Gunde Ninda Gudi Gantalu: ప్రభావతికి షాకిచ్చిన శ్రుతి.. బాలు ఆగ్రహాన్ని మరోసారి రవి బలి..

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్ లో రవి, శృతి లు ఇంటికి వస్తున్నారని కంగారుపడుతుంది ప్రభావతి. అయితే.. విషయం ఎవరికి చెప్పకుండా మ్యానేజ్ చేస్తోంది. ముందుగా మీనా దగ్గరికి వెళ్లి.. వంట పూర్తి చేశావా? లేదా? ఇంత సేపు ఏం చేస్తున్నావ్ అంటూ బెదిరిస్తుంది. దీంతో మీనా ఇన్ డైరెక్ట్ గా ప్రభావతిపై పంచ్ లు వేస్తుంది. రవి ఇంటికి వస్తున్న విషయం ఎలా చెప్పాలో అర్థం కాక.. కంగారు కంగారుగా తిరుగుతుంది. ఆ అయోమయంలో సత్యం గుద్దుతుంది. దీంతో సత్యం షాక్ అవుతాడు. అసలు ఎందుకు కంగారు పడుతున్నామని ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పి చివాట్లు తింటుంది.

మరోవైపు.. బాలు గురించి భయపడుతుంది. బాలు ఉంటే తన ప్లాన్ వర్కవుట్ కాదనీ, వాడిని ఎలాగైతే ఇంట్లో నుండి త్వరగా పంపించాలని భావిస్తుంది. బాలు రెడీ అయి కిందికి రాగానే ఎన్నడు లేని విధంగా ప్రేమ కురిపిస్తుంది. బాలుకి స్వయంగా ప్రభావతి టిఫిన్ దగ్గరుండి వడ్డిస్తుంది. దీంతో బాలు షాక్ అవుతాడు. ఎన్నడు లేని విధంగా తన తల్లి ప్రేమ కురిపించడంతో ఏదో జరగబోతుందని భావిస్తాడు. పైగా క్యారేజ్ కట్టి పంపించడంతో ఇలా అనుమానం పెరుగుతోంది. లాస్ట్ టైం మౌనిక పెళ్లి చూపులు సమయంలో ఇలానే ప్రవర్తించిందని, ఈసారి కూడా ఏదో ఉపద్రవం తీసుకురావాలని ప్రయత్నిస్తుందని బాలు కి అనుమానం వస్తుంది.

Gunde Ninda Gudi Gantalu serial expected episode 335 january 13th 2024 here is full story

దీంతో బాలు బయటికి వెళ్లినట్టు వెళ్లి..తనకు స్టమక్ అప్సెట్ అయ్యిందని ఇంట్లోకి వస్తాడు. దీంతో ప్రభావతి కంగారుపడుతుంది. బాలు తన రూంలోకి వెళ్లగానే బయటికి రాకుండా లాక్ చేస్తుంది. ప్రభావతి కంగారును చూసి సత్యం.. ఏం జరుగుతుందని నిలదీస్తాడు. రవి, శృతి ఇంటికి వస్తున్నారని అసలు విషయం చెబుతుంది. శృతిని తన తల్లిదండ్రులు వచ్చి అప్పగిస్తేనే ఇంట్లోకి రానిస్తానంటూ సత్యం కండిషన్ పెడుతాడు. శృతి వల్ల అమ్మ నాన్నలు కూడా ఇంటికి వస్తున్నారని చెబుతుంది. అంతలోనే రవి,శృతి,సురేంద్ర,శోభన లు ప్రభావతి ఇంటికి చేరుకుంటారు. కానీ సురేంద్ర ఇంట్లోకి రాకుండా కారు లోనే ఉండిపోతాడు.

అప్ కమింగ్ ఎపిసోడ్లో రవి, శృతిలను చూసి ప్రభావతి తెగ సంతోషపడుతుంది. తన అదృష్టదేవత ఇంట్లో అడుగుపెట్టబోతుందని భావిస్తుంది. కానీ, మనోజ్ అసూయపడుతాడు. రవి ఇంట్లోకి వస్తే.. తనకు రెస్పెక్ట్ ఉండదని భావిస్తాడు. రవి, శ్రుతిలు ఇంటికి రావడం సత్యం కూడా నచ్చదు. దీంతో సైలెంట్ గా ఉండిపోతాడు. పెళ్లయిన తర్వాత తొలిసారి రవి,శ్రుతిలు ఇంట్లో కాలు పెడుతున్నారు. కాబట్టి.. హారతి ఇవ్వమని రోహిణిని పిలుస్తోంది. కానీ, అందులోనే మీనా హారతి తీసుకొని వస్తుంది. కానీ, ఆ హారతి పళ్లేన్నా రోహిణి ఇవ్వమని ప్రభావతి ఆర్డర్ వేస్తుంది.

