Gunde Ninda Gudi Gantalu March 10th : మనోజ్ తిప్పలు.. రోహిణిని ఇరకాటంలో పెట్టిన శృతి? బాలు ట్విస్ట్!
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ మార్చి 10వ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.రోజు రోజుకు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మనోజ్ కు జాబ్ లేదని అందరికీ బాలు వీడియో ప్రూఫ్ చూపించి మరీ గుట్టురట్టు చేసిన సంగతి తెలిసిందే. దొరికిందే సందుగా బాలుపై మనోజ్ పంచుల వర్షం కురిపిస్తున్నాడు. గతంలో మనోజ్ తనను అనరాని మాటలు అన్నాడని బాలు మాటల తూటాలను పేల్చుతున్నాడు. ప్రతి అవమానికి ప్రస్తుతం తన కర్కషమైన మాటలతో తీర్చుకుంటున్నాడు.
గతంలో భార్య మీనాను ఎంతో ఇబ్బంది పెట్టిన బాలు ప్రస్తుతం ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. మీనాకు ఏమాత్రం తన ఇంట్లో అసౌకర్యం కలగకుండా జాగ్రత్త పడుతున్నాడు. అన్నీ తానై మీనాను సంతోషంగా చూసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మీనాకు పూలకొట్టుపెట్టించి స్వయం ఉపాధి కల్పిండాడు. అలాగే ఇంటి పనుల్లోనూ తానే ఒత్తిడికి లోనవుతుండగా.. తల్లి ప్రభావతి, మనోజ్, రోహిణి, శృతిలను ఎవరి పనులు వారు చేసుకోవాలని కొద్దిరోజులుగా హెచ్చరిస్తున్నాడు. ఈ క్రమంలోనే మనోజ్ కు జాబ్ లేదని తెలియడంతో కథ మరో మలుపు తిప్పుకుంది.

మనోజ్ కు మద్దతుగా మాట్లాడే తల్లి ప్రభావతి, రవి, శృతిలను కూడా ఏకి పారేస్తున్నాడు. ఇక ఇంట్లో నుంచి వెళ్లిపోయిన రోహిణి తిరిగి వచ్చినా బాలు మాత్రం తన మాటల్లో పదును తగ్గించడం లేదు. ఇక ప్రస్తుతం మనోజ్ ఉద్యోగ వేటలో పడ్డాడు. మరోవైపు మీనాపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రభావతి వ్యూహాలు రచిస్తోంది. మీనా ఏమాత్రం భయపడటం లేదు. మరోవైపు రోహిణి కూడా మీనాను సూటిపోటీ మాటలు అంటోంది. దీంతో మీనా వర్సెస్ ప్రభావతి, రోహిణి అన్నట్టుగా స్టోరీ నడుస్తోంది. ఇన్నాళ్లు మెత్తగా ఉన్న మీనా ప్రస్తుతం ఇంట్లో ఎవ్వరినీ లెక్కచేయడం లేదు. తనపై అధికారం చెలాయించాలని చూస్తే ఏకీపారేస్తోంది.
ఇక ప్రస్తుతం మనోజ్ ఉద్యోగం కోసమని ఎంత వెతికినా ఫలితం లేకుండాపోయింది. గతంలో రోహిణి ఇచ్చిన రెఫరెన్స్ కంపెనీకే మళ్లీ ఇంటర్వ్యూకు వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా మొదటలో మనోజ్ చూపించిన పొగరుకు లేడీ బాస్ గట్టిగా బుద్దిచెప్పింది. మహిళా ఉద్యోగులకు రెస్పెక్ట్ ఇవ్వని నీలాంటి వాళ్లకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఉద్యోగ అవకాశం ఇచ్చేదే లేదని స్పష్టం లేదని తేల్చింది. మనోజ్ ఎంత బ్రతిమిలాడిన లేడీ బాస్ కనుకరించలేదు. ఇక మరోవైపు మీనాను మరింత మంచిగా చూసుకునేందుకు బాలు ప్రయత్నాలు చేస్తున్నాడు.
మీనా ఒంటిపై బంగారం లేకపోవడంతో 30 వేల రూపాయాలను తీసుకుని వచ్చి భార్యకు ఇచ్చాడు. ఏడాదికింత బంగారం కొని ఒంటినిండా నింపేస్తానని హామీనిచ్చాడు. బాలు మాటలకు మీనా ఉప్పొంగిపోతుంది. గతంలో ఎంతో గొడవపడిన బాలునే తనతో ప్రేమగా ఉండటంతో ఆనంద పడుతుంది. ఇదిలా ఉంటే.. రోహిణి, శృతి మధ్య సాగిన సంభాషణ ఆసక్తికరంగా మారింది. బాలు మాటలు పట్టించుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోతావా? అంటూ శృతి ధైర్యం చెబుతుంది. ఈ క్రమంలోనే శృతి రోహిణిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. తాను ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా.. శృతి ఇచ్చిన ఉచిత సలహాలతో రోహిణి ఇరకాటంలో పడింది.
