Gunde Ninda Gudi Gantalu: సంజు రివేంజ్.. నరకంలోకి మౌనిక.. రోజుకో శిక్ష...
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్ లో బాలు చేసిన అవమానానికి క్షమించమని సత్యంతో పాటు ప్రభావతి, సుశీల, క్షమాపణలు అడుగుతారు. వారు అంతగా ప్రాధేయపడటంతో నీలకంఠం తగ్గుతాడు. అయితే.. మీ కూతుర్ని మా ఇంటి కోడలుగా తీసుకువెళ్లాలంటే.. ఓ కండిషన్ అంటూ... ఇకపై బాలు జీవితంలో మళ్లీ నా ఇంటికి గడప తొక్కకూడదు. మౌనికను కలవకూడదని కండిషన్ పెడతాడు. ఆ కండిషన్ ఒప్పుకుంటేనే మౌనికను మా ఇంటికి తీసుకు వెళ్తామని నీలకంఠం అంటాడు.
ఆ కండిషన్ కు ప్రభావతి అంగీకరిస్తుంది. జీవితంలో బాలు మళ్లీ మౌనిక ముఖం చూడడు. మీ ఇంటికి వచ్చి గొడవ చేయకుండా తాను చూసుకుంటా అంటూ ప్రభావతి మాటిస్తోంది. ఇలా బాలు లేకుండానే మౌనిక అప్పగింతలు జరుగుతాయి. అయితే ఈ సమయంలో.. బాలుని అవమానించడంతో 'మీ అబ్బాయి ఎలాంటి వాడో ..బాలు ఎందుకు అలా మాట్లాడాడో.. తమకు తెలుసా' అని నీలకంఠానికి షాక్ ఇస్తుంది మీనా. ఇలా నీలకంఠం ఇంటికి మౌనికను కోడలుగా పంపిస్తారు.

మరోవైపు బాలు తనకు జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ బాధపడతాడు. ఇంతలో ఓ స్వామీజీ తన దగ్గరికి వచ్చి అంతా విధి లిఖితం. ఎవరు కూడా జరగబోయే దాన్ని ఆపలేరు అంటూ చెబుతాడు. తన చెల్లెల్ని చేసుకున్న వాడు ఓ రాక్షసుడని పోయి పోయి వాడి చేతిలో తన చెల్లెలు పెట్టాలంటే భయంగా ఉందని బాలు అంటాడు. మనిషి అన్నవాడు ప్రతి ఒక్కడు మారుతాడని మార్పు అనేది సహజమని ఈ విషయంలో బాధపడకుండా ధైర్యంగా వెళ్ళమని చెబుతాడు.
అత్తగారు ఇంట్లో అడుగుపెట్టిన మౌనిక దీపం వెలిగిస్తుంది. ఈ సమయంలో సంజు తన రివెంజ్ ఇక స్టార్ట్ అవుతుందని మనసులో అనుకుంటారు. ఈ సమయంలో సంజు తల్లి.. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయని వాటన్నిటిని సర్దుకుని పోవడమే జీవితం అని ఇన్ డైరెక్టుగా సంజు తో జాగ్రత్తగా ఉండమని చెబుతోంది. మరోవైపు బాలు ఓ చెట్టు కింద కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఆ విషయాన్ని గమనించిన మీనా దగ్గరికి వచ్చి బాలుకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది. మౌనిక కొట్టిందని బాధపడుతున్నారా అని అడుగుతుంది.
ఇంకా నాలుగు దెబ్బలు కొట్టిన తాను బాధపడే వాన్ని కాదని, వాడి మాయలో పడి నరకంలోకి అడుగుపెట్టిందని బాలు బాధపడతాడు. అసలు వాడని ముందే చంపేసి ఉంటే ఇదంతా జరిగేది కాదు అని బాలు ఆగ్రహం వ్యక్తం ఇలాంటి పనులేదో చేస్తారని మిమ్ములను చెంప దెబ్బ కొట్టింది అని మీనా సర్దు చెప్పే ప్రయత్నం చేస్తుంది.
అప్ కమింగ్ ఎపిసోడ్లో.. బాలుకి మీనా ధైర్యం చెప్పి ఇంటికి తీసుకు వెళుతుంది. ఈ సమయంలో 'బాలు స్వామి మీకు దండం. ఏది నా చేతుల్లో లేదు. అంతా నీదే బాధ్యత. మా చెల్లెలి బాధ్యత కూడా నువ్వే చూసుకోవాలి. నా చెల్లె జీవితాన్ని కాపాడాల్సిన బాధ్యత మీదే స్వామి. నీ మీదే నా భారం' అంటూ బాలు ఎమోషనల్ అవుతారు. బాలు ఇంటికి చేరుకున్న తర్వాత.. 'జీవితంలో మొదటిసారి భయమేస్తుంది. మౌనిక ఆ ఊరి తాడు తీసేయమంటే.. పసుపు తాడు అని భ్రమపడి, నా చెంపపై కొట్టి వెళ్ళిపోయింది' అంటూ బాలు బాధపడతాడు. అన్ని సర్దుకుంటాయి అని మీనా బాలుకి ధైర్యం చెబుతుంది.
మరోవైపు ఎన్నో ఆశలతో కలలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని మౌనిక కలలు కంటుంది. పెళ్లయిన తొలి రోజే శోభనం ఫిక్స్ చేస్తారు. అలా శోభనం గదిలోకి వెళ్లిన మౌనికకు సంజు తన టార్చర్ చూపిస్తాడు. అసలు ఈ ప్రపంచంలో నన్ను చూడగానే.. పూర్తిగా అర్థం చేసుకున్నది మీ బాలు అన్నయ్య ఒక్కడే అంటూ తన నిజ స్వరూపాన్ని బయటపెడతాడు. అంతేకాకుండా పెళ్లికి ముందు.. జరిగిన ఘటనలను అన్నిటినీ మౌనికకు చెబుతాడు.
బాలుని కట్టేసి టార్చర్ పెడుతుంటే.. తనకు ఎంతో సంతోషం కలిగిందని తన సైకో తనాన్ని బయటపెడతాడు. మీ ఫ్యామిలీ పై రివెంజ్ తీసుకోవడానికి.. నీ మెడలో పసుపు తాడు కట్టి ఇక్కడికి తీసుకు వచ్చాను అంటూ అసలు విషయాన్ని సంజు బయట పెడతాడు. దీంతో మౌనిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. నీకు రోజుకో శిక్ష వేసి.. నేను ఎంజాయ్ చేస్తా అంటూ తనలోని మృగాన్ని మౌనికకు పరిచయం చేస్తాడు ఇలా మౌనిక.. తాను పులి బోనులో అడుగుపెట్టానని తన అన్నయ్య చెప్పింది కరెక్టేనని, తన అన్నయ్యను అనవసరంగా అపార్థం చేసుకున్నానని పైగా తనపై చేయి చేసుకున్నానని వచ్చేత్తాపబడుతుంది మౌనిక.


Click it and Unblock the Notifications