దీంతో శృతి రియాక్ట్ అవుతూ మీనా ఇస్తే..ప్రాబ్లం ఏంటి అత్తయ్యా అని ప్రశ్నిస్తుంది. ఎక్కడ గొడవ అవుతుందోనని రవి.. శృతి మాటలను కవర్ చేస్తూ ఇద్దరు వదినలు కలిసి హారతి ఇవ్వమని అంటాడు. తర్వాత కుడికాలు పెట్టి ఇంట్లోకి రమ్మని ప్రభావతి శృతికి చెబుతుంది. కుడికాలు ఏంటి.. ఎడమకాలి ఏంటి.. రెండు కాళ్లు నావే కదా.. అంటూ ప్రభావతికి తింగరి సమాధానం ఇస్తుంది శృతి. మరోవైపు బాలు తన రూమ్ నుండి అరుస్తాడు. దీంతో మీనా వెంటనే వెళ్లి బాలు రూమ్ లాక్ ఓపెన్ చేస్తుంది.

నన్ను రూమ్లో పెట్టి లాక్ ఎవరు చేశారు? అయినా ఇంట్లో హడావిడి ఏంటి? ఎవరు వచ్చారు? అని మీనాను ప్రశ్నిస్తాడు బాలు. రవి, శృతి ఇంటికి వచ్చారని చెప్పగానే బాలు ఆవేశం కట్టలు పెంచుకుంటుంది. 'ఎవర్రా ఇంటికి రమ్మని చెప్పింది. ఇంట్లో ఎలా కాలు పెట్టావు ? 'అంటూ రవిని కొట్టడానికి ప్రయత్నిస్తాడు. దీంతో శృతి అడ్డుపడుతుంది. ఇన్ డైరెక్ట్ గా బాలుకి శృతి వార్నింగ్ కూడా ఇచ్చేస్తుంది. ఈ విషయంలో సత్యం కలగజేసుకొని బాలుని శాంతింప చేస్తాడు.

అనంతరం శృతిని దీపం వెలిగించమని ప్రభావతి అంటుంది. ఇంట్లో ఎంత వెలుగు ఉండగా.. లైట్లు ఉండగా.. దీపం ఎందుకు పెట్టాలి అంటుంది శ్రుతి. దీంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత మీనా దీపం ఎందుకు పెట్టాలో అసలు విషయం చెబుతుంది. ఇలా మొత్తానికి ప్రభావతి కల నెరవేరుతుంది. ఆ తర్వాత ప్రభావతి ..శ్రుతితో తన గొప్పలు చెప్పుకొని ప్రయత్నం చేస్తుంది. మిమ్మల్ని ఇంట్లోకి తీసుకురావడానికి తాను ఎంతగానో ప్రయత్నించానని, శృతి తో అంటుంది. ఇందులో మీ గొప్పతనం ఏముంది అత్తయ్య.. మేము రావాలనుకుంటే వచ్చాం అయినా.. మా పెళ్లి చేసింది మీనా. మీనా లేకపోతే నేను మీ ఇంట్లో అడుగు పెట్టే దాన్ని కాదు. అంటూ ప్రభావతికి షాక్ ఇస్తుంది. మీనా ను తన ముందే పొగడడంతో ప్రభావతి కుళ్ళుకుంటుంది.

