Gunde Ninda Gudi Gantalu: ప్రభావతికి షాకిచ్చిన బాలు.. సంచలన నిర్ణయం తీసుకున్న సత్యం..

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్ లో మీనాను నానా మాటలు అంటుంది. ఒక రోజు మొగుడు పక్కన లేకుండా ఉండలేవా.. రూమ్ కు తాళం వేసుకొని వెళ్లిమని చెప్పింది నువ్వే.. మొగుడ్నికొంగుకు కట్టేసుకున్నావ్ ' అంటూ ప్రభావతి రెచ్చిపోతుంది.దీంతో హార్ట్ అయినా మీనా ఏడ్చుకుంటూ బయటికి వెళ్లిపోతుంది. ఈ విషయాన్ని చెప్పాలని బాలుకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. ప్రభావతి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ మీనా బాధపడుతోంది.

మరోవైపు రవి.. శృతి డబ్బింగ్ స్టూడియోకు వెళ్లి.. ఇంట్లో జరిగిన గొడవ గురించి చెబుతాడు. తాను ఈ విషయాలను ముందే ఊహించాననీ, వాళ్ళు రూమ్ లో వాళ్లు ఉండటమే న్యాయమని రవికి సర్ది చెబుతోంది. మరోవైపు.. మీనాను వెతుక్కుంటూ ప్రభావతి వెళ్లి మరి తిడుతుంది. బాలు రూమ్ కి తాళం వేసుకొని వెళ్లడానికి కారణం నువ్వే ననీ, ఒకరు సుఖంగా ఉంటే ఓర్వలేవా.. శృతి పెద్దింటి పిల్ల.. నువ్వు పేదింటి దానివి. ఒక్కరోజు మొగడు పక్కన లేకపోతే పడుకోలేవా అంటూ అసహ్యంగా మాట్లాడుతుంది ప్రభావతి.

Gunde Ninda Gudi Gantalu serial expected episode 345 january 27th 2024 here is full story

ఈ విషయం తెలిసి శృతి వెళ్ళిపోతే..నీకు కూడా ఇంట్లో చోటు ఉండదంటూ వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత మీనా బాలుకు కంటిన్యూస్గా ఫోన్ చూస్తూ ఉండగా లిఫ్ట్ చేస్తాడు. దీంతో మీనా అసలు విషయం చెబుతుంది. దీంతో కంగారుగా బాలు ఇంటికి బయలుదేరుతారు. బాలు రాగానే ప్రభావతి రెచ్చిపోతుంది. రూమ్ కు ఎందుకు తాళం వేసుకొని వెళ్లావ్? అని ప్రశ్నిస్తుంది.
మేము మాత్రమే అడ్జస్ట్ కావాలా.. అదే రెండు రోజులు మనోజ్ కాదు ఇవ్వొచ్చు కదా.. అనవసరంగా నా మీద ఎందుకు నిందలు వేస్తున్నారని బాలు రెచ్చిపోతాడు.

అప్ కమింగ్ ఎపిసోడ్ లో ప్రభావతి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ మీనా ఏడుస్తుంది. 'మీకు ఇష్టవచ్చినట్టు రూమ్ కు తాళం వేసుకొని వెళ్తారు. మాటలు పడాల్సింది. అవమానాలు ఎదుర్కోవాల్సి నేను. మన రూమ్ అవసరం లేదు. రవి వాళ్లకు ఇవ్వమని బాలుని రిక్వెస్ట్ చేస్తుంది. అసలేం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావ్ ? అని బాలు అడిగితే ఏం చెప్పదు. రోహిణి ఏమైనా అన్నదా? లేదా? మనోజ్ ఏమైనా అన్నాడా అంటూ దీంతో ప్రభావతి కంగారుపడుతుంది. మీనా తన పేరు ఎక్కడ చెబితే బాలు ఎలా రియాక్ట్ అవుతాడోనని ప్రభావతి భయపడుతుంది.

ఆ తరువాత పక్కనే ఉన్న మనోజ్ ని అడిగితే నేను ఇప్పుడే ఇంటికి వచ్చా అంటాడు. ఇక రోహిణిని అడిగితే నేను ఎం చెయ్యలేదు అంటుంది రోహిణీ. దీంతో బాలుకి మరింత కోపం వస్తోంది. మర్యాదగా ఏం జరిగిందో చెప్పమని అరుస్తాడు.దీంతో రోహిణి అసలు విషయం చెబుతుంది. మీనా ను ప్రభావతి అన్న మాటలను చెప్తుంది. ఒక్కరోజు కూడా మొగుడు లేకుండా నిద్రపోలేవా అని అత్తయ్య అవమానించిందనీ రోహిణి అసలు విషయం చెబుతుంది. మరోవైపు సత్యం కూడా వారి మాటలు వింటుంటాడు.

వెంటనే సత్యం ఇంట్లోకి వస్తాడు.బాలు జరిగిన విషయాన్ని తన తండ్రికి చెబుతాడు. మీ భార్య నా భార్యను ఇలా అవమానించిందని, ఒక ఆడపిల్లతో మాట్లాడే విధానం ఇదేనా అంటూ ప్రశ్నిస్తాడు బాలు. దీంతో అవమానంగా భావించిన సత్యం.. తాను ఇక నుండి హాలోనే పడుకుంటానంటూ.. తన చాప, దిండును తీసుకొచ్చి హాల్లో వేసుకుంటాడు. ఇకపై తాను ఇక్కడనే పడుకుంటానని, హాలోనే కూర్చుంటాడు. దీంతో ప్రభావతి షాక్ అవుతుంది. సత్యం తీసుకున్న సంచలన నిర్ణయానికి ప్రభావతి ఎలా రియాక్ట్ అవుతుందో? బాలు ఎలా స్పందిస్తాడో? అనేది చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X