Gunde Ninda Gudi Gantalu March 11th : బాలుపై అలాంటి కుట్ర? రోహిణికి బిగుస్తున్న ఉచ్చు!
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతోంది. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ మార్చి 11న మరింత ఆసక్తికరంగా సాగింది. మనోజ్ కు జాబ్ లేకపోవడంతో బాలు సెటైర్లు వేయడం, సందు దొరికినప్పుడల్లా అన్న మనోజ్ పై మండిపడుతున్నాడు. తన భర్తపై ఎందుకు అలా మాట్లాడాలని రోహిణి ఫైట్ చేస్తోంది. ఈ క్రమంలోనే రోహిణికి శృతి, రవి కూడా మద్దతు తెలుపుతున్నారు. తల్లి ప్రభావతి మొదటి నుంచే మనోజ్ కు విపరీతమైన సపోర్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక సత్యం, బాలు, మీనా ఓవైపుగా ఉండి కథను నడిపిస్తున్నారు.
మనోజ్ కు జాబ్ లేకపోవడంతో ప్రస్తుతం కథ ఆసక్తికరంగా మారింది. జాబ్ ట్రైల్స్ లో మనోజ్ కు ఎదురుదెబ్బలు తగులుతుండటం, మరోవైపు తన భర్త మనోజ్ కు ఏదైనా బిజినెస్ పెట్టించామని వెనకాల ధనవంతుడైన తండ్రి లేకున్నా ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్న రోహిణికి అత్త ప్రభావతి, శృతి సూచిస్తారు. దీంతో మనోజ్ కు జాబ్ లేకపోవడంతో సమస్య తనవైపు తిరిగేలా ఉందని రోహిణి భయంతో వణికిపోతోంది. మలేషియాలో తనకు తండ్రి ఉన్నాడని, ధనవంతుడైన మామయ్య కూడా ఉన్నాడని గతంలో చెప్పిన రోహిణికి ఇప్పుడు చిక్కులు ఎదురవుతున్నాయి.

ఎలాగోలా ఇప్పుడైతే మొత్తానికి మనోజ్ సరిగా పనిచేశాక పెట్టిద్దామని సాకు చెప్పి తప్పించుకుంటుంది. ఈ క్రమంలోనే రోహిణి బాలు అంటున్న సూటిపోటు మాటలకు మండిపోతుంది. మరిదిపై మాటలు వదులుతుంది. బాలు భార్య మీనా కూడా తన భర్తను అంటే ఏమాత్రం ఊరుకోనని హెచ్చరిస్తుంది. ధైర్యం ఉంటే అతను ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడాలని, లేనప్పుడు మాటలు అంటే ఊరుకునేది లేదని స్పష్టం చేసింది. అప్పటికే బాలు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి అందరికీ లెఫ్ట్ రైట్ ఇచ్చేస్తాడు. ఇక జాబ్ లేకుండా మనోజ్ ఇంటికి తిరిగి రావడంతో మళ్లీ తన మాటలతో బాలు రెచ్చిపోతాడు.
ఇక బాలు మీనా దగ్గర తీసుకున్న డబ్బులతో హల్వా తీసుకొస్తాడు. అదే సమయంలో మనోజ్ జాబ్ లేకుండా ఉట్టి చేతులతో హాల్లోనే కనిపిస్తాడు. తల్లి ప్రభావతి ఓదార్చుతుంది. అదంతా చూసిన బాలు తనదైన శైలిలో మనోజ్, ప్రభావతిపై పంచులు కురిపిస్తాడు. అంతేకాదు గతంలో తనది డ్రైవర్ జాబ్ అని, ఎదుగుదల ఉండదని, కనీసం పెళ్లానైనా సరిగా చూసుకోలేడని అన్నారు కాదా.. ఇప్పుడు చూడండి నా పెళ్లానికి హల్వా తీసుకొచ్చాను చూడండి అంటూ.. అందరి ముందే మీనాకు తినిపిస్తాడు. ఇక బాలు మనోజ్ పై కొంచెం డోస్ పెంచడంతో రోహిణి చాలా బాధపడుతుంది. బాలు మాటలను గుర్తు చేసుకుంటుంది.
