Gunde Ninda Gudi Gantalu March 12th : కుటంబ పరువు నిలబెట్టిన బాలు.. మౌనికను చిక్కుల్లో పడేసిన ప్రభావతి!

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతోంది. ఇక మార్చి 12న లేటెస్ట్ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. మనోజ్ కు జాబ్ లేకపోవడంతో బాలు సెటైర్లు వేయడం, సందు దొరికినప్పుడల్లా అన్న మనోజ్ పై మండిపడుతున్నాడు. ఈ క్రమంలోనే బాలు, మనోజ్ మధ్య రసవత్తరమైన సీన్లు సాగుతుంటాయి. మరోవైపు మీనా ప్రభావతి మధ్య కూడా ఆసక్తికరమైన సన్నివేశాలు, సంభాషణలు జరుగుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం మనోజ్ కు జాబ్ దొరుకుతుందా? లేదా అన్న సమస్య ఒకటైతే.. మరోవైపు మౌనిక తాళి ఫంక్షన్ తో మరో ట్విస్ట్ క్రియేట్ అయ్యింది.

అయితే మనోజ్ కు జాబ్ లేకపోవడంతో ప్రస్తుతం కథ ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. జాబ్ ట్రైల్స్ లో మనోజ్ కు ఎదురుదెబ్బలు తగులుతుండటం, మరోవైపు తన భర్త మనోజ్ కు ఏదైనా బిజినెస్ పెట్టించమని మలేషియాలో ఉన్న తన తండ్రికి చెప్పు అని ప్రభావతి ఒత్తిడి తెస్తుంది. తండ్రి లేకున్నా ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్న రోహిణికి అత్త ప్రభావతి, శృతి ఇలా సలహాలివ్వడంతో కథ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. రోహిణి గుట్టు ఎప్పుడు రట్టు అవుందా? అనేది అందరిలో ఉత్కంఠను పెంచుతోంది. మనోజ్ కు జాబ్ లేకపోవడంతోనే ఈ సమస్యంతా తనవైపు తిరిగేలా ఉందని రోహిణి కూడా ఊహిస్తుంది. పరిస్థితిని అంచనా వేసి వెంటనే మనోజ్ ను జాబ్ చూసుకోమని ఒత్తిడి పెంచుతుంది.

Gunde Ninda Gudi Gantalu serial Expected episode 377 March 12th 2025 here is full story

కానీ బాలు మాత్రం ఇంటర్వ్యూలకు అని వెళ్లి ఉట్టి చేతులతో ఇంటికి తిరిగివస్తాడు. దాంతో బాలు తన మాటల తూటాలతో మనోజ్ ను గుక్కతిప్పుకోకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగానే... ప్రభావతి తన కూతురు మౌనికాకు తాళి మార్చే ఫంక్షన్ చేయాలని భర్తకు సూచిస్తుంది. అప్పటికే అదేపనికోసం లెక్కలు వేస్తూ ఉన్న సత్యం అదే అనుకుంటున్నట్టు భార్యతో చెబుతాడు. కానీ ఆ ఫంక్షన్ ను రూ.2 లక్షల పైనే ఖర్చు అవుతుందని చెప్పుతాడు. అటు మనోజ్, ఇటు రవి ఇద్దరు కొడుకులు చేతులెత్తేయడంతో ఆ బాధ్యతను బాలు నెత్తినేసుకుంటాడు. కోడళ్లు రోహిణి, శృతి డబ్బులిస్తామన్నా.. వద్దు తానే స్వయంగా సర్దుబాటు చేస్తానని చెబుతాడు. ఇస్తే తోడబుట్టిన వాళ్లను ఇవ్వమని అన్నదమ్ములను ఏకిపారేస్తాడు.

ఏదేమైనా మౌనికా తాళి మార్చే ఫంక్షన్ కు బాలు డబ్బు సర్దడంతో సత్యం టెన్షన్ పోతుంది. అయితే మౌనిక అత్తవారింట్లో ఫంక్షన్ సంగతి చెప్పేందుకు వెంటనే సత్యం, ప్రభావతి వెళ్తారు. అక్కడ అప్పటికే మౌనికాను తన భర్త నానా రకాలుగా టార్చర్ పెడుతూ ఉంటాడు. కావల్సుకొని మరీ పని చెప్పి మౌనికాను ఇబ్బంది పెడుతాడు. అప్పటికే ఆ ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు మౌనిక పనిమనిషిలా ఫ్లోర్ ఊడుస్తుండటం చూసి షాక్ అవుతారు. కానీ మౌనిక తన మాటలతో కవర్ చేస్తుంది. అయినా తండ్రి సత్యం, తల్లి ప్రభావతి కూతురు మౌనికను చూసి ఎంతో బాధపడుతారు. ఆలోగానే మౌకిన మామ వచ్చి ఆమె తల్లిదండ్రులను ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. వచ్చిన విషయాన్ని తెలుసుకుంటాడు.

