Gunde Ninda Gudi Gantalu May 31th : బాలు దగ్గర నిజం దాచిన మౌనికా.. వణికిపోయిన సంజూ
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక మే 30వ తేదీ 434వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలు మీనాకు మధ్య మాటలు లేకపోవడంతో ఇంకా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. కానీ తమ మనస్సులోని మాటలను సత్యం ద్వారా ఒకరి నుంచి మరొకరు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బాలుకు తన ఫ్రెండ్ ద్వారా భారీ ఆర్డర్ వస్తుంది. తన ఫ్రెండ్ అశోక్ పొటిలిషన్ దగ్గర పని చేస్తుండటంతో అక్కడ జరిగే ఓ కార్యక్రమానికి 500 వరకు పూల దండలు అవసరం అవుతాయి. అందుకు బాలుకు పార్తీ నేత 20 వేల అడ్వాన్స్ కూడా ఇస్తాడు. ఇక ఇదే విషయాన్ని వెళ్లి ఇంట్లో ఉన్న భార్య మీనాకు సత్యం ద్వారా చెప్పిస్తాడు.
మీనా కూడా ఆ ఆర్డర్ ను రెండు రోజుల్లో పూర్తి చేయిస్తానని చెప్పి అడ్వాన్స్ డబ్బులు తీసుకుంటుంది. వెంటనే పని ప్రారంభిస్తుంది. ఇదిలా ఉంటే బాలు చెల్లెలు మౌనికాను సంజూ టార్చర్ పెడుతూ ఉంటాడు. అంతే కాకుండా మనస్సు ముక్కలయ్యేలా, గుండె పగిలిపోయేలా నిందారోపణలు వేస్తాడు. దీంతో మౌనికా చాలా బాధపడుతుంది. తన బాధ ఎవ్వరికీ చెప్పుకోవాలో తెలియక గుడికి వెళ్లి ఒంటరిగా కూర్చొని తన మనస్సులో మాట్లాడుకుంటూ ఏడుస్తుంటుంది. అదే సమయంలో మీనా కూడా కనిపిస్తుంది. మరోవైపు మీనా ఇంట్లో లేదనే విషయం బాలుకు కూడా తెలుస్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది. ఇక మే 31వ తేదీ 435 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.?

మౌనికా ఇంట్లో నుంచి ఎవ్వరికీ చెప్పుకుండా రావడంతో సంజూ భయపడిపోతాడు. తను ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే కేసు తమపైకే వస్తుందని సంజూ తండ్రి అనడంతో వెంటనే మౌనికా ఆచూకీ కోసం ప్రయత్నిస్తాడు. దీంతో రోడ్డుపైకి వెళ్లి రెగ్యులర్ రూట్లలో మౌనికా ఆచూకీ కోసం ప్రయత్నిస్తాడు. అక్కడ ఉన్న స్థానికులకు మౌనికా ఫొటోను చూపించి ఈమెను చూశారా? అని అడుగుతూ ఉంటాడు. అయితే సంజూ కంగారు పడుతూ అలా రోడ్లపై తిరుగుతుండాన్ని బాలు చూస్తాడు. వెంటనే వెళ్లి దేని కోసం వెతుకుతున్నావని అడుగుతాడు. దాంతో సంజూ నీకు చెప్పాల్సిన పని లేదని, