Gunde Ninda Gudi Gantalu : బాలు సంచలన నిర్ణయం.. బయట సంజూ భాగోతం.!
శుక్రవారం ఎపిసోడ్ లో తిరిగి జాబ్ లో చేరమని, ఆఫీసు నుండి కాల్ వస్తుంది. ఈ విషయాన్ని తన భర్త సంజు చెప్పగా వద్దని వాదిస్తాడు. పెళ్ళికి ముందు జాబ్ చేసుకోవచ్చని చెప్పారుగా.. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటని మౌనిక ప్రశ్నించగా.. పెళ్లి కోసం సవాలక్ష అబద్ధాలు ఆడతామని, అయినా నీ మీద ప్రేమతో కాదు .. మీ అన్నయ్యల మీద పగతో పెళ్లి చేసుకున్నానని సంజు అసలు విషయాన్ని బయట పెడతాడు. మరోసారి జాబ్ చేస్తానంటూ తన దగ్గరికి వస్తే బాగోదని వార్నింగ్ ఇస్తాడు. పైగా ఆఫీసులో ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా అంటూ అవమానిస్తాడు. ఇదిలా ఉంటే శృతి, రవి కారు కొనడానికి షోరూం కు వెళ్తారు. అక్కడ మనోజ్ పనిచేస్తున్నాడని రవి భావిస్తాడు.
కానీ, మనోజ్ జాబ్ లేకుండా.. ఖాళీగా తిరుగుతున్న విషయం రవికి తెలియదు. అలా షో రూమ్ లో మన గురించి అడగ్గా.. మనోజ్ అనే పేరుతో ఇక్కడ ఎవరూ లేరని చెప్తారు. దీంతో రవి వెంటనే మనోజ్ కి ఫోన్ చేసి మాట్లాడుతాడు. దీంతో షాక్ అయినా మనోజ్ తన బంఢారం ఎక్కడ బయటపడుతుందోనని భయపడతాడు. కానీ, ఒకసారి అక్కడున్న వారికి ఇవ్వమని తాను ఆ బ్రాంచ్ లో కాదని హెడ్ ఆఫీస్ లో సీనియర్ మేనేజర్ గా పని చేస్తున్నాను అంటూ తెగ బిల్డప్ ఇస్తాడు. దీంతో రవి, శృతి కూడా మనోజ్ హై రేంజ్ లో జాబ్ చేస్తున్నాడని నమ్ముతారు. పైగా నెక్స్ట్ వీక్ న్యూ సేల్స్ వస్తాయని, అప్పుడు తానే కారుపై భారీ డిస్కౌంట్ ఇస్తానని, ఇప్పుడు కార్ కొనవద్దు షోరూమ్ నుండి పంపించేస్తాడు. అలా మనోజ్ ఓ గండం నుండి బయటపడతాడు. మరోవైపు బాలు తన చెల్లెలు చూడాలనిపించి మౌనిక పనిచేసే ఆఫీసుకు బాలు వెళ్తాడు. అయితే.. మౌనిక పనిచేయడం లేదని, జాబ్ మానేసిందని అక్కడ చెప్తారు దీంతో బాలు చాలా బాధపడతాడు. అసలు జాబ్ మానేయడానికి కారణం ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు.

అప్ కమింగ్ ఎపిసోడ్ లో బాలు తన చెల్లెలు మౌనికకు బాలు ఫోన్ చేస్తాడు. కానీ సంజు పక్కనే ఉండడంతో ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కానీ బాలుకు అసలు విషయం తెలియక కంటిన్యూగా ఫోన్ చేస్తూనే ఉంటాడు. బాలు నుండి ఫోన్ వస్తే.. మాట్లాడవద్దని, తాను ప్రతినెల కాల్ డేటా చెక్ చేస్తానని, బాలు నుండి మిస్డ్ కాల్స్ మాత్రమే ఉండాలని కాదని ఫోన్ మాట్లాడితే బాగోదంటూ వార్నింగ్ ఇస్తాడు. దీంతో మౌనిక తన పరిస్థితిని తలుచుకుంటూ బాధపడుతుంది. తన ఆవేదనను ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక తనలో తానే మనోవేదనకు గురవుతుంది. మరోవైపు బాలు తన చెల్లెలు మౌనికతో మాట్లాడాలని, ఈ ఈ విషయంపై మాట్లాడడానికి సంజు దగ్గరికి వెళ్లాలని భావిస్తాడు. కానీ మీనా వద్దని అడ్డుకుంటుంది. ఈ విషయాన్ని తన మామయ్యకు చెప్పి బాలుని అడ్డగించే ప్రయత్నం చేస్తుంది. సత్యం కూడా బాలుని వెళ్లవద్దంటూ చెబుతాడు. మౌనిక జాబ్ చేయడం లేదని అసలు విషయం చెప్తాడు బాలు. దీంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. మౌనిక జాబ్ మానేయడంతో వారు కూడా బాధపడతారు. ఈ విషయంలో తాడోపేడో తేల్చుకోవడానికి తాను సంజు దగ్గరికి వెళ్తున్నానని చెప్తాడు బాలు. ఇందులోనే మౌనిక తన పుట్టింటికి కారులో వస్తుంది. దీంతో అందరూ ఆశ్చర్యపోతారు.
మరో వైపు సడన్గా మౌనిక పుట్టింటికి రావడంతో.. షాక్ అవుతారు. ఈ సమయంలో అత్తవారింట్లో ఎలా ఉందని, సంజు ఎలా చూసుకుంటున్నాడని అడుగుతారు. అసలు విషయం చెప్పకుండా మౌనిక దాచిపెడుతుంది. తనని మహాలక్ష్మిలా చేసుకుంటున్నారని అబద్దం చెబుతుంది. ఈ సమయంలో బాలు తన చెల్లెలితో మాట్లాడుతూ.. జాబ్ ఎందుకు మానేశావని అడుగుతాడు. సత్యం కూడా ఈ విషయంపై మాట్లాడుతూ పెళ్లికి ముందు జాబ్ చేసుకోవచ్చని చెప్పారు కదా ఇప్పుడు ఇలా చేయడం ఏంటి అని ప్రశ్నిస్తాడు. మరోవైపు మృతి మాట్లాడుతూ సంజు సైకో లాగా ప్రవర్తించడం లేదు కదా అని డైరెక్ట్ గా అడిగి చేస్తుంది. ఇలా వరుసగా ఒకరి తర్వాత మౌనిక అత్తగారి ఇంటి గురించి అడిగి తెలుసుకుంటారు. అయితే మౌనిక తన బాధలను పుట్టింటి వారికి చెబుతుందా? ఒకవేళ చెబితే బాలు ఎలా రియాక్ట్ అవుతాడు? మౌనిక తన తల్లి పై ఆగ్రహం వ్యక్తం చేస్తుందా అనేది ఉత్కంఠగా మారింది.


Click it and Unblock the Notifications