అయితే, మనోజ్ కు జాబ్ లేకపోవడం, బాలు రెచ్చిపోతుండటంతో దీనికి ఒకే ఒక్క పరిష్కారం ఉందని ప్రభావతి రోహిణికి చెబుతుంది. తన తండ్రి మలేషియా నుంచి పిలిపించి మాట్లాడూ అంటూ రోహిణికి సలహా ఇస్తుంది. కానీ అలాంటి తండ్రే లేని రోహిణి అత్త ప్రభావతికి సమాధానం చెప్పేందుకు తటపటాయిస్తుంది. ఈ సమస్య నుంచి బయట పడేందుకు పరిష్కార మార్గాలు వెతుకుతుంటుంది. మరోవైపు ప్రభావతి, సత్యం.. కూతురు టాపిక్ తెరపైకి వస్తుంది. కూతురు మౌనిక పెళ్లై చాలా ఏళ్లు అవుతున్న సందర్భంగా తాళి మార్చే ఫంక్షన్ చేయాలని ప్రభావతి కోరుకుంటుంది. అందుకు సత్యం స్పందిస్తూ.. కూతురు విషయంలో ఉన్న శ్రద్ధ కోడళ్ల మీద ఎందుకు లేదని ప్రశ్నిస్తాడు. మీనా అక్కడికి రావడంతో పూలకంపు కొడుతుందంటూ ప్రభావతి మండిపడుతుంది. దానికి సత్యం ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. పూలకేం తెలుస్తుంది పంది వాసన అంటూ దెప్పిపొడుస్తాడు. కోడలు ముందే ప్రభావతి పరువు తీస్తాడు.
ఇదిలా ఉంటే.. కథ మళ్లీ రోహిణి వాళ్ల నాన్న దగ్గరకు వస్తుంది. తాళి మార్చే ఫంక్షన్ మౌనికాకే కాకుండా... రోహిణికి కూడా చేయాలని మీనా, సత్యం సూచిస్తారు. వెంటనే రోహిణి అభిప్రాయాన్ని తెలుసుకుంటారు. మీ నాన్నను మలేషియా నుంచి పిలిపించు అంటూ ఒత్తిడి తెస్తారు. కానీ ఆమె ఫాదర్ బిజినెస్ కోసమని వరల్డ్ టూర్ లో ఉన్నారని అబద్ధం చెబుతుంది. అలా మళ్లీ తన గుట్టురట్టు కాకుండా కాపాడుకోగలిగింది. ఇక వెంటనే తన ఫ్రెండ్ దివ్య దగ్గరకు వెళ్లి ఇంట్లో జరుగుతున్న అన్నీ విషయాలను చెబుతుంది. మలేషియాలోని తన తండ్రిని పిలిచిపించి మనోజ్ కు కార్ల షోరూం పెట్టించాలని డిమాండ్ చేస్తున్నారని తన బాధను చెప్పుకుంది. ఇక దివ్య స్పందిస్తూ ఇలా ఎన్నాళ్లు అబద్ధాలు చెబుతావు... వెంటనే ఏదైనా పరిష్కారం చూడాలని ఆలోచిస్తుంది.
మరోవైపు మౌనికా తాళి ఫంక్షన్ కు రూ.2.50 లక్షలు ఖర్చు అవుతుందని సత్యం, ప్రభావతికి చెబుతాడు. దాంతో ప్రభావతి ఆందోళన పడుతుంది. ఇదే విషయాన్ని మనోజ్, రవికి తెలియజేస్తాడు. మనోజ్ డబ్బులు లేనప్పుడు ఇలాంటి ఫంక్షన్లు ఎందుకంటాడు. దాంతో మనోజ్ పై ప్రభావతి మండిపడుతుంది. ఇక విషయం తెలుసుకున్నాక శృతి ఆ డబ్బులన్నీ ఇస్తానని చెబుతుంది. అలాగే రోహిణి కూడా ఎంతో కొంత సర్దుతానని హామీనిచ్చింది. ఇక ఆ బాధ్యతను బాలుపైనే మొత్తం ఎత్తుకుంటాడు. ఆ ఖర్చు మొత్తం బాలునే భరిస్తాడని హామీనిస్తాడు. దాంతో మౌనిక అత్తగారింటికి వెళ్లి సత్యం, ప్రభావతిలు మౌనిక తాళి ఫంక్షన్ గురించి మాట్లాడుతారు. కానీ బాలు ఆ ఇంట్లో ఉంటే ఫంక్షన్ కు రాబోమని మౌనిక భర్త, మామ కండీషన్ పెడ్తారు. దాంతో బాలును ఇంట్లో నుంచి పంపించేసి ఫంక్షన్ చేస్తారా? లేక మౌనికా ఫంక్షన్ ఆపేస్తారా? అన్నది రేపటి ఎపిసోడ్ కు వాయిదా పడింది. ఇక మౌనిక తాళి ఫంక్షన్ పై ఎలాంటి నిర్ణయం అవుతుందనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











