Gunde Ninda Gudi Gantalu March 8th : మీనా దెబ్బకు వణికిపోతున్న అత్త ప్రభావతి.. మనోజ్ కు రోహిణి కండీషన్!

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. పాపులర్ సీరియల్ రోజు రోజుకు మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. ఓ వైపు కుటుంబంలో కత్తులు లేని యుద్ధాన్ని చూపిస్తూనే.. మరోవైపు కామెడీ, ఎమోషనల్ సన్నివేశాలతో ఆడియెన్స్ ను కట్టిపడేస్తోంది. కాగా ప్రస్తుతం ప్రభావతి ఇంటిలో ఆసక్తికరమైన సన్నివేశాలు జరుగుతున్నాయి. వారం రోజులుగా మనోజ్ కు జాబ్ లేకుండా పార్క్ లో తిని తిరుగుతుండటంపై ఆసక్తికర సన్నివేశాలు సాగాయి. మనోజ్ బంఢారం బయట పడటంతో సన్నివేశాలు ఉత్కంఠగా మారాయి.

మనోజ్ కు జాబ్ లేదని అందరికీ బాలు వీడియో ప్రూఫ్ చూపించి మరీ గుట్టురట్టు చేసిన సంగతి తెలిసిందే. దొరికిందే సందు అన్నట్టుగా బాలుపై మనోజ్ గతంలో చేసిన అన్ని ఘటనలను గుర్తుచేసుకొని మరీ పంచుల వర్షం కురిపిస్తున్నాడు. అనరాని మాటలు అన్నాడని మాటల తూటాలతను తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు. మనోజ్ కు మద్దుగా మాట్లాడే ప్రయత్నం చేసిన రవి, శృతిలను కూడా ఏకి పారేస్తున్నాడు. ఇక మొదటి నుంచి మనోజ్ పై ఒకింత ఎక్కవ ప్రేమ కురింపిచిన తల్లి ప్రభావతిని కూడా లెక్క చేయకుండా మాట్లాడుతున్నాడు.

Gunde Ninda Gudi Gantalu serial Expected episode 375 March 8th 2025 here is full story

ప్రస్తుతం ప్రభావతి ఇంట్లో మనోజ్ గుట్టురట్టు కావడంతో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. రోహిణి ఇంట్లో నుంచి వెళ్లిపోయి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆమె తప్పును కూడా తన స్నేహితురాలు దివ్య, తల్లి సుగుణమ్మ కూడా ఎత్తి చూపించి తిరిగి మనోజ్ దగ్గరకు వచ్చేలా చేశారు. ఇక అత్తవారింటికి తిరిగి వచ్చిన రోహిణి తన భర్తతో మళ్లీ కలిసిపోయింది. గతాన్ని మర్చిపోయి మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే రోహిణికి మనోజ్ జాబ్ విషయం సవాల్ గా మారింది.

ఇక మనోజ్ కూడా కొత్త జాబ్ చూసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో గతంలో రోహిణి రెఫర్ చేసిన కంపెనీలోకే ఇంటర్వ్యూకు వెళ్తాడు. అప్పుడు ఆ కంపెనీకి లేడీ బాస్ ఉందని, ఆడవాళ్ల కింద పనిచేయడం తనకు ఇష్టలేదని పొగరు చూపించిన మనోజ్ మళ్లీ అదే కంపెనీకి ఇంటర్వ్యూకు వెళ్లడం మార్చి 7వ ఎపిసోడ్ లో ఆసక్తికరంగా మారింది. ఇక ఆ లేడీ బాస్ గతాన్ని గుర్తు చేసిన మరీ మనోజ్ తలపొగరుకు గట్టిపెట్టింది. ఇక మనోజ్ తను మారిపోయాడని తనకు ఉద్యోగం ఇవ్వాలని లేడీ బాస్ ను బతిమిలాడుతాడు. కానీ ఆమె ససేమిరా ఒప్పుకోదు. దాంతో ఉద్యోగం లేకుండా బాలు ఇంటికి తిరిగి వెళ్తాడా? లేకా ఎలాగైనా లేడీ బాస్ ను ఒప్పించి ఉద్యోగంతో వెళ్తాడా? అన్నది సస్పెన్స్ గా మారింది.

Take a Poll

మరోవైపు మనోజ్ గుట్టురట్టు కావడంతో బాలు పంచుల వర్షం కురిపిస్తున్నారు. సందు దొరికినప్పుడల్లా భార్య కూడా తన మాటలతో గతంలోని అవమానాలకు బదులిస్తోంది. ఒక్కొక్కరిని ఏకీపారేస్తోంది. తన భర్త జోలికి వస్తే ఏమాత్రం సహించడం లేదు. ఈ క్రమంలో అత్త ప్రభావతితో మీనాకు తగ్గపోరు నడుస్తోంది. మరోవైపు రోహిణికి కూడా మీనా తన మాటలతో చురకలు అంటిస్తోంది. లేటెస్ట్ ఎపిసోడ్ లో బాలు లేని సమయంలో మీనాను భయపెట్టేందుకు, తనపై అజమాయిషీ చలాయించేందుకు అత్త ప్రభావతి ఎంతగానో ప్రయత్నిస్తోంది.

కానీ మీనా ఏమాత్రం తగ్గడం లేదు. ప్రభావతి పిట్ట బెదిరింపులకు ఎంత మాత్రమూ భయపడటం లేదు. అయితే ప్రభావతి, రోహిణి మీనాపై ప్రతీకారం తీర్చుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. తమ మాట ఏమాత్రం వినడం లేదని, పూల కొట్టు పెట్టుకున్న తర్వాత మీనాకు పొగరు తలకెక్కిందని అభిప్రాయపడుతున్నారు. కోడలు మీనాపై సమయం వచ్చినప్పుడల్లా, మరోవైపు కావాల్చుకొని మరీ కారాలు మిర్యాలు నూరుతోంది. ఈ పరిణామాల మధ్య మీనా, ప్రభావతి మధ్య ఓ పెద్ద యుద్ధమే నడుస్తోంది. వీరి ఘర్షణ ఎటువైపు దారి తీస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు మనోజ్ ఉద్యోగం విషయంలో ఏం జరుగుతుందనేది ఇంకా ఉత్కంఠను రేపుతోంది. వీటన్నింటికి రాబోయే ఎపిసోడ్ లో సమాధానాలు దొరకనున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X