Gunde Ninda Gudi Gantalu: బాలు ప్లాన్ వర్కవుట్ అయ్యేనా? శ్రుతిని రవి కన్విన్స్ చేసేనా?

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్ లో మౌనిక పెళ్లి పనులలో మనోజ్, రోహిణి హుషారుగా పాల్గొంటారు. కానీ బాలు మాత్రం దూరంగా ఉంటాడు. మౌనిక జీవితం గురించి ఆలోచిస్తుంటాడు. ఈ సమయంలో మీనా.. బాలు దగ్గరికి వచ్చి ,కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ, బాలు తన బాధను చెబుతాడు. తెలిసి తెలిసి ఆ రాక్షసుడుకి తన చెల్లిని ఇచ్చి పెళ్లి చేయలేనని, తాను తన చెల్లెలికి శత్రువు కాదని అంటాడు. ఈ విషయాన్ని గమనించిన సత్యం.. బాలు దగ్గరికి వచ్చి పెళ్లి పనులలో సహాయం చేయమని అడుగుతాడు. కానీ, బాలు అందుకు నిరాకరిస్తాడు.

ఇంతలోనే శీలా డార్లింగ్ ఎంట్రీ ఇస్తుంది. అందరూ సంతోషంగా మౌనిక పెళ్లి పనులలో బిజీబిజీగా ఉంటే .. బాలు మాత్రం డల్లుగా ఉండడం గమనిస్తుంది. ఈ సమయంలో రవి ఎక్కడ ఉన్నాడు? అంటూ ఆరాధిస్తుంది. వాడు పనిచేసే హోటల్ లో సెలవు దొరకడం లేదంటూ సత్యం కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ, చెల్లెలి పెళ్లికి అన్నయ్య లేకపోతే ఎలా అంటూ వాదిస్తుంది సుశీలమ్మ. ఇది సరైన సమయం అని సత్యం ను ఓప్పించి మరి రవి దగ్గరికి వెళుతుంది.

Gunde Ninda Gudi Gantalu serial expected episode 325 December 30th 2024 here is full story

మౌనిక కు పెళ్లి సంబంధం సెట్ అయిందని, కోటీశ్వరులు పైసా కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటున్నారని, ఖచ్చితంగా ఈ పెళ్లికి రావాలి అని ప్రభావతి చెప్తుంది. అందుకు రవి చాలా సంతోషపడతాడు. ఇంతలోనే శృతి ఎంట్రీ ఇస్తుంది. శృతికి కూడా మౌనిక పెళ్లి విషయాన్ని ప్రభావతి చెబుతుంది. కానీ తాము రాలేమని ప్రభావతికి తేల్చి చెబుతోంది శ్రుతి. దీంతో ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. బాధతో అక్కనుండి తిరిగి వెళ్ళిపోతుంది.

మరోవైపు ప్రభావతి ఇంట్లో పెళ్లి పనులు జరుగుతూ ఉంటాయి. బాలు తన ఫ్రెండ్ రాజేష్ ను కార్ తీసుకొని ఇంటికి రమ్మంటాడు. ఇంటికి వచ్చిన తర్వాత బాలు ఒక విషయం చెప్పి రాజేష్ కు షాక్ ఇస్తాడు. తాను సంజీవ్ ను కిడ్నాప్ చేయబోతున్నానని, అందుకు నీ హెల్ప్ కావాలని అడుగుతాడు. అతడు తొలుత భయపడ్డా.. తన వల్లే ఈ గొడవ ప్రారంభమైంది. కాబట్టి సహాయం చేస్తానని చెబుతాడు. ఓ డ్రైవర్ను కిడ్నాపర్ చేశావు కదారా.. అని అతడు బాధపడతాడు నేనేమైనా ప్రొఫెషనల్ కిడ్నాపర్ నా..‌ అని బాలుకి సెటైర్ వేస్తాడు.

తర్వాత ఎపిసోడ్లో అందరూ పెళ్లికి వెళ్లడానికి సిద్ధమవుతారు. మనోజ్ సూటు వేసుకుని రిచ్ పర్సన్ బిల్డప్ ఇస్తాడు. రోహిణి కూడా ఓ రేంజ్ లో తయారవుతుంది. ప్రభావతి అయితే.. తానే పెళ్లి కూతురులాగా తయారవుతుంది. ఇక మీనా పట్టు చీరలో మహాలక్ష్మి గా కనిపిస్తుంది. అందరూ పెళ్లికి వెళ్లడానికి సిద్దమవుతారు. ఇంతలో సుశీలమ్మ.. బాలు ఎక్కడ ఉన్నాడు?వాడు రాడా? అని అడుగుతుంది. వాడు రాకపోతే డ్రైవింగ్ ఎవరు చేస్తారు అంటూ ప్రభావతి అంటుంది. దీంతో సుశీలమ్మ ఫైర్ అవుతుంది. వాడు రావడం లేదంటే డ్రైవింగ్ ఎవరు చేస్తారని అంటావా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

ఇంతలోనే బాలు పంచె కట్టులో ఎంట్రీ ఇస్తాడు. దీంతో సుశీలమ్మ సంతోషపడుతుంది. నిన్ను చూస్తే మీ తాతయ్య అని చూసినట్లు ఉంది అంటూ సిగ్గుపడుతుంది. సత్యం వాస్తవానికి ఆశ్చర్యపోతాడు. తాను రాకుండా తన చెల్లి పెళ్లి ఎలా జరుగుతుందని బాలు అంటాడు. ఇలా అందరూ కలిసి మౌనిక సంజీవ్ ల పెళ్లికి వెళ్తారు. ఈ పెళ్లికి రవి శృతిలు వస్తారా? వస్తే పెళ్లిని అడ్డుకుంటారా? బాలు నిజంగానే సంజీవనం కిడ్నాప్ చేస్తాడా? సంజు మౌనిక ల పెళ్లి జరిగినా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయాలన్నిటిని తెలుసుకోవాలంటే సోమవారం నాటి ఎపిసోడ్ చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X