Gunde Ninda Gudi Gantalu May 10th: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మీనా.. బాలు కీలక నిర్ణయం
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక మే 9వ తేదీ 419వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. తన తమ్ముడు శివను బాలు కొట్టాడనే విషయాన్ని మీనా ఇంట్లో వాళ్లందరికీ చెబుతుంది. కానీ బాలు ఎందుకు కొట్టాడనే విషయం మాత్రం తనకు తెలియదని, కానీ తన తమ్ముడు శివ చేయి విరగొట్టేంత పని ఏం చేశాడని ఇంట్లో వాళ్లకు మీనా చెబుతుంది. తన తమ్ముడు ఎప్పుడు కోలుకుంటాడోనని ఏడుస్తూ ఉంటుంది. శృతి, రోహణి, రవి, మామ సత్యం ఓదార్చుతూ ఉంటారు. శివకు ఏం కాదని ధైర్యం చెబుతూ ఉంటారు.
ఇదే సమయంలో బాలు ఇంటికి తిరిగి వస్తాడు. రాగానే తండ్రి సత్యం కోపంతో ఊగిపోతాడు. మీనా కన్నీళ్లు పెట్టుకుంటూ తన బాధను చెప్పుకోవడంతో ఆయన మనసు కరిగిపోతుంది. బాలు ఇలా రౌడీలాగా ఎందుకు ప్రవర్తించాడని మండిపడుతాడు. అసలు శివ చేయి విరిచేసేంత పెద్ద తప్పు ఏం చేశాడురా అని తండ్రి బాలును అడుగుతాడు. కానీ బాలు మాత్రం తానేమీ కావాలని కొట్టలేదని, అసలు శివ గాడు చేసిన పనికి అంటూ కోపంతో రగిలిపోతాడు. కానీ దొంగతనం చేశాడనే విషయాన్ని మాత్రం చెప్పకుండానే తన రూమ్ లోకి వెళ్లిపోతాడు. మీనా బాలుపై ఇంకా కోపం తెచ్చుకుంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికంగా మారింది. మే 10వ తేదీ 420 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

మీనా తమ్ముడు బాలు చేయి విరగొట్టడంతో అందరూ బాలునే తప్పు బడుతారు. తండ్రి సత్యం బాలును నిలదీసి అడుగుతున్నా ఆ విషయాన్ని మాత్రం ఎవ్వరికీ చెప్పడు. శివ దొంగతనం చేశాడని, అది కూడా తన తల్లి ప్రభావతి బ్యాగ్ దొంగలించి డబ్బులు తీసుకున్నాడని చెబితే ఎక్కడ గొడవలు అవుతాయోనని భయపడుతాడు. అందుకు ఇంట్లో వాళ్లు ఎన్ని మాటలు అన్న కూడా పడతానని నిర్ణయించుకుంటాడు. ఇక మీనాతో మాటలు ఆగిపోతాయి. ఇద్దరి మధ్య మనస్పార్థాలు పెరిగిపోతాయి. బాలును మీనా కూడా శివ విషయం అడగటం మానేస్తుంది.
ఇక రాత్రి సమయం కావడంతో మీనా హాలు లో పడుకుంటుంది. తమ గదిని తండ్రి సత్యం, తల్లి ప్రభావతికి ఇవ్వడంతో వాళ్లకు రూమ్ లేకుండా పోతుంది. అందుకని వెళ్లి మీనా ఒక్కతే హాల్ లో పడుకుంటుంది. ఇక మీనాతో బాలుకు మాటలు లేకపోవడంతో హాలు లో పడుకోకుండా బిల్డింగ్ పైకి వెళ్లి పడుకుంటాడు. మళ్లీ శివ దొంగతనం గురించి ఇంట్లో చెప్పాలా వద్దా అని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. తను నిజం దాచడం వల్ల అందరి దృష్టిలో నిందితుడిగా, రౌడీగా మారిపోతున్నానని ఆలోచిస్తూ ఉంటాడు. ముఖ్యంగా మీనా గురించి ఆలోచిస్తూ బాధపడుతాడు.
