Gunde Ninda Gudi Gantalu: సంజూ ప్లాన్ ఫెయిల్.. చెల్లెలు పెళ్లి చూపులు చెడగొట్టిన బాలు..
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్ లో నీలకంఠం చేస్తున్న మర్యాదలను చూసి ప్రభావతి ఆశ్చర్య పోతుంది వెండి గ్లాసులలో జ్యూసులు ఇవ్వడం తో షాక్ అవుతుంది. తానే కోటీశ్వరురాలు అయినట్టు ఊహల్లో తేలిపోతుంది. ఈ సమయంలో తమ సంబంధం నచ్చిందా లేదా అని నీలకంఠం అడగగా తాను వచ్చేటప్పుడు తన భర్త ఇంట్లో లేడని, ఇంటికి వెళ్లి కబురు పంపుతామని చెబుతుంది.
అన్ని సెట్ అవుతే రేపు ఏంటి పెళ్లిచూపులని నీలకంఠం అంటాడు. ఓకే అని ప్రభావతి ఇంటికి వెళ్ళిపోతుంది. ఈ క్రమంలో నీలకంఠం ప్రభావతికి చీర పెట్టి, డ్రైవర్ ను ఇచ్చి, ఇంటిదగ్గర డ్రాప్ చేసి రమ్మంటాడు. కార్లో రాయల్ గా దిగడం చూసి ఇంట్లో వారు షాక్ అవుతారు తాను మౌనికకు గుప్పింటి సంబంధం తెచ్చానని వారు కోటీశ్వరులంటూ గొప్పలు చెబుతుంది. వారి మర్యాదలను చెబుతూ ఊహల్లో విహరిస్తుంది ప్రభావతి. మీనాక్షి కూడా ప్రభావత్ కి వంత పాడుతుంది. ప్రభావతి గొప్పలు చెప్పడంతో అంత గొప్పవారు కోటీశ్వరులు మన ఇంటికి ఎందుకు వస్తారని బాలుకి అనుమానం వస్తుంది.

సత్యం కూడా కోటీశ్వరుల సంబంధం అంటే.. ఆ రేంజ్ లోని కట్నం అడుగుతారు కదా అని అంటాడు కానీ వారు ఒక్క రూపాయి కూడా కట్నంగా అడగలేదని కేవలం మౌనికను ఇచ్చి పెళ్లి చేస్తే చాలని అన్నారని ప్రభావతి చెప్తుంది. చింటూ బాలుకి మరింత అనుమానం వస్తుంది. ఈ సమయంలో మౌనిక ఏం చెప్పాలో అర్థం కాక బాలు వంక చూస్తుంది.. పెళ్లి చూపులే కదా నచ్చితేనే పెళ్లి చేద్దాం లేకపోతే లేదు అంటూ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. దీంతో ప్రభావతి పెళ్లిళ్ల పేరయ్యకు ఫోన్ చేసి చెబుతోంది. మరోవైపు సంజీవ్ తన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందని సంతోషపడతారు.
కానీ, నీలకంఠం బాలుని అడ్డు తొలగించాలని ఇంటికి వెళ్లే సమయంలో బాలు లేకుండా చేయాలని ప్రయత్నిస్తారు. తను డ్రైవర్ని పిలిచి అతని నెంబర్ నుండి బాలుకి ఫోన్ చేసి.. ఓ డ్రైవ్ ఉందని అడుగుతాడు. కానీ తాను రాలేదని తనకు వేరే పర్సనల్ పని ఉందని బాలు రిప్లై ఇస్తాడు. తాను డబుల్ పేమెంట్ ఇస్తానని చెబుతాడు. దీంతో సత్యం తాను ఉన్నారని అన్ని చూసుకుంటానని చెబుతాడు. దీంతో బాలు తనకు నచ్చకుండా ఓకే అని చెప్తాడు.
అప్ కమింగ్ ఎపిసోడ్లో సంజు తన డ్రైవర్ కు కొన్ని కాటన్ డబ్బులు తీసుకొని బాలు కారు ఎక్కువమని, తాను చెప్పిన చోట్ల ఆ కాటన్స్ ను ఇవ్వమని అలా సాయంత్రం వరకు బాలుని సిటీ మొత్తం తిప్పమని చెప్తాడు అందుకు డ్రైవర్ కూడా ఓకే అంటాడు. సంజు వేసిన ప్లాన్ ప్రకారం డ్రైవర్ చేస్తాడు. బాలు లేని సమయంలో నీలకంఠం తన ఫ్యామిలీతో ప్రభావతి ఇంటికి పెళ్లి చూపులకు వెళ్తారు. ఇరువురు అన్ని మాట్లాడుతున్న తర్వాత సంబంధం ఓకే చేసుకుంటారు. కానీ బాలు కి ఏదో అనుమానం వస్తుంది.
అనవసరంగా ఆ డ్రైవర్ తనని తప్పుదారి పట్టిస్తున్నారని, మధ్యలోనే డ్రైవర్ను క్యాన్సిల్ చేసుకుని ఇంటికి చేరుకుంటారు. అప్పటికే తన చెల్లెలు, మౌనిక పెళ్లి గురించి అన్నీ మాట్లాడుకుంటారు. ఒక్కసారిగా బాలు ఇంట్లోకి రావడంతో సంజీవ్ కి ఎక్కలేని టెన్షన్ పట్టుకుంటుంది. వేదిక నా చెల్లిని ఇచ్చి పెళ్లి చేయడం అంటూ తాంబూలాలను కిందపడేస్తాడు. సంజూ గురించి బయటపెడతాడు. దీంతో ఇంటిల్లిపాది షాక్ అవుతారు. మరి నీలకంఠం సంజు ఎలా రియాక్ట్ అవుతారో?వారి అసలు ప్లాన్ బయటపడుతుందో లేదో ? ప్రభావతి ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