ఇంతలోనే బాలు.. మీనాను పిలుస్తాడు. బాలు ఉంటే.. తన ప్లాన్ వర్కవుట్ కాదనీ, వాడు ఏదైనా గొడవ చేస్తాడని ప్రభావతి భయపడుతుంది. ఎలాగైనా బాలుని తొందరగా ఇంట్లో నుండి బయటకు పంపాలని, కంగారు కంగారుగా టిఫిన్ పెడుతుంది. వంట కూడా ప్రభావతి పూర్తి చేస్తుంది. బాలు రెడీ అయి కిందికి వస్తాడు. తాను టిఫిన్ చేసి వెళ్తానంటే.. అవసరం లేదు.. బయట టిఫిన్ చెయ్ అని క్యారేజ్ సర్దుతుంది. కానీ, తనకు బయట ఫుడ్ పడదని, తాను టిఫిన్ చేసిన తర్వాతనే వెళ్తానని బాలు అంటాడు. ఎన్నడు లేని విధంగా ప్రభావతి దగ్గరుండి ఉండి బాలుకు టిఫిన్ వడ్డిస్తుంది. దీంతో బాలు ఆశ్చర్యపోతాడు.

ఇది కలనా..నిజమా.. అని పక్కనే ఉన్న మనోజ్ ను గిచ్చుతాడు. కానీ, ఎనలేని విధంగా తనపై తన తల్లి ప్రేమ కురిపించడంతో అనుమానం వస్తుంది. చివరిసారి మౌనిక పెళ్లి విషయంలో కూడా తన తల్లి ఇలానే ప్రవర్తించిందని, ఈసారి కూడా ఏదో చేయబోతుందని డౌట్ బాలుకి వస్తుంది. తాను బయటికి వెళ్లినట్టు వెళ్లి.. మళ్లీ ఇంట్లోకి తిరిగి వస్తాడు. తన స్టమక్ అప్సెట్ అయిందని, కారణం చెప్పి తన రూమ్ లోకి వెళ్తాడు. బాలు ఉంటే తన ఆటలు సాగవని ప్రభావతి .. బాలు రూమ్ లో ఉండగానే.. లాక్ చేస్తుంది వేస్తుంది. తనకు అడ్డలేదని దర్జాగా కిందికి వస్తుంది.

ఈ సమయంలో మనోజ్ తనకు ఆకలి అవుతుందని టిఫిన్ పెట్టమని అడుగుతాడు. ఓ అరగంట ఆగితే పోయేది ఏమీ కాదు. వాళ్లు వస్తున్నారు అంటూ నోరు జారుతుంది ప్రభావతి. ఎవరు వారని సత్యం .. ప్రభావతిని నిలదీస్తాడు‌. తప్పించుకునే పరిస్థితి లేకపోవడంతో రవి, శృతి ఇంటికి వస్తున్నారని, వారికోసం తాను వెయిట్ చేస్తున్నానని చెబుతోంది ప్రభావతి. తాను ముందుగానే చెప్పానని, శృతి వాళ్ల తల్లిదండ్రులు ఇంటికి వచ్చి.. శృతిని అప్పజెప్పితేనే తాను ఇంట్లోకి రానిస్తానని అంటాడు సత్యం. శృతి వాళ్ల అమ్మానాన్న కూడా వస్తున్నారని అసలు విషయం బయటపెడుతుంది ప్రభావతి.

ఇంతలోనే శృతి తన తల్లిదండ్రులతో అత్తగారింటికి చేరుకుంటుంది. కానీ, సురేంద్ర.. సత్యం ఇంట్లో కాలు పెట్టడానికి నిరాకరిస్తాడు. తాను ఇక్కడి వరకు రావడమే ఎక్కువ అని, తన మనసు చంపుకొని ఇంట్లోకి రానని అంటాడు. దీంతో శృతి, రవి, శోభ ముగ్గురు కలిసి ప్రభావతి ఇంటికి చేరుకుంటారు. ఈ సమయంలో ప్రభావతి కంగారుపడుతూ వెంటనే హారతి తీసుకురమ్మని రోహిణికి చెబుతుంది. కానీ, మీనా హారతి తీసుకొని వస్తుంది. ఆ విషయం ప్రభావతికి నచ్చదు. హారతి రోహిణికి ఇవ్వమని మీనాపై కొప్పడుతుంది. ఎవరిస్తే ఏముంది? అత్తయ్య మీనాని హారతి ఇస్తే బాగుంటుందంటూ ప్రభావతికి అడ్డు చెబుతుంది శృతి. తన భార్య మాటలకు రవి కవర్ చేస్తూ ఇద్దరు కలిసి ఇవ్వమని అంటాడు. దీంతో సీరియల్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X