Gunde Ninda Gudi Gantalu : బాలుపై మనోజ్ నింద.. కన్నకొడుకునే దోషిగా తేల్చిన ప్రభావతి..!

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ రోజు రోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. బాలు పార్క్ కెళ్లి మనోజ్ వ్యవహారం అంతా ఫోన్ లో రికార్డు చేసిన సంగతి తెలిసిందే. జాబ్ లేకుండా పార్క్ లో మనోజ్ సేదతీరుతూ ఏం చేస్తున్నాడనేది మొత్తం ఇంట్లో వాళ్లకు చూపిస్తాడు. సొంత అన్న గుట్టురట్టు చేసి మనోజ్ రోజు చెప్పే అబద్ధాలను కట్టడి చేస్తాడు.

ఇక మనోజ్ వ్యవహరం ఇంట్లో వారందరికీ తెలియడంతో కుటుంబ సభ్యులంతా ఎంతో చింతిస్తారు. ముఖ్యంగా తండ్రి సత్యం చాలా బాధపడుతాడు. కన్నకొడుకు చేసే మోసాన్ని కనిపెట్టలేకపోయినందుకు అవమానంగా భావిస్తాడు. ప్రభావతి కూడా కొడుకు చేస్తున్నది తప్పు అని చెప్పకపోవడం... జాబ్ లేకపోతే లేదని ముందే చెప్పి అతన్ని సరిచేసి ఉంటే బాగుండేదని మండిపడ్డాడు. ఇక మనోజ్ జాబ్ పేరు చెప్పి గతంలో మీనాను ఎంతలా బాధపెట్టాడో.. తనను కూడా ఎన్ని మాటలన్నాడో అన్నీ గుర్తు చేస్తూ దెప్పిపోడుస్తాడు బాలు.

Gunde Ninda Gudi Gantalu serial Expected episode 370 March 1st 2025 here is full story

మనోజ్ పార్క్ వీడియో చేసిన తర్వాత భార్య రోహిణి అవమానంగా ఫీలవుతుంది. మీనా, బాలు, రవి, శృతి అన్న మాటలకు చిన్నబోతుంది. ఆమె తల కొట్టేసినట్లైయిందని ఆమె బెడ్ రూమ్ లోకి వెళ్లి ఏడుస్తుంటుంది. మనోజ్ ను ఎంతో నమ్మినందుకు ఇన్నాళ్లు జాబ్ లేదనే నిజాన్ని దాచిపెట్టాడని బాధపెడుతుంది. తల్లి ప్రభావతికి చెప్పినట్టే తనకు కూడా చెప్పాల్సిందని మనోజ్ తో వారిస్తుంది. ఎంతో గుడ్డిగా నమ్మి పెళ్లి చేసుకున్నందుకు తనను అవమానించాడని గుక్కపెట్టి ఏడుస్తుంది. తను ముట్టుకోవద్దని, తన దగ్గరకు రావొద్దని బిగ్గరగా అరుస్తూ దూరం చేస్తుంది.

ఇక ఇదే విషయాన్ని తన స్నేహితు రాలితో రోహిణి పంచుకుంటుంది. కానీ అప్పటికే మనోజ్ కు తెలియకుండా పార్లల్, చిన్నప్పటి పెళ్లి విషయాలను దాచి పెట్టిన రోహిణిని తన ఫ్రెండ్ హెచ్చరిస్తుంది. మనోజ్ చేసింది తప్పైతే నువ్వు చేసింది క్షమించరాని తప్పే. మనోజ్ అంతలా నిందించాల్సిన అవసరం లేదు అని చెబుతుంది. అప్పటి ఇంట్లో నుంచి ఎవ్వరికి చెప్పకుండా బయటకి వచ్చేసిన రోహిణి గురించి ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది. రోహిణి కనిపించకపోవడంతో మనోజ్ కంగారు పడుతాడు. ఎక్కడి వెళ్లిందోనంటూ తనకు తెలిసిన వారందకీ ఫోన్ చేసి కనుక్కుంటాడు.

Gunde Ninda Gudi Gantalu serial Expected episode 370 March 1st 2025 here is full story

ఎవ్వరికీ ఫోన్ చేసినా తమ వద్ద లేదనే సమాధానమే వస్తుంది. ఇక రోహిణి ఫ్రెండ్ కూడా తన వద్దకు రాలేదని అబద్ధం చెబుతుంది. దీంతో రోహిణికి ఏమైందోనని కంగారు పడుతుంటాడు. ఇదే విషయం తల్లి ప్రభావతికి తెలిసి కూడా ఆందోళన చెబుతుంది. అప్పుడే బాలు ఎప్పటిలాగే తన మాటలతో కోపం వచ్చేలా చేస్తాడు. అసలు రోహిణి వెళ్లిపోవడానికి కారణం నువ్వేనంటూ మనోజ్ చిర్రెత్తిపోతాడు. బాలు కాలర్ పట్టుకొని మరీ నిలదీస్తాడు. కానీ మనోజ్ భాగోతం అంతా తెలిసిపోవడంతో భయంపోకి అన్నపై చేయికూడా చేసుకుంటాడు.

మనోజ్ ను కొట్టడంతో ఘర్షణ మరింత ముదురుతుంది. రోహిణి మేటర్ సైడ్ క్ వెళ్లిపోయి.. బాలు వర్సెస్ మనోజ్ గా మారుతుంది. అసలు రోహిణి నీ అబద్ధాల వల్లే వెళ్లిపోయిందంటూ మనోజ్ ను బాలు నిందిస్తాడు. కాదు నీ ఎక్ట్సాల వల్లే రోహిణికి ఇంట్లో నుంచి వెళ్లే దుస్థితి వచ్చిందని ప్రభావతి బాలుపై మండిపడుతుంది. ఇదంతా చూసి తట్టుకోలేక తండ్రి సత్యం జోక్యం చేసుకుంటాడు. ఇద్దరు కొట్టుకు చావండి అంటూ ఫైర్ అవుతాడు. మరోవైపు వారిద్దరి ఘర్షణ చూసి భయాందోళన చెందుతాడు. తండ్రి జోక్యంతో గొడవ సర్దుమణిగి అంతా శాంతిస్తారా? రోహిణి గురించి ఆరా తీస్తారన్నది ఇక తరువాయి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X