Gunde Ninda Gudi Gantalu: అర్థరాత్రి చిచ్చు రాజేసిన ప్రభావతి.. బాలు సంసారాన్ని రోడ్డున పడేసిన సత్యం..
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్ లో శ్రుతికి జ్యూస్ ఇచ్చిన రోహిణి చెబుతుంది. దీంతో ప్రభావతి మారిపోయిందని, రోహిణికి గౌరవం తగ్గిపోయిందని బాలు కామెంట్ చేస్తాడు. బాలు అన్నట్లే ప్రభావతి శృతికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, శృతికి దగ్గరుండి తనతో పెడిక్యూర్ చేయించడంతో రోహిణి కూడా ఫీలవుతుంది. ఎలాగైనా తన గౌరవాన్ని తిరిగి తెచ్చుకోవాలని భావిస్తుంది. ఈ మేరకు ఓ కన్నింగ్ ప్లాన్ వేస్తుంది. ప్రతినెల ప్రభావతికి పాకెట్ మనీ ఇచ్చి, తన రెస్పెక్ట్ ను తిరిగి తెచ్చుకోవాలని భావిస్తుంది. అలా రోహిణి తన అత్తకు 5000 ఇచ్చి, తన గౌరవాన్ని తిరిగి తెచ్చుకుంటుంది.
మరోవైపు రోహిణి డబ్బులు ఇచ్చిన విషయాన్ని గమనించిన మనోజ్ తనకు పాకెట్ మనీ కావాలంటూ ప్రాధేయపడతాడు. కానీ తాను ఇవ్వలేదని, ఇప్పటికైనా జాబ్ చూసుకోవాలని, లేకపోతే డైనింగ్ టేబుల్ ని కోర్టు టేబుల్ గా బాలు మారుస్తాడని, అప్పుడు మనిద్దరం ఇంట్లో ఉండి బయటికి వెళ్లాల్సి వస్తుందని మనోజ్ వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి. ఇక బాలు ఇంటికి రాగానే మీనా రూమ్ లోకి తీసుకువెళ్లి సీరియస్ గా మాట్లాడుతుంది. మనం కూడా పాకెట్ మనీగా కొంత డబ్బు అత్తయ్యకి ఇద్దామని అంటుంది. నెల నెల ఖర్చులకు డబ్బులు ఇస్తున్నాం కదా .. మళ్లీ పాకెట్ మనీ ఏంటి ? అని బాలు అడుగుతాడు. రోహిణి పాకెట్ మనీగా రూ. 5000 లు ఇచ్చిందనీ, అసలు విషయం చెబుతోంది. నెలనెలా ఖర్చులకు డబ్బులు ఇవ్వడమే కాకుండా తన తల్లికి డబ్బులు ఇవ్వడం వెనక ఏదో ఉందని, రోహిణి ఏదో పెద్ద సీక్రెట్ దాచిపెడుతుందని బాలు భావిస్తాడు.

త్వరలోనే మలేషియా కథ ఏంటో? రోహిణి బాగోతమేంటో తాను బయట పెడతానని బాలు అంటాడు. ఇక అప్ కమింగ్ ఎపిసోడ్ లో ప్రభావతి తన ప్లాన్ ప్రకారం.. బాలుని మీనాను ఇంట్లో నుండి పంపించాలని ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే పరిస్థితులను క్రియేట్ చేస్తుంది. అలా ప్రభావతి అర్ధరాత్రి సడన్ గా లేచి.. తనకు నిద్ర పట్టడం లేదనీ, తనకు సపరేట్ రూమ్ కావాలని, తన బాధలను ప్రభావతి సత్యం చెబుతుంది. అలాగే.. బాలు, మీనా వల్ల రోజుకో గొడవ జరుగుతుందనీ, వారిని ఇంట్లో నుంచి పంపించాలని ప్రభావతి అంటుంది. దీంతో సత్యం కూడా వారిని ఇంట్లో నుంచి బయటకు పంపించడమే కరెక్ట్ అని భావిస్తాడు.
మరుసటి రోజు బాలు అర్జెంటుగా బయటకు వెళ్తుంటాడు. దీంతో ప్రభావతి .. బాలుకి అడ్డుపడి.. ఆపుతుంది. దీంతో మీనా రియాక్ట్ అయి.. ఆయనకు అర్జెంటుగా ట్రిప్ వచ్చిందని, వెళ్లనివ్వమని అంటుంది. తాను అంతకంటే.. ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలని, నిన్ను, మీనా ను ఇంట్లో నుండి పంపించి, వేరు కాపురం పెట్టించాలి నిర్ణయించుకున్నాం. అంటూ అసలు విషయాన్ని బయటపడుతుంది ప్రభావతి. దీంతో ఇంటిల్లిపాది షాక్ అవుతారు. బాలు మీనాలను ఇంట్లో నుండి పంపించడమేంటని శ్రుతి, రవి అడుగుతారు.
ఇంతలోనే సత్యం ఇంటికి వస్తాడు. వెంటనే బాలు తన తండ్రి దగ్గరికి వెళ్లి.. అమ్మ చెప్పింది నిజమేనా ? అని అడుగుతాడు. అవును మీ అమ్మ చెప్పేది అందుకు 100% నిజం. నీతో పడలేకపోతున్నా.. నువ్వు పెట్టే టార్చర్ భరించలేకపోతున్నాను. నిన్ను ప్రతిసారి సమర్ధించలేక అలసిపోయాను అంటూ అసలు విషయం బయట పెడతాడు సత్యం. మనుషులమే దూరంగా ఉంటాం.. కానీ ఒకరికొకరు కలిసే ఉంటాం. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోండి అంటూనే ఈ రోజే ఇల్లు మారాలి అని సత్యం చెబుతాడు. దీంతో బాలు, మీనా లు షాక్ అవుతారు. అసలేం జరుగుతుందో అర్థం కాక.. బాధపడతారు. తన తండ్రి నిర్ణయానికి బాలు కట్టుబడతాడా? లేదా ఆ నిర్ణయాన్ని ఎదిరిస్తాడా అనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications










