Gunde Ninda Gudi Gantalu March 13th: బాలుకు ఘోర అవమానం.. పేగుబంధాన్ని తెంచుకున్న ప్రభావతి?

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతోంది. ఇక మార్చి 13న లేటెస్ట్ ఎపిసోడ్ ఓవైపు ఆసక్తికరంగానూ, మరోవైపు టెన్షన్ గానూ సాగింది. మౌనికా తాళి మార్చే ఫంక్షన్ పనుల్లో ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులు సత్యం, ప్రభావతి, బాలు నిమగ్నమైన ఉన్న సంగతి తెలిసిందే. అన్నదమ్ములెవ్వరూ ఫంక్షన్ కు అయ్యే రూ.2.5 లక్షల ఖర్చును భరించలేకపోవడంతో ఆ బాధ్యతను మొత్తం బాలుపైనే వేసుకుంటాడు. తన దగ్గర డబ్బులు లేకున్నా.. తన ఫ్యూచర్ కోసం, భార్య బంగారు తాళి కోసం దాచుకున్న డబ్బున్నంతా పోగుచేసి ఖర్చులకు ఏర్పాట్లు చేస్తుంటాడు. భార్య మీనా కూడా తనవంతు సాయంగా ఉన్నడబ్బులన్నీ బాలుకు ఇచ్చేస్తుంది.

మరోవైపు సత్యం, ప్రభావతిలు 16రోజుల తాళి ఫంక్షన్ గురించి చెప్పేందుకు మౌనిక అత్తవారింటికి వెళ్తారు. విషయం మొత్తం చెబుతారు. త్వరలో మంచి రోజు చూసుకొని ఫంక్షన్ చేయాలని ఆశిస్తున్నట్టు వియ్యంకుల వారికి చెబతారు. అందుకు వారూ సంతోషిస్తారు. కానీ ఊహించని ట్విస్ట్ ను ఇస్తారు. తల్లిదండ్రులను ఇరకాటంలో పెట్టే కండీషన్ పెడుతారు. తామంతా తమ కోడలు తాళి మార్చే ఫంక్షన్ కు రావాలంటే ఒక షరత్ కు ఒప్పుకోవాలంటారు.

సంజూ, మౌనికాల పెళ్లిలో నానా రచ్చ చేసిన బాలు మాత్రం ఈ ఫంక్షన్ లో ఉండటానికి వీల్లేదని సత్యంతో ఖరాకండిగా చెబుతాడు. అతను ఉంటే ఆ ఇంట్లో అడుగుపెట్టేదే లేదంటూ మౌనికా భర్త సంజూ కూడా తెగేసి చెబుతాడు. వారి కండీషన్లు విన్న సత్యం బిత్తరపోతాడు. మరోవైపు బాలునే ఈ ఫంక్షన్ చేస్తున్న తరుణంలో కొడుకునే ఎలా పక్కనబెట్టమంటున్నారనే ఆలోచనతో బాధపడుతాడు.

Gunde Ninda Gudi Gantalu serial Expected episode 378 March 13th 2025 here is full story

కానీ, మౌనిక మామ, భర్త సంజూ పెట్టిన కండీషన్ కు సత్యం భార్య, బాలు తల్లి ప్రభావతి అంగీకరిస్తుంది. ఫంక్షన్ జరిగే రోజు ఎలాగైనా బాలును అక్కడ ఉండకుండా తాను చూసుకుంటానని హామీనిస్తుంది. దీంతో సత్యం, చెల్లి మౌనికా గుండెలు పగిలిపోతాయి. అంతేకాదు ప్రభావతి తన కూతురు మౌనికాను కూడా ఇరకాటంలో పెడుతుంది. గతంలో అత్తవారింట్లో చెప్పకుండా రహస్యంగా పుట్టింటికి వచ్చిన వెళ్లిన సంగతిని అందరి ముందే రివీల్ చేస్తుంది. ఇలా మౌనిక గుట్టురట్టు కావడంతో ఆమె భర్త సంజూ నరకం చూపించడం ప్రారంభించాడు. కానీ మధ్యలో మౌనిక అత్తమ్మ ఎంట్రీ ఇచ్చి సంజూను వార్న్ చేస్తుంది.

మౌనికకు ఫంక్షనే జరగదాని, ఆ కుటుంబాన్ని ఎప్పటికి కలవనివ్వనని, చెప్పకుండా మీ ఇంటికె వెళ్లివస్తున్నావా? లేకా ఇంకెక్కడికైనా వెళ్లి వస్తున్నావా? అంటూ సూటిపోటు మాటలతో మౌనికను హింసపెడుతాడు. మౌనిక అత్త వచ్చి అడ్డుకోవడంతో సంజూ సైడ్ అవుతాడు. ఇక, తిరిగి ఇంటికి వచ్చిన సత్యం, ప్రభావతిలను చూసిన బాలు ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. కొడుకు బాలును ఫంక్షన్ కు దూరంగా పెట్టాలనే మౌనిక అత్తవారింటి బాధకరమైన కండీషన్ ను ఆలోచిస్తూనే ఇంట్లో సోఫాపై కూర్చుంటాడు. అది గమనించిన బాలు నాన్నఏమైందీ? అంటూ పదే పదే అడుగుతాడు. అక్కడ సంజూ ఏమైనా అన్నాడా? అంటూ అడుగుతూనే ఉంటాడు.

కానీ సత్యం దిగాలుగా కూర్చొని ఏమాత్రం బదులివ్వడు. ఇక చివరికి బాలునే అసలు విషయం అడిగేస్తాడు. మీరు వెళ్లిన ఫంక్షన్ విషయం ఏమైందని అడుగుతాడు. అసలు వాళ్లు ఒప్పుకున్నారా? లేదా? అని అడగడంతో ఒప్పుకున్నారని సత్యం బదులిస్తాడు. చెల్లెలు గురించి చేస్తున్న మొదటి ఫంక్షన్ అదిరిపోవాలని, సంతోషంగా తిరిగి తన అత్తవారింటికి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తానని బాలు సంతోషంగా చెబుతాడు. కానీ అసలు విషయం తెలియజేయలేక సత్యం సతమతమవుతాడు. కళ్ల నిండా నీళ్లు తీసుకొని తనలో తానే కుమిలిపోతాడు. కానీ ప్రభావతి మాత్రం ఏమాత్రం కనికరం లేకుండా బాలుకు నువ్వే చెప్పి ఫంక్షన్ లో ఉండకూడదని చెప్పాలని ఒత్తిడి పెంచుతుంది.

ఫంక్షన్ లోబాలును దూరంచేస్తూ తన పేగుబంధాన్నే దూరం చేసుకున్నట్టుగా ప్రవర్తిస్తుంది తల్లి ప్రభావతి. అసలు విషయం తెలియని బాలు చెల్లెలు ఫంక్షన్ ను అంగరంగ వైభవంగా చేసే పనిలో నిమగ్నమవుతాడు. అయితే తను సమకూర్చిన డబ్బులకు ఇంకా రూ.25 వేలు తక్కువ పడుతుండటం, మరిన్ని ఖర్చుల కోసమని తన ఫ్రెండ్ దగ్గర రూ.50వేలు అప్పు అడుగుతాడు. కానీ డబ్బులు ఇవ్వలేనని, కానీ కాకినాడ లో జరుగుతున్న జాతరకు హైదరాబాద్ నుంచి నాన్ స్టాప్ రైడ్ లు కొడితే మాత్రం అప్పుచేయకుండానే రెండురోజుల్లో ఆ డబ్బు సంపాదించవచ్చని బాలుకు చెబుతాడు. కానీ నిద్ర ఉండదని, నడుము దెబ్బ తింటుందని హెచ్చిరించినా బాలు మాత్రం ఆ పనికి పూనుకుంటాడు.

మరోవైపు బాలు భార్య మీనాతో ప్రభావతి ఘర్షణకు దిగుతుంది. మౌనిక తాళి మార్చే ఫంక్షన్ ఉందని తెలుసా? లేదా? అని బిగ్గరగా అరుస్తుంది. ఇప్పటి నుంచి పూలకొట్టు పనులు ఆపేసి ఇకపై ఫంక్షన్ పనులే చూడాలని ఆదేశాప్రాయంగా చెబుతుంది. తన మాటలే వినాలన్నట్టూ కోపంగా చెబుతుంది. కానీమీనా ఏమాత్రం తగ్గకుండా పూలకొట్టు వ్యాపారం ఆపేది లేదని, ఆర్డర్ లు ఉన్నాయని ఫంక్షన్ కు సంబంధించిన పనులు సమయానికి చేస్తానని చెబుతుంది.

Take a Poll

కానీ ప్రభావతి మాత్రం మీనాను పోరుపెట్టే ప్రయత్నంతో ఇంకా పని ఒత్తిడి పెంచుతుంది. మీనాను ఒక మనిషిలా కూడా చూడదు. తనతో ఈ ఫంక్షన్ కు సంబంధించిన అన్నీ పనులు మీనానే పూర్తి చేయాలని పనిభారం పెంచుతుంది. ఇదిలా జరుగుతుండగానే మరోవైపు ప్రభావతికి చిన్నకోడలు శృతి, రవి షాక్ ఇస్తారు. ఈ ఫంక్షన్ కు తాము ఉండాలని అనుకోవడం లేదని తమ నిర్ణయాన్ని చెబుతారు. శృతి, మౌనిక భర్త సంజూకు గతంలో ఉన్న గొడవ కారణంగా ఫంక్షన్ కు ఉండబోమని రవి చెబుతాడు.

కానీ సత్యం, ప్రభావతి మాత్రం వాళ్లు ఇప్పుడలా లేరని, అంతా సర్దుకుంటుందని ఎవ్వరూ ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదని చెబుతారు. రవి కూడా తల్లిదండ్రులు చెప్పిన మాటవింటారు. అయితే ఫంక్షన్ పనుల కోసం బాలు ఎలా కష్టపడుతున్నాడు? ఫంక్షన్ కు బాలును దూరంగా ఉండమని తండ్రి సత్యం ఎలా చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X