Gunde Ninda Gudi Gantalu March 15th : ప్రభావతి కర్కషత్వం... బాలు గుండె ముక్కలు చేసిన కన్న తల్లి!

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. మార్చి 15న ఎపిసోడ్ గుండెను హత్తుకునేలా సాగింది. ఇప్పటికే సత్యం ఇంట్లో మనోజ్ కు జాబ్ లేదని నానా రచ్చ అవుతున్న సంగతి తెలిసిందే. రోహిణి ఇంట్లో నుంచి వెళ్లిపోవడం, అందుకోసం బాలు మనోజ్ మధ్య గొడవ జరిగి.. ఒకరిపై ఒకరు చేయి చేసుకునే దాకా రావడంతో సమస్య మరింతగా పెరిగింది. ఇదిలా జరుగుతూనే ఉండగానే రోహిణి కూడా ఇంట్లోకి తిరిగి ఎంట్రీ ఇస్తుంది. దాంలో కుటుంబీకులంతా ఆందోళన నుంచి బయటికి వస్తారు. అదే సమయంలో బాలుపై మనోజ్ మాటల తూటాలు పేల్చుతూనే ఉంటాడు. మనోజ్ కు జాలేని కారణంగా సమస్య రోహిణి వైపునకు కూడా తిగుతుంది.

రోహిణి తనకు లేని మలేషియా తండ్రిని ఉన్నడని చెప్పడం, అలాగే తనకు తల్లి లేదని అబద్ధాలు ఆడి మరీ మనోజ్ ను పెళ్లి చేసుకోవడం వంటి విషయాలు ఎక్కడ బయటపడుతాయోనని భయపడుతూ ఉంటుంది. మనోజ్ కు జాబ్ వస్తే తను సేఫ్ అని భావిస్తూ ఉంటుంది. దాంతో మనోజ్ పై ఒత్తిడిపెంచుతూ వస్తుంది. కాగా, ఈ సమస్యను మరిపించేందుకు ప్రభావతి తన కూతురు మౌనికాకు తాళి మార్చే ఫంక్షన్ చేయాలని తలుస్తుంది. ఇంట్లో చిల్లిగవ్వ లేకున్నా ఫంక్షన్ చేయాల్సిందేనని సత్యంపై ఒత్తిడి తెస్తుంది. దాంతో సత్యం కూడా ఒప్పుకుంటాడు. ఫంక్షన్ చేయడానికి మొత్తం రూ.2.5 లక్షల వరకు ఖర్చు వస్తుండటంతో ఆందోళన చెందుతాడు. అంతా డబ్బు ఎలా సర్దాలో లెక్కలు వేస్తుంటాడు.

Gunde Ninda Gudi Gantalu serial Expected episode 380 March 15th 2025 here is full story

ఇక కన్న కొడుకులు మనోజ్, రవి ఏమాత్రం కూడా ఆ ఫంక్షన్ కు డబ్బులు ఇచ్చేందుకు ముందుకు రారు. కానీ కోడళ్లు రోహిణి, శృతి మాత్రం ఆ డబ్బును మనిషికి కొంత సర్దుబాటు చేస్తామని సత్యంకు చెబుతాడు. ఆ విషయం తెలుసుకున్న బాలు అలా చందాలు వేసుకోవాల్సిన అవసరం లేదంటాడు. ఇస్తే కొడుకులైనందుకు మనోజ్, రవిని ఇవ్వనివ్వండి లేదంటే.. ఆ భారం మొత్తం తానే మోస్తానని చెప్పుకొస్తాడు. అన్న మాట ప్రకారమే డబ్బును కూడా గట్టే పనిలో నిమిగ్నమవుతాడు. తన ఫ్యూచర్ కోసం దాచుకున్న డబ్బులన్నీ తీసి తండ్రికి ఇస్తాడు. ఇంకా డబ్బులు అవసరం పడటంతో పనిభారాన్ని పెంచుకుంటాడు.

చెల్లి మౌనిక తాళి మార్చే ఫంక్షన్ కోసం ఎలాగైన డబ్బును సమకూర్చాలని నిర్ణయించుకున్న బాలు రెండు రోజుల్లో ఎంత వీలైతే అంత రైడ్స్ ద్వారా సంపాదించాలని అనుకుంటాడు. తాను కూడబెట్టిన డబ్బులకు ఇంకా అవసరం పడటంతో డే అండ్ నైట్ కారు డ్రైవ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తాడు. తిండి, నిద్ర మానేసి నాన్ స్టాప్ గా రైడ్స్ కొడుతూనే ఉంటాడు. రెండు అరటిపండ్లు తిని కడపునింపుకోవడమే కాకుండా... చెల్లి ఫంక్షన్ ఘనంగా చేయాలనే తపనలో తనకు గాయాలైనా పట్టించుకోడు. బాలు అంతలా కష్టపడుతుంటే మీనా కూడా చూసి తట్టుకోలేకపోతుంది. భర్త రాత్రైనా ఇంటికి రాకపోవడంతో ఎంతో టెన్షన్ పడుతుంది. బాలు మాత్రం ఫోన్ కూడా మాట్లాడకుండా రైడ్స్ కొడుకుతూ డబ్బులు సంపాదించే లక్ష్యంలో మునిగిపోతాడు.

మరోవైపు ప్రభావతి మాత్రం అర్ధరాత్రి అయిన కొడుకు ఇంటికి రాకపోయినా ఏమాత్రం దిగులు చెందదు. హాయిగా పడుకున్నట్టు నటిస్తుంది. బాలును ఫంక్షన్ లో అస్సలు ఉండొద్దని సత్యం ఎప్పుడు చెబతాడా? అనే ధ్యాసలో ఉంటుంది. ఇక కొడుకు బాలు నిద్రహారాలు మాని పనిచేస్తున్నాడని తెలుసుకొని సత్యం ఎంతో బాధపడుతాడు. పైగా బాలుకే ఫంక్షన్ లో ఉండొద్దని చెప్పడం తనకు శిక్షగానే భావిస్తున్నట్టు లోలోపల కుమిలిపోతాడు. ఇక ఈలోగా బాలు తిరిగి ఇంటి వస్తాడు. తనకోసం ఎదురుచూస్తున్న తండ్రి, భార్య మీనాను చూసి ఎందుకు ఇంకా పడుకోలేదని అని అడుగుతారు. చెల్లి ఫంక్షన్ ను ఘనంగా చేయడానికి కాస్తా ఓవర్ టైమ్ డ్యూటీ చేశానని, అందుకే ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అయ్యిందని బదులిస్తాడు.

అయితే బాలు ఇంతలా కష్టపడి చెల్లి ఫంక్షన్ కోసం డబ్బులు కూడగట్టితే తల్లి ప్రభావతి మాత్రం గుండె పగిలేలా మాట్లాడుతుంది. కన్న కొడుకుపైనే తన కర్కషత్వాన్ని చూపిస్తుంది. మౌనికా ఫంక్షన్ లో తాను ఉండకూదని, వేరే గుడిలో పూజ చేయించాలని చెబుతుంది. బాలు ఒప్పుకోకపోవడంతో.. అసలు విషయం మొహం మీదనే చెబుతుంది. నువ్వు ఉంటే మౌనికా వాళ్ల అత్తవాళ్లు రానని చెప్పారంటూ బాలుకు చెప్పేస్తుంది. అందుకే నువ్వు ఫంక్షన్ లో ఉండకూడదని చెప్పి అవమానిస్తుంది. అప్పటికే ఎంతో ఆనందంగా చెల్లి ఫంక్షన్ కోసం రెడీ అయిన బాలుకు చేధు అనుభవం కలుగుతుంది.

మౌనికా అత్తవాళ్లు నిన్ను ఉండొద్దనే విషయాన్ని మీ నాన్న ముందే చెప్పారంటూ.. ప్రభావతి బాలుకు చెబుతుంది. దీంతో సొంతం చెల్లి ఫంక్షన్ కే తాను దూరమవుతున్నాననే బాధతో కుమిలిపోతాడు. ఈ విషయం ముందే చెబితే ఏ చెట్టుకిందనో కూర్చునేవాడిని కదా అంటూ తండ్రి సత్యం మోకాళ్ల వద్ద కూర్చొని ప్రశ్నిస్తాడు. కొడుకుకు సమాధానం ఇవ్వలేని స్థితిలో సత్యం కన్నీళ్లు కార్చుతూ అటువైపు మొహం తిప్పుకుంటాడు. ఇక ఇదంతా విన్న మీనా ప్రభావతి మాటలకు ధీటుగా ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఇన్ని రోజులు కష్టపడి డబ్బులు కూడబెడుతుంటే ఎందుకు చెప్పలేదని, తన సొంతం చెల్లి ఫంక్షన్ లో బాలును ఉండొద్దని మీరైనా ఎలా బెబుతారంటూ అత్త ప్రభావతిపై రెచ్చిపోతుంది.

Take a Poll

రాత్రింభవళ్లు మా ఆయన కష్టపడేది మీ కళ్లకు కనిపించలేదా? అంటూ మీనా తన భర్తకు జరిగిన అన్యాయానికి అత్త ప్రభావతిని నిలదీస్తుంది. ఇదంతా చూసిన మనోజ్ బాలుకు సరిగ్గానే జరిగిందంటూ సంతోషిస్తాడు. పగలబడి నవ్వుతాడు. సొంత తమ్ముడినే చెల్లి ఫంక్షన్ లో ఉండకూదనే మౌనిక అత్తాగారింటి కండీషన్ ను తెలుసుకున్నాక కూడా... మనోజ్ బాలును అవమానించేలా నవ్వుతుంటాడు. ఇక బాలుకు గుండె పగిలిపోయే నిజం తెలియడంతో ఎంతో బాధపడుతాడు.

మొదటి నుంచి చెల్లికి ఎలాంటి ఫంక్షన్ చేయలేదని, తొలిసారిగా తాళి ఫంక్షన్ నైనా ఘనంగా జరిపించాలని భావించిన బాలుకు ఇలా నిరాశ ఎదురైంది. ఇక తరువాయి ఎపిసోడ్ లో అసలు బాలును ఫంక్షన్ ను అనుమతిస్తారా? ఇవ్వరా? తండ్రి సత్యం బాలు ఫంక్షన్ లో ఉన్నప్పటికీ ఎలాంటి గొడవలు రాకుండా చూసుకుంటానని, ప్రభావతి నిజం చెప్పిన సందర్భంలో ఎందుకు మౌనంగా ఉన్నారనేది? ఆసక్తికరంగా మారింది. మరోవైపు మౌనికకు భర్త టార్చర్ చూపిస్తుండటం మూలంగా ఈ తాళి ఫంక్షన్ ఎలా జరగబోతుందనేది తరువాయి ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X