Gunde Ninda Gudi Gantalu: తాగొచ్చి అత్తగారింట్లో బాలు హంగామా.. రోహిణీ బాగోతం బయటపడేనా?

Gunde Ninda Gudi Gantalu: 'గుండె నిండా గుడి గంటలు'(Gunde Ninda Gudi Gantalu serial) శుక్రవారం ఎపిసోడ్ లో బాలు తన అత్తగారింటికి వెళ్లాడు. అక్కడ కూడా సూటిపొటి మాటలతో మీనాను అవమానిస్తాడు. తాను మీనా మెడలో తాళికట్టి నుండి తనకు మనశ్శాంతిలేదని, ప్రతి విషయంలో తాను ఇబ్బందులు ఎదుర్కుంటున్నాననీ, తనకు ఇష్టమైనవి దూరం అవుతున్నాయని బాలు వాపోతాడు. దీంతో మీనాకు కోపం వస్తుంది. బాలును పక్కకు తీసుకెళ్లి.. ఏమైనా తిట్టాలనుకుంటే.. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇష్టం వచ్చినట్లు తిట్టమనీ, కానీ తన తల్లి ముందు తిట్టవద్దని, నీ మాటలకు వాళ్లు బాధపడుతారని, పండుగకు వచ్చాం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోమని బాలుని రిక్వెస్ట్ చేసుకుంటుంది మీనా.

ఇదెలా ఉంటే.. తన కారు లాక్కెళ్లడంతో బాలు ఫైనాన్షియర్ దగ్గరికి వెళ్లి మరోసారి గొడవపడతాడు. తన నుండి బలవంతంగా కారు ఎందుకు తీసుకవచ్చారనీ, తాను రెగ్యులర్ గా డబ్బులు కడుతున్నాను. ఎంత చెప్పిన నా భార్యను నన్ను నడిరోడ్డు దించి కారును ఎందుకు బలవంతంగా తీసుకోవచ్చారని నిలదీస్తాడు. నడిరోడ్డు మీద నీ భార్య ముందు కారు లాక్కొస్తేనే అంత బాధ పడుతున్నావ్.. అలాంటివి నా స్టాక్ ముందు నన్ను కాలర్ పట్టుకుని కొడితే.. నేను ఎంత అవమానంగా ఫీల్ అయి ఉంటానని అంటాడు. అందుకే నీ బతుకు మీద కొడుదామని కారును తీసుకరమ్మని చెప్పనని అన్నారు. తన కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్తేనే.. తనకు కారు ఇస్తానని చెప్తాడు. దీంతో బాలు కోపం కట్టలు తెంచుకుంటుంది. నీలాంటి వారి దగ్గర పని చేయాల్సిన కర్మ తనకు లేదనీ, తనకు అడ్డువస్తే.. బాగొదని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు.

Gunde Ninda Gudi Gantalu serial expected episode 295 November 18th 2024 here is full story

మరోవైపు రోహిణి కోసం తన అత్తగారింటి వద్ద దినేష్ వెయిట్ చేస్తూ ఉంటాడు. దినేష్ చూసిన రోహిణి కంగారు పడుతూ.. మళ్లీ ఎందుకు వచ్చావు? అని ప్రశ్నిస్తుంది. తనకు ఇవ్వాల్సిన మిగతా డబ్బు ఇస్తే వెళ్లిపోతానని, లేదంటే మీ అత్తయ్య చెబుతానని బ్లాక్ మెయిల్ చేస్తాడు దినేష్. ఈ సమయంలో ప్రభావతి బయటికి రావడంతో.. తాను ఎలాగైనా డబ్బులు సమకూరుస్తానని, ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని రిక్వెస్ట్ చేసి పంపిస్తుంది రోహిణీ. మరోవైపు ప్రభావతి మనోజ్ ను పిలిచి.. తన మామయ్యకు ఫోన్ చేసి.. పండుగకు మలేషియాకు వస్తున్నామని, టిక్కెట్లు బుక్ చేయమని అడుగు అని అడుగుమంటుంది ప్రభావతి. ఈ విషయమే మాట్లాడడానికి రోహిణి దగ్గరికి ప్రభావతి వెళ్తోంది.

ఇక సోమవారం ఎపిసోడ్లో.. సేట్ పై కోపంతో బాలు ఫుల్లుగా తాగి తన అత్తగారింటికి వస్తారు. మద్యం మత్తులో ఉన్న బాలు .. తన అత్తగారిల్లు మరిచిపోయి.. వేరే వాళ్ల ఇంటికి వెళ్లి తలుపు కొట్టబోతాడు. ఈ విషయాన్ని గమనించిన మీనా వెంటనే వెళ్లి.. బాలును ఇంట్లోకి తీసుకువస్తుంది. ఈ సమయంలో మాట్లాడుతూ ..తనకు మీనాపై ప్రేమ లేదనీ, మీనాను ఇంటికి తీసుకెళ్లడం ఇష్టం లేదని, తన తండ్రి బలవంతం మీదనే మళ్లీ ఇంటికి తీసుకువెళ్లననీ అసలు విషయం బయట పెడతాడు.

Gunde Ninda Gudi Gantalu serial expected episode 295 November 18th 2024 here is full story

ఈ మాటలతో మీనా చాలా బాధపడుతుంది. ఎంత చెప్పిన బాలు వినడని, ఇక్కడ ఉండి తన తల్లిని బాధపెట్టడం ఇష్టం లేక.. బాలుకి చెప్పకుండా అత్తగారింటికి వెళ్లిపోతుంది మీనా.. తెల్లవారిన తర్వాత బాలు.. మీనాను పిలువగా.. మీనా రాత్రే మీ ఇంటికి వెళ్లిపోయిందని పార్వతి చెబుతోంది. దీంతో కంగారుపడుతూ బాలు కూడా తన ఇంటికి వస్తాడు. తనకు చెప్పకుండా ఇంటికి ఎందుకు వచ్చావు? అని నిలదీస్తాడు. తన తల్లిని బాధపడపెడుతూ.. ఉండలేకపోయాననీ, ఇన్ని రోజులు మనమిద్దరం సంతోషంగా ఉన్నామని భావించారు. కానీ నిన్ను తాగొచ్చు మా ఇంట్లో నానా హంగామా చేశారని చెబుతుంది. ఈ సమయంలో ఇద్దరి మధ్య కాస్త వాగ్వాదం జరుగుతుంది. ఇంతలోనే సత్యం తల్లి ఎవరికి చెప్పకుండా పండుగకు ఇంటికి వస్తుంది. దీంతో అందరూ అవాక్కైతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X