జీవితంలో మీనా మొదటిసారిగా నానా మాటలు అంటుందని, రోజురోజుకు మీనా దృష్టిలో చీప్ అయిపోతున్నానని భావిస్తాడు. ఇక తెల్లవారాక మీనాకు నిజం చెబుదామని అనుకుంటాడు. వెంటనే పడుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇటు మీనా కూడా తన భర్త హాలులో పడుకోకుండా ఒక్కడే టెర్రస్ పై పడుకోవడంతో కాస్తా బాధపడుతుంది. అసలు శివ చేసిన తప్పు ఇంకేదైనా ఉందా? అని ఆలోచిస్తుంది. ఏదైనా తప్పు ఉంటే తనతో చెప్పడానికి సమస్య ఏంటని ఆలోచిస్తూ ఉంటుంది. తెల్లవారక బాలును గట్టిగా అడగాలని నిర్ణయించుకుంటుంది. ఇక నిద్రకు ఉపక్రమిస్తుంది.
అయితే, బాలు పడుకుందామని కాసేపు కళ్లు మూసుకోగానే మీనా కలలోకి వస్తుంది. మీనా, బాలుకు గొడవలు అయినట్టుగా, బాలును వదిలేసి మీనా వెళ్లిపోయినట్టుగా కల వస్తుంది. దాంతో వెంటేనే బాలు ఉలిక్కి పడిలేస్తాడు. ఆ శివ గాడి వల్ల మీనాతో దూరం పెరిగిపోతుందని, వెంటనే అసలు విషయాన్ని మీనాకు చెప్పాలని ప్రయత్నిస్తాడు. అందుకు బిల్డింగ్ పై నుంచి కిందికి దిగుతాడు. మీనా దగ్గరు వచ్చి లేపుతాడు. మీనా కూడా లేస్తుంది. కాసేపు ఇద్దరూ సైలెంట్ గా ఒకరినొకరు చూస్తూ ఉంటారు. అసలు విషయం చెబితే ఏమౌతుందోనని బాలు భయపడుతాడు. మరోవైపు నిజం చెప్పడానికే వచ్చి ఎందుకు మౌనంగా ఉంటున్నాడని మనసులో అనుకుంటుంది.
ఇక మీనా ఏమైందని అడగడటంతో బాలు అసలు విషయం చెప్పే ప్రయత్నం చేస్తాడు. శివ తనతో ప్రవర్తించిన తీరు, దొంగతనం విషయాలను చెప్పుకుండా.. గుణతో తిరిగితే వాడి జీవితం పాడైపోతుందనే ఆలోచనతోనే సరి చేసే ప్రయత్నం చేశాను. కానీ అనుకోకుండా చేయి విరిగిపోయిందని అంటాడు. మీనా వినిపించుకోకపోవడంతో శివ చేసిన దొంగతనం, తన కాలర్ పట్టుకున్న విషయాన్ని రివీల్ చేస్తాడు. దాంతో మీనా షాక్ అవుతుందని నిన్నటి ప్రోమో చూస్తే అర్థం అవుతుంది. అయితే బాలు మాటలను ప్రభావతి వినే అవకాశం ఉంది. శివ దొంగతనం విషయం తెలుసుకునే ప్రమాదం కూడా ఉంది.
శివ గురించి నిజం తెలిసిన తర్వాత ప్రభావతి మీనాను ఇంట్లో ఉండనిస్తుందా? లేదా? అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. మరోవైపు బాలు, మీనా ఎప్పుడు దొరుకుతారా? ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి వెళ్లగొడుదామా? అని ప్రభావతి ఎదురు చూస్తోంది. ఇక శివ దొంగతనం చేసిన విషయం ప్రభావతికి తెలిసి మీనాను ఇంట్లో నుంచి పంపించే అవకాశంగా వాడుకుంటుందా? అనేది చూడాలి. లేదంటే బాలు ఎవ్వరూ వినకుండా మీనాను బయటకి తీసుకెళ్లి చెప్పి ఉంటే మాత్రం సమస్య అంతటితో సర్దుమణిగే అవకాశం కూడా లేక పోలేదు.
కానీ మీనాకు బాలు నిజం చెబితే మీనా తన తమ్ముడిని ఏం చేస్తుందని మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ గా మారింది. పైగా బాలు తాగి మరీ కొట్టాడని అబద్ధం చెప్పడంతో మీనా తమ్ముడు శివపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది నెక్ట్స్ ఎపిసోడ్ పై మరింత ఆసక్తిని పెంచుతోంది. మొత్తానికి బాలు చెప్పే ఒక్క నిజంపైనే సత్యం ఇంటి వ్యవహారాల్లో కీలక మలుపులు చోటు చేసుకునే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఏదైమైనా ఇంటి వ్యవహారాలను చూస్తున్న బాలు, తన తండ్రిని, కుటుంబాన్ని వదిలి వెళ్తాడా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక నెక్ట్స్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