మనోజ్ కు జాబ్ లేదని ఏమాత్రం బాధపడకు.. నీ పార్లల్ కు సీఈవో ను చేసేయ్ అని శృతి సలహా ఇస్తుంది. అది కాకపోతే మలేషియాలో ఉన్న మీ నాన్నకు చెప్పి కొంత డబ్బు తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయండి అని చెబుతుంది. ఈ మాటలన్నీ విన్న అత్త ప్రభావతి శృతి సరిగ్గా చెప్పిందని వీళ్ల సంభాషణలోకి ఎంట్రీ ఇస్తుంది. మనోజ్ కు బిజినెస్ పెట్టించేందుకు మీ నాన్నతో మాట్లాడు అంటూ రోహిణికి సూచిస్తుంది. కానీ తనకు మలేషియా తండ్రే లేడని వీళ్లకి తెలియకపోవడంతో.. నాన్న కాకపోతే మీ మామయ్య దగ్గర డబ్బులు తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయండి అంటూ శృతి మరో సలహా ఇచ్చింది.
ఇక రోహిణి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. మనోజ్ కు మంచి ఎక్స్ పీరియెన్స్ వచ్చాక మా వాళ్లను డబ్బులు అడుగుతానని, ఇప్పుడే అడిగితే అవమానంగా ఉంటుందని, గతంలో ఇంటి పత్రాల కోసం అడిగాను కదా అని చెప్పి.. దాట వేస్తుంది. ఇక మనోజ్ కు జాబ్ రాకపోతే తను ఇరుక్కునేలా ఉందని టెన్షన్ పడుతుంది. మనోజ్ కు వెంటనే ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో జాబ్ కోసం చేయాలని సూచిస్తుంది. అటు మనోజ్ కూడా తన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయనే చేధు విషయం చెబుతాడు. దాంతో రోహిణి ఇంకా టెన్షన్ పడుతుంది.
ఇక మనోజ్ కు జాబ్ లేకపోవడంతో బాలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడు.. ఎందుకు అలా మాట్లాడాలని రోహిణి, శృతి అభిప్రాయపడుతాడు. ఇప్పటికిప్పుడు జాబ్ ఎలా వస్తుంది. నిదానంగా చూసుకుంటాడు లే అంటూ శృతి రోహిణికి బదులిస్తుంది. ఈ క్రమంలోనే బాలుపై మాటలు వదులుతుంది. మరోవైపు తమ్ముడు రవి కూడా బాలు అన్న మాటలు ఇబ్బందికరంగానే ఉంటున్నాయని చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ మాటలన్నీ విన్న మీనా మండిపడుతుంది. బాలు ఉన్నప్పుడు మాత్రమే ఆయన గురించి మాట్లాడండి అంటూ అందరికీ చెబుతుంది. మీనా మాటలు విన్న ప్రభావతి మండిపడుతుంది.
అప్పటికే ఇంట్లోకి వచ్చిన బాలు తను మనోజ్ విషయంలో ఏమాత్రం తప్పుగా మాట్లాడలేదన్నాడు. చదువు గురించి ఎప్పుడూ తక్కువగా మాట్లాడలేదని, అబద్ధాలు చెప్పకూడదని సూచించినట్టు వివరణ ఇచ్చాడు. అదేవిధంగా తన భార్యను పూలకొట్టు కూలిగా, తనను డ్రైవర్ గా తక్కువ చేసి చూడొద్దని కూడా హెచ్చరిస్తాడు. అప్పటికే జాబ్ ట్రైల్స్ తో ఇంటికి తిరిగి వచ్చిన మనోజ్ పై మళ్లీ బాలు మాటల తూటాలు పేల్చాడు. దాంతో ప్రభావతి, రోహిణి కూడా తిరిగి ధీటుగా బదులిస్తారు. ఇదిలా ఉంటే.. బాలు మీనా దగ్గర 800 అప్పు చేయడం మళ్లీ ఆసక్తికరంగా మారింది. ఎందుకు తీసుకున్నాడనేది, ఏం చేయబోతున్నాడనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ క్రమంలో భార్య డబ్బులు ఇచ్చినందుకు ముద్దుకూడా పెట్టి తన ప్రేమను తెలియజేస్తాడు. తరువాత ఏం జరగబోతుందనేది ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











