Gunde Ninda Gudi Gantalu: భర్తకు మీనా గ్రీన్ సిగ్నల్.. సంజీవ్ ను చితక్కొట్టిన బాలు..
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్ లో మీనా శృతికి ధైర్యం చెబుతుంది. అందరూ కలిసి ఉంటే ఇలాంటివి కలిసి ఎదుర్కోవచ్చని, రవి చెప్పేది కూడా ఒకసారి ఆలోచించమని సూచిస్తుంది. ఆ తర్వాత సురేంద్ర ఇంటికి మీనా చేరుకుంటుంది. అక్కడ పరిస్థితి గమనించిన మీనా చెప్పకుండా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. ఎందుకు వచ్చావు? అని సురేంద్ర ప్రశ్నించగా.. మీ కూతురు జీవితం ప్రమాదంలో ఉందని, మీ కూతుర్ని ఇచ్చి చేయాలనుకున్న సంజు.. ఇప్పుడు మీ కూతురుపై పగ పెంచుకున్నాడని, తన జీవితం ఆగం చేయాలనే ఉద్దేశంతో యాసిడ్ దాడి చేశాడని చెబుతాను ఇప్పటికైనా శృతికి రక్షణగా ఉండమని కోరుతుంది.
మరోవైపు.. మీనా చేసిన సాహసం మీడియా కంటపడుతుంది. దీంతో మీడియా వాళ్ళు ఇంటికి వస్తారు మీనా చేసిన సాహసాన్ని అందరికీ చూపిస్తారు దీంతో కుటుంబ సభ్యులందరూ షాక్ అవుతారు. ఈ సమయంలో మీనా మాట్లాడుతూ క్రెడిట్ మొత్తం తన భర్తకు ఇస్తుంది. ఆ తర్వాత బాలు మీడియా వాళ్ళు తెచ్చిన ఇటుకను తీసుకొని, ఇంట్లో వాళ్లకు ఇన్ డైరెక్ట్ గా భయపడతాడు. సత్యం కూడా తన కోడలు మీనాను మెచ్చుకుంటారు. అనుకువగానే కాదు.. అవసరమైతే.. ఆదిపర శక్తిగా ఉండాలని సూచిస్తాడు.

అప్ కమింగ్ ఎపిసోడ్లో.. మీనా వీడియో వైరల్ కావడంతో బాలు కు తిక్కలేని సంతోషం వస్తుంది. ఎలాగైనా మందు కొట్టాలని వేయాలని, ఫ్రెండ్స్ పార్టీ ఇవ్వమంటున్నారని మీనాకు చెబుతాడు. దీంతో మీనా కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. కానీ ఇంట్లో వారికి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా మేనేజ్ చెయ్ అని బాలు రిక్వెస్ట్ చేస్తాడు. అందుకు మీనా ఓకే చెప్పడంతో బాలు.. మీనాకు కిస్ చేసి వెళ్తాడు.
ఆ తర్వాత బాలు తన ఫ్రెండ్స్ తో రెస్టారెంట్ కి వెళ్తాడు. అప్పటికే సంజు తన ఫ్రెండ్స్ తో వచ్చి మందు తాగుతూ ఉంటాడు. ఈ విషయం తెలియక బాలు ఫ్రెండ్స్.. మీనా చేసిన సాహసం గురించి ఓ రేంజ్ లో చెప్పుకుంటారు. అలాంటి వాడిని నరికేయాలని అంటారు. దీంతో సంజు కి కోపం వస్తుంది. ఇలాగైనా కొట్టాలని భావిస్తాడు.

ఈ సమయంలో బాలు ఫ్రెండ్ రాజేష్ బయటికి వెళ్తుండగా కాలు అడ్డంపెట్టి పడేయాలని ప్రయత్నం చేస్తాడు. పైగా రాజేష్ తప్పు చేసినట్లు క్రియేట్ చేసి సంజు కొడతాడు. దీంతో బాలుకి ఎక్కలేని కోపం వస్తుంది. బాలు ఫ్రెండ్స్ అంతా కలిసి సంజు నీ అతని ఫ్రెండ్స్ ని కొడుతారు. బాలు కోపంలో సంజు బట్టలు చంపేసి.. మరోసారి ఇలాంటి కథలు చేస్తే చంపేస్తా అంటూ వారిని ఇస్తాడు.


Click it and Unblock the Notifications










