Gunde Ninda Gudi Gantalu: లేని జాబ్ గురించి ప్రభావతి బిల్డప్.. మనోజ్ పై రోహిణీకి అనుమానం..

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు సిరీయల్ శుక్రవారం ఎపిసోడ్ లో మీనాక్షి ప్రభావతి కి ఫోన్ చేసి రవి గురించి ఏం ఆలోచించావని ప్రశ్నిస్తుంది. త్వరగా రవిని ఇంటికి తీసుకురాకపోతే శృతి వాళ్ళ నాన్న రవిని ఇల్లారికం తీసుకెళ్లే ప్రమాదముందనీ, ఆ తర్వాత ఎలాంటి ప్లాన్ చేసిన వర్కౌట్ కాదని చెబుతోంది మీనాక్షి. దీంతో తాను వెళ్లి కలుస్తానని మీనాక్షి కూడా తోడుగా రమ్మని పిలుస్తుంది ప్రభావతి.

మరోవైపు బాలు డ్రైవర్ గా కాకుండా అపార్ట్మెంట్లో కార్లను క్లీన్ చేసే వ్యక్తిగా చేరిన విషయం మీనాకు తెలుస్తుంది. అసలు విషయం ఏంటో తెలుసుకోవడానికి బాలు పనిచేసే ప్లేస్ కు వెళ్తుంది. మీనా అక్కడికి వెళ్లే ఈ సమయంలో బాలు పై దొంగతనం నింద వేసి అక్కడి వారు అవమానిస్తారు. ముక్కుమొఖం తెలియని వారిని పనిలో పెట్టుకోవద్దనీ, ఎవరు ఆ వ్యక్తిని పనిలో పెట్టారంటూ రెచ్చిపోతాడు. కనీసం సారీ కూడా చెప్పకుండా వెళ్ళిపోయారని బాలు ఫీల్ అయితాడు. తనకు వచ్చిన కోపానికి అంటూ మాటలు మధ్యలోనే ఆపేస్తాడు.

Gunde Ninda Gudi Gantalu serial expected episode 305 december 2nd 2024 here is full story

ఆ అవమానాన్ని భరించలేక మీనా అక్కనుండి ఏడ్చుకుంటూ బయటికి వస్తుంది. మరోవైపు రవి, శృతి తమ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తారు. రిప్రిష్ కోసం హనీమూన్ కు వెళ్దామని శృతి ప్లాన్ చేస్తుంది కానీ అవి మాత్రం ఇప్పటికే మనం ఫ్యామిలీలకు దూరంగా ఉన్నామని ఇప్పుడు ఇలాంటి ఎంజాయ్మెంట్లు అవసరం లేదంటూ తృతికి సర్ది చెప్తాడు కానీ శృతి మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతుంది.

సోమవారం ఎపిసోడ్ లో మనోజ్ కు లేని జాబ్ గురించి తెగ బిల్డప్ ఇస్తుంది ప్రభావతి. జాబుకు వెళ్లడం కోసం కంపెనీలో చెప్పి కారు తీసుకోమని తండ్రి సత్యం చెప్పడంతో .. ప్రభావతి కూడా మనోజ్ కు సపోర్టుగా మాట్లాడుతుంది. మామయ్య కారు కొనుకొమంటున్నాడని,దానికి వాడు మొహమాటపడుతున్నాడని రోహిణికి చెబుతుంది. నువ్వే వాడి వెంట వెళ్లి కారు తీసుకుని రండి అని ప్రభావతి చెబుతుంది.

రోహిణి కూడా మనోజ్ గొప్పలు చెప్పడంలో రెచ్చిపోతుంది. మనోజ్ ను కారు తీసుకోమని బలవంతపు పెడుతుంది. ఈనెల మనోజ్ 15 కార్లు అమ్మడంటూ ప్రభావతికి రోహిణి చెబుతోంది. మనోజ్ కు పడుకోవడానికి ఏసీ క్యాబిన్ కూడా ఇచ్చారంటూ ప్రభావతి చెబుతోంది. దీంతో మీకు ఎలా తెలుసు అత్తమ్మ అని ప్రశ్నిస్తుంది. దీంతో మనోజ్ కంగారు పడతాడు.

ఇప్పుడు తన తల్లి తనకు సపోర్ట్ గా మాట్లాడేది. కానీ, ఇరకాటంలో పడేసి విధంగా మాట్లాడడంతో మనోజ్ తెగ టెన్షన్ పడుతాడు. రోహిణి కూడా మనోజ్ పై అనుమానం వస్తుంది. ఏం చేయాలో తెలియక మనోజ్ తల పట్టుకుంటాడు. మొత్తానికి మనోజ్ ఇరకాటంలో పడుతాడు. మనోజ్ బాగోతం భయపడుతుందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X