Gunde Ninda Gudi Gantalu: రవికి మనోజ్ సపోర్ట్.. బాలుకి ఎదురుతిరిగిన శ్రుతి ..
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్ లో శృతి,రవి ల శోభనం కోసం ఏర్పాట్లు చేస్తుంటారు. ఇందులో భాగంగా శృతిని రెడీ చేస్తుంది రోహిణీ. ఆ తర్వాత మీనా వచ్చి శృతి సారీ కుచ్చులను సరిచేస్తుంటే.. వెళ్లి పాలు వేడి చేయమని ఆర్డర్ వేస్తుంది ప్రభావతి. అంతలోనే కిచెన్ లోకి వచ్చి.. ఇంకా పాలు కాయడం పూర్తి కాలేదా అని అడుగుతుంది. పాలల్లో బాదం, పిస్తా, జీడిపప్పు అన్ని బాగా మిక్స్ చేసి బాగా వేడి చెయ్యమని చెప్పి వెళ్ళిపోతుంది. ప్రభావతి చెప్పినట్లుగానే మీనా పాలను కాచి.. గ్లాసులో పోసి వేరే పని ఉండడంతో బయటికి వెళ్ళిపోతుంది మీనా.
ఆ తరువాత ఆకలి మంట మీద బాలు కిచెన్ లోకి వస్తాడు. పాలు కనిపించడంతో ఆలోచించకుండా.. శోభనం కోసం కాచిన పాలను తాగేస్తాడు. దీంతో ప్రభావతి షాక్ అవుతుంది. అవి శోభనం కోసం రెడీ చేసిన పాలు . ఇప్పుడేలా అని బాధపడుతోంది. పాలు తీసుకురమ్మని మనోజ్ రిక్వెస్ట్ చేయగా.. తనకు నిద్ర వస్తుందని ఆయన ఈ టైంలో బయటికి వెళ్లి తీసుకురావడానికి కంటే.. ఉన్న పాలతో అడ్జస్ట్ కావడం బెటర్ అని మనోజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరో వైపు బాలు మిద్దెపై తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు.

ఈ సమయంలో బాలు దగ్గరికి రవి వెళ్తాడు. అన్నయ్య నీతో మాట్లాడాలి అంటాడు రవి. ఇంటి పరువు రోడ్డు మీద పడేసిన నీతో నేను మాట్లాడను.. అయినా ఏ ముఖం పెట్టుకొని శోభనం చేసుకుంటున్నావు అని రవిని తిడుతాడు. ప్రతి విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటావ్.. ఇంట్లో జరిగిన అనార్థాలకు కారణం నువ్వేననీ బాలు పైకి రివర్స్ అవుతాడు రవి. ఇంతలోనే మనోజ్ వచ్చి రవికి సపోర్టుగా మాట్లాడుతాడు. నీ కోపం వల్లనే నాన్నకు హార్ట్ ఎటాక్ వచ్చిందనీ, నీ కోపం వల్లనే ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. రోజు తాగి వచ్చి.. ఇష్టం ఉన్నట్లు ఎవరి మీద పడితే వారి మీద అరుస్తావని, అడ్డు చెప్పిన వారిపై చేయి చేసుకుంటావని రవికి మనోజ్ సపోర్టు ఇచ్చాడు.
అప్ కమ్మింగ్ ఎపిసోడ్ లో 40 లక్షలు మింగినోడు.. లేచిపోయి పెళ్లి చేసుకునోడు ఒక్కటయ్యారని రవి మనోజులపై మండిపడుతాడు బాలు. రవిని మనోజ్ తీసుకెళ్లడంతో బాలు కోపం ఆకాశాన్ని అంటుతుంది. వెంటనే తన గదిలోకి వెళ్లి ఈ రోజు శోభనం ఎలా జరుగుతుందో చూస్తానని తన గదికి లాక్ చేసుకుని వెళ్లిపోతాడు బాలు.
మరోవైపు.. ప్రభావతి శోభనం ఏర్పాట్లల్లో బిజీ బిజీగా ఉంటుంది. మీనా ను శోభనం గదిలో పాలు, పండ్లు పెట్టావా లేదా అని, అని ఏర్పాట్లు పూర్తయ్యాలేదని ఆరా తీస్తుంది. రూమ్ ను డెకరేట్ చేసి అన్ని సర్ది పెట్టానని చెబుతుంది. తాను కూడా ఒక్కసారి చూసి వస్తాననీ, మళ్లీ బాలు ఏమైనా చేశాడా? అనే అనుమానం తో రూమ్ దగ్గరికి వెళ్లుతుంది. కానీ, రూమ్ కి లాక్ వేసి ఉండడంతో ప్రభావతి షాక్ అవుతుంది. వెంటనే మీ నాన్న పిలిచి ఎవరు గదికి లాక్ వేశారని ప్రశ్నిస్తోంది. తనకు తెలియదు. కానీ, బాలు గదికి లాక్ వేయవచ్చని అనడంతో ప్రభావతి షాక్ అవుతుంది
మరోవైపు.. శోభనం కోసం రవి, శ్రుతిలు సిద్దమవుతారు.మొదటగా అత్తమామల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. బాలు కోపంతో బయటికి వెళ్లిపోతాడు. కానీ, మీనా రిక్వెస్ట్ చేసి .. మళ్లీ ఇంట్లోకి తీసుకువస్తుంది. ఈ సమయంలో బాలు కాళ్ళు మొక్కుమని సత్యం చెప్తాడు. రవి తన అన్నయ్య కాలు మొక్కడానికి సిద్ధంగా ఉన్నా.. శృతి మాత్రం తనకు ఎవరి ఆశీర్వాదం అవసరం లేదని, మరొకరి కాళ్లపై పడే అలవాటు తనకు లేదని బాలుని అవమానిస్తుంది. దీంతో బాలు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అచ్చు జీఎం (సురేంద్ర) గారి నోట్లో నుండి ఊడిపడినట్టు ఉందనీ నోరు జారతాడు బాలు. ఈ క్రమంలో శృతి, బాలు వాగ్వాదం జరుగుతుంది. దాన్ని అడ్డుకోవడానికి సత్యం ప్రయత్నిస్తాడు. ఈ గొడవ నేపథ్యంలో రవి శృతి శోభనం జరుగుతుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది.


Click it and Unblock the Notifications










