటూ మీనా పై కోప్పడతాడు. మీనా ప్రేమతో చేసిన టిపిన్ తినకుండానే వెళ్లిపోతాడు. రోహిణీ, ప్రభావతి లు కూడా మీనా చేసిన టిఫిన్ నచ్చలేదంటూ.. అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వారికి నీ చేతితో చేసిన పూరీలు తినే అద్రుష్టం లేదులే అంటు సత్యం సర్థి చెప్పుతాడు.

ఇదిలా ఉంటే.. బాలుకి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతాడు. ఈ క్రమంలో తన ఫ్రెండ్ రాజేష్ ను సహాయం కోరుతాడు. ఇంతలోనే బాలు కారు కొన్న వ్యక్తి వస్తాడు. కారును చూడగానే బాలుకి మిస్ అయ్యానని బాధ కలుగుతుంది. ఓసారి డ్రైవ్ చేసి ఇస్తాడు. అతనికి కారు డ్యాకుమెంట్స్ ఇచ్చి పంపిస్తారు. మరోసారి బాలు ఫుల్లుగా తాగి ఇంటికి వస్తాడు. ఈ విషయాన్ని గమనించిన మీనా సైలెంట్ గా ఇంట్లోకి తీసుకెళ్లి పడుకోపెడుతుంది. ఈ సమయంలో మీనాకు బాలుకు మధ్య వాద్వాగ్దం జరుగుతోంది. ఈ సమయంలో మరోసారి బాలు నిందిస్తాడు.
ఇంతలోనే మీనా తల్లి పార్వతి ఫోన్ చేస్తుంది. అత్తవారింట్లో పరిస్థితి ఎలా ఉందని తన మామయ్య ఎలా ఉన్నాడని క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకుంటుంది. తన తల్లి దగ్గర అసలు విషయం దాచి పెట్టి అంతా బాగుందంటూ సర్ది చెబుతోంది. ఈ క్రమంలో మీనా ఫోన్ మాట్లాడడానికి చూసిన ప్రభావతి ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు అంటూ నా నా నిందలు వేస్తుంది. తన తల్లితో అని చెప్పినా గాని వినిపించుకోకుండా.. అవమానిస్తుంది. ఎన్నటికైనా ఇంట్లో నుండి వెళ్లి పోవాల్సి ఉంటుందని మూలముట సదురుకొని పెట్టుకోమని మీ నాన్న హెచ్చరిస్తుంది ప్రభావతి.
ఇక అప్ కమింగ్ సీరియల్ లో.. ప్రభావతి చెప్పినట్లుగానే మీనా నడుచుకున్నట్లు, ప్రతి విషయాన్ని తన అత్తయ్య చెప్పినట్టే చేయాలని నిర్ణయించుకుంది. ప్రభావతి వంటింట్లోకి వచ్చి ఏం టిఫిన్ చేసావే.. అని మీనాను అడగగా.. 'మీరు ఏం చేయమంటే అది చేస్తాను అత్తయ్య' అంటూ బదులిస్తుంది మీనా. అయితే.. దోశలు పోయి అని ఆర్డర్ చేస్తుంది ప్రభావతి. 'ఆ విషయం ముందే చెప్తే.. పిండి సిద్ధం చేసే దాన్ని' అని రిప్లై ఇస్తుంది. 'సరేలే ఇడ్లీ చెయ్యి..' అంటుంది. ఇడ్లీ రవ్వ లేదు అత్తమ్మ అంటూ మీనా సమాధానం ఇస్తుంది. 'ఇంకేముంది.. పూరీలు చేయి' అనగానే రోహిణి తన అత్తమ్మను చూస్తోంది. దీంతో ఏ టిఫిన్ వద్దులే అంటూ వంటింట్లో నుంచి వెళ్లిపోతుంది ప్రభావతి.
ఇంతలోనే కొరియర్ బాయ్ రూపంలో రోహిణి బాయ్ ఫ్రెండ్ ఇంటికొస్తాడు. అతడ్ని చూడగానే రోహిణి టెన్షన్ పడుతోంది. ఆ వ్యక్తి కొరియర్ అంటూ ఇచ్చిన కవర్ ను తీసుకుంటుంది. ఇంతలోనే ప్రభావతి వచ్చి ..ఇదేదో చెక్కులాగా ఉందంటూ ఆ కవర్ ను తీసుకుంటుంది. అది చెక్ కాదు అత్తయ్య.. వేరే డాక్యూమెంట్స్ అంటూ ఆ కవర్ ను లాక్కుంటుంది రోహిణి. ప్రభావతిని ఇంట్లోకి పంపిస్తుంది.
ప్రభావతి ఇంట్లోకి వెళ్లగానే.. తనకు డబ్బు కావాలంటూ రోహిణిని బ్లాక్‌మెయిల్ చేస్తాడు. తన దగ్గర డబ్బులు లేదంటూ రోహిణి బదిలిస్తుంది. అయితే.. తన దగ్గర .. నీ రహస్యం ఉంది. డబ్బులు ఇవ్వకపోతే మీ ఫ్యామిలీ మొత్తానికి ఆ సీక్రెట్ చెప్పేస్తా అంటూ బెదిరిస్తాడు.పైగా.. రోహిణిని కళ్యాణి అని పిలుస్తాడు. వారిద్దరి మాటలను మీనా వింటుంది. దీంతో మీనాను చూసి రోహిణి భయపడుతోంది. ఈ విషయాన్ని అత్తమ్మతో నువ్వు చెప్పనా? నేను చెప్పానా? అంటూ రోహిణిని మీనా వణికిస్తుంది. ఇంతకీ పార్సల్ బాయ్ గా వచ్చిన ఆ వ్యక్తి ఎవరు? రోహిణి సీక్రెట్ ఏంటి? రోహిణి బండారం బయటపడేనా? రోహిణి అసలు స్వరూపం ఏంటీ? అనేది సోమవారం ఎపిసోడ్లో చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