Gunde Ninda Gudi Gantalu serial Expected episode 377 March 12th 2025 here is full story

అయితే, మౌనిక తాళి మార్చే ఫంక్షన్ గురించి సత్యం, ప్రభావతి మౌనిక అత్తామామలకు చెబతారు. అయితే వాళ్లు మాత్రం ఓ కండీషన్ పెడ్తారు. ఆమె ఫంక్షన్ చేస్తే తమ స్థాయికి తగ్గట్టుగానే ఇక్కడే చేయాలని ఆదేశిస్తాడు. మీ ఇంట్లో చేస్తే మాత్రం బాలు ఉంటే మేం రాబోమని చెబుతారు. బాలును ఎట్టి పరిస్థితుల్లో ఫంక్షన్ కు దూరంగా ఉంచితేనే వస్తామని కండీషన్ పెడుతారు. దాంతో సత్యం షాక్ అవుతాడు. ఎంతో బాధపడుతాడు. కొడుకు తన బాధ్యతను పంచుకుంటూ ఉంటే.. మరోవైపు ఆ ఫంక్షన్ కే దూరంగా ఉంచాలని చూస్తున్న వారి ప్రయత్నానికి దిగులు చెందుతాడు. కానీ ప్రభావతి మాత్రం బాలును ఫంక్షన్ కు దూరంగా ఉంచుతానని హామీనిస్తుంది. కొడుకుపై తన పగను ఇలా తీర్చుకుంటుంది.

Take a Poll

అయితే, ఇంట్లో నుంచి వెళ్లిపోయేప్పుడు ప్రభావతి మరో బాంబ్ పేల్చుతుంది. గతంలో మౌనిక తమ ఇంటికి ఒక్కతే వచ్చి వెళ్లిందని, ఈసారి అందరూ కలిసి రండి అని అడుగుతుంది. దీంతో మౌనిక గుట్టురట్టు అవుతుంది. దాంతో మళ్లీ మౌనికను సమస్యల్లోకి తోసింది ప్రభావతి. మరోవైపు సత్యం తన భార్య ప్రభావతి మాటలు, ఆలోచనతీరుకు మండిపడుతాడు. కొడుకుపై నీకు ఎందుకంత పగ అంటూ ఏకీపారేస్తాడు. బాలు లేకుండా ఫంక్షన్ ఎలా చేస్తామంటూ మండిపడుతాడు. చెల్లి ఫంక్షన్ లో అన్న ఎందుకు ఉండాలో చెప్పే బాధ్యత తమపై ఉందని చెబుతాడు. కానీ ప్రభావతి నానా మాటలు చెప్పి సత్యంను ఆ ధ్యాస నుంచి మరిపిస్తుంది. ఇక ఎలా జరుగుతుందోనని సత్యం తిరిగి ఇంటికి బయల్దేరుతారు.

Gunde Ninda Gudi Gantalu serial Expected episode 377 March 12th 2025 here is full story

మరోవైపు చెల్లి మౌనికా ఫంక్షన్ కోసం అన్న బాలు డబ్బులు అరెంజ్ చేసే పనిలో ఉంటాడు. తాను ఇంట్లో అన్ని పనుల కోసం దాచుకున్న డబ్బులను తీసి లెక్క వేస్తుంటాడు. అయినా ఇంకా రూ.60వేలు తక్కువ అవుతుంది. ఈ సందర్భంగా తనను పేదరికం ఎంతో వేదిస్తోందని చెప్పుకుంటాడు. భర్త బాధను చూడలేక మీనా తన తాళికోసం కూడబెట్టిన డబ్బు రూ.30 వేలు ఇస్తుంది. బాలు అస్సలు వద్దేవద్దు అంటూ తిరస్కరిస్తాడు. కానీ మీనా ఒప్పించి మరీ ఇస్తుంది. తనవద్ద పూల అమ్మగా వచ్చిన మరో రూ.5 వేలు కూడా ఇస్తుంది. అయినా రూ.25 వేలు తక్కువ అవుతుంది. ఇక ఎలాగోలా సర్దుదామనుకుంటారు. కానీ ఇంత ఫంక్షన్ కోసం ఏర్పాట్లు చేస్తున్నా.. మౌనిక భర్త తనతో మాట్లాడుతారా? అనే సందేహంతో బాలు దిగులుపడుతాడు.

మరోవైపు మౌనికా గుట్టురట్టు కావడంతో ఆమె భర్త నరకం చూపించే పనిలో ఉంటాడు. ఇక వారి అత్తగారు ఫంక్షన్ కు రావాలంటే పెట్టిన కండీషన్ ను బాలుకు చెప్పే ప్రయత్నం చేస్తారు? బాలుకు చెబుతారా? లేదా? అందుకు బాలు ఎలా స్పందిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. కానీ ఆ విషయం తెలియని బాలు ఏమైందీ? ఏమైందీ? అంటూ తల్లిదండ్రులను గట్టిగా అడుగుతారు. ఇక తల్లి ప్రభావతి అసలు విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తోంది... దీంతో నెక్ట్స్ ఎపిసోడ్ పై మరింత ఆసక్తి నెలకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X