Gunde Ninda Gudi Gantalu March 14th : బాలును అవమానించిన తండ్రి? మౌనికకు టార్చర్ చూపిస్తున్న సంజూ
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. మార్చి 14న ఎపిసోడ్ గుండెను హత్తుకునేలా సాగింది. ఇప్పటికే సత్యం ఇంట్లో మనోజ్ కు జాబ్ లేదని నానా రచ్చ అవుతున్న సంగతి తెలిసిందే. దాంతో బాలు మనోజ్ పై మాటల తూటాలు పేల్చాడు. మనోజ్ మూలంగా రోహిణి కూడా ఇంట్లోనుంచి వెళ్లిన సంగతి తెలిసిందే. మళ్లీ ఆమె తిరిగి ఇంటికి తిరిగి రావడం... బాలు కూడా గతాన్ని తవ్వి దెప్పిపోడవడం కూడా కాస్తా తగ్గిస్తాడు. గతంలో బాలు, మీనాను ఎన్ని ఇబ్బందులు పెట్టారో అన్నింటిని బాలు ప్రస్తుతం గుర్తు చేస్తూ అందరినీ ఏకీపారేస్తున్నాడు.
తన భార్య మీనా కోసం ఎంతో కష్టపడుతున్నాడు. ప్రస్తుతం పూలకొట్టుకు యజమానిని చేసి ఉన్నంతలో హుందాలో బతుకుతున్నాడు. అయినప్పటికీ తల్లి ప్రభావతి మాత్రం కొడుకు బాలును, కోడలు మీనాను ఏమాత్రం సహించదు. వారి పేర్లు వింటే చిర్రెత్తిపోతుంది. కనీసం బాలు దగ్గరైనా తగ్గి ఉంటుంది కానీ.. మీనా కనిపిస్తే తాండవం ఆడేస్తుంటుంది. ప్రస్తుతం బాలు ఇంట్లో మనోజ్ కు జాబ్ లేకపోవడం, రోహిణి తన గతాన్ని దాచి ధనికురాలిగా నటిస్తుండటం అంతా టెన్షన్ వాతావరణాన్ని నెలకొల్పాయి. కాగా తాజాగా తల్లి ప్రభావతి తన కూతురు మౌనికాకు తాళి మార్చే ఫంక్షన్ చేయాలని భావిస్తుంది. అందుకు డబ్బులు కావాలని సత్యం ఆందోళన పడుతుంటే... ఆ భాధ్యతను మొత్తం కొడుకు బాలు ఒక్కడే ఎత్తుకుంటాడు.

ప్రస్తుతం చెల్లి మౌనిక తాళి మార్చే ఫంక్షన్ కు కావాల్సిన డబ్బును సమకూర్చడంలో నిమగ్నమై ఉన్నాడు. అందుకు సంబంధించిన పనులు చేస్తున్నాడు. తాను కూడబెట్టిన డబ్బులకు ఇంకా అవసరం పడటంతో డే అండ్ నైట్ కారు డ్రైవ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తాడు. తిండి, నిద్ర మానేసి నాన్ స్టాప్ గా రైడ్స్ కొడుతూనే ఉంటాడు. రెండు అరటిపండ్లు తిని కడపునింపుకోవడమే కాకుండా... చెల్లి ఫంక్షన్ ఘనంగా చేయాలనే తపనలో తనకు గాయాలైనా పట్టించుకోడు. బాలు అంత కష్టపడుతుంటే మీనా కూడా చూసి తట్టుకోలేకపోతుంది. భర్త రాత్రైనా ఇంటికి రాకపోవడంతో ఎంతో టెన్షన్ పడుతుంది. బాలు మాత్రం ఫోన్ కూడా మాట్లాడకుండా రైడ్స్ కొడుకుతూ డబ్బులు సంపాదించే లక్ష్యంలో మునిగిపోతాడు.
ఓవైపు బాలు ఇంత కష్టపడుతుంటే.. సత్యం రాత్రి పడుకోకుండా కొడుకు బాలుకు అసలు విషయం ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఉంటాడు. మౌనికా ఫంక్షన్ లో బాలును ఉండొద్దని ఎలా చెప్పడం అంటూ కుమిలిపోతాడు. ఇంత గమనించిన ప్రభావతి మాత్రం కనికరం లేకుండా మాట్లాడుతుంది. బాలుతో వచ్చే సమస్యను వాడు రాగానే వివరించు అంటూ భర్త సత్యానికి ఎలాంటి మెహమాటం లేకుండా తన అభిప్రాయాన్ని చెప్పడం గుండె తరుక్కుపోయేలా చేస్తుంది. ఇంతలా ఆలోచించడం మానేయండి అనడంతో సత్యం మండిపడుతాడు. నువ్వున్నంత కఠువుగా నేను ఉండలేను అంటూ సత్యం, తన భార్య ప్రభావతిపై ఫైర్ అవుతాడు. తెల్లవారితేనే ఫంక్షన్ ఉంది. మీకు చెప్పడం వీలుకాకపోతే నేనే చెబుతానని మొండికేస్తుంది. ఇక సత్యం నేనే ఎలాగో చేప్తానులే అంటూ దిగులుగా ఉంటాడు.
మరోవైపు ప్రభావతి మాత్రం అర్ధరాత్రి అయిన కొడుకు ఇంటికి రాకపోయినా ఏమాత్రం దిగులు చెందదు. హాయిగా పడుకున్నట్టు నటిస్తుంది. బాలును ఫంక్షన్ లో అస్సలు ఉండొద్దని సత్యం ఎప్పుడు చెబతాడా? అనే ధ్యాసలో ఉంటుంది. ఇక కొడుకు బాలు నిద్రహారాలు మాని పనిచేస్తున్నాడని తెలుసుకొని సత్యం ఎంతో బాధపడుతాడు. పైగా బాలుకే ఫంక్షన్ లో ఉండొద్దని చెప్పడం తనకు శిక్షగానే భావిస్తున్నట్టు లోలోపల కుమిలిపోతాడు. ఇక ఈలోగా బాలు తిరిగి ఇంటి వస్తాడు. తనకోసం ఎదురుచూస్తున్న తండ్రి, భార్య మీనాను చూసి ఎందుకు ఇంకా పడుకోలేదని అని అడుగుతారు. చెల్లి ఫంక్షన్ ను ఘనంగా చేయడానికి కాస్తా ఓవర్ టైమ్ డ్యూటీ చేశానని, అందుకే ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అయ్యిందని బదులిస్తాడు.
చెల్లి ఫంక్షన్ కోసం కష్టపడి సంపాదించిన డబ్బును తండ్రి సత్యం చేతిలో పెడుతాడు. అలా ఒళ్లుహూనం చేసుకుని కష్టపడుతున్న కొడుకును చూసి తండ్రి సత్యం గుండె తరుక్కుపోతుంది. దాంతో చెల్లి ఫంక్షన్ లో ఉండొద్దని ప్రభావతి అప్పటికే ఎంత ఒత్తిడి చేసినా కొడుకుతో మాత్రం చెప్పడం.. ఇప్పటికే ఆలస్యం అయ్యింది వెళ్లి తిని, పడుకో అని చెబుతాడు. కానీ ప్రభావతి మాత్రం సత్యంపై మండిపడుతుంది. కొడుకును ఫంక్షన్ లో ఉండొద్దని చెప్పినా ఎందుకు బాలుతో చెప్పలేదని సత్యాన్ని ప్రశ్నిస్తుంది. కన్న తల్లికి కొడుకే సమస్యగా అని భావించిన ఏకైక తల్లిని నిన్నే చూస్తున్నానని అసహించుకుంటాడు. ఫంక్షన్ లో బాలు ఉంటాడని, ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటానని బదులిస్తాడు.
మరోవైపు బాలు ఎంతో కష్టపడుతుండటం పట్ల మీనా బాధపడుతుంది. తన భర్త తిండి, నిద్రలేకుండా పనిచేయడంతో తానే స్వయంగా అన్ని సేవలు చేస్తుంది. దగ్గరుండి భర్తకు భోజనం తినిపించి కాస్తా రిలాక్డ్స్ గా మాట్లాడుతుంది. ఇక రేపు ఎలాంటి గోడవలకు నువ్వు మాత్రం కారణంగా కావొద్దని భార్య మీనా బాలుకు సూచిస్తుంది. తన చెల్లి ఫంక్షన్ ను అంగరంగ వైభవంగా జరిపిస్తానని భార్యతో ఎంతో గొప్ప చెబుతాడు. అందుకు మీనా కూడా సంతోషిస్తుంది. అలాగే జరిపిద్దురుగానీ ఫంక్షన్ లో ఎవ్వరు ఎలా మాట్లాడినా గొడవ పడొద్దని మరోసారి గుర్తు చేస్తుంది. అందుకు బాలు కూడా సరే అంటాడు. భార్య మాటకు విలువిస్తుండటంతో మీనా ఆనంద పడుతుంది. ఇక వెంటనే పడుకొని తెల్లవారి ఫంక్షన్ కోసం త్వరగా లెగుస్తారు.
చెల్లి ఫంక్షన్ రోజు రానే వచ్చింది.... బాలు ఎంతో సంతోషంగా మిగిలిన పనులన్నీ చేస్తున్నాడు. పంచె, ఎర్రచొక్కాలో హుందాగా రెడీ అయ్యి సందడి చేస్తూ ఉంటాడు. ఎప్పటిలాగే ఇంట్లో వాళ్లమీద పంచులు వేస్తూనే నవ్వులు పూయిస్తాడు. అయితే మౌనికా వాళ్ల అత్తగారు బాలును ఫంక్షన్ లో ఉండొద్దనే కండీషన్ పెట్టినా.. సత్యం మాత్రం కన్నకొడుకుకు ఎలా చెప్పాలో తెలియక, చెప్పలేక గమ్మునుండిపోతాడు. కానీ కఠిన మనస్సురాలైన ప్రభావతి మాత్రం కోపంతో బాలును ఇంట్లో ఉండదని, గుడికి వెళ్లి నువ్వు వేరే పూజొకటి చేయించాలని చెబుతుంది.
కానీ బాలు నేను వెళ్లను చెల్లి ఫంక్షన్ పనులను దగ్గరుండి చూసుకుంటానని చెబుతాడు. దాంతో ప్రభావతి ఉన్న విషయాన్ని తేటతెల్లం చేస్తుంది. అసలు నువ్వు ఉంటే ఫంక్షన్ కు రామని మౌనికా అత్తామావవాళ్లు చెప్పారంటూ కొడుకు బాలుతో చెబుతుంది. నువ్వు ఉంటే నా కూతురు ఫంక్షన్ ఆగిపోతుందని కోపం చేస్తుంది. దీంతో బాలు, మీనా షాక్ అవుతారు. ఈ విషయం ముందే చెబితే ఏ చెట్టుకిందనో కూర్చునే వాళ్లం కదా అంటూ తండ్రి సత్యంతో కొడుకు భావోద్వేగంగా చెబుతాడు. ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం జరిగిందనేది రేపటి ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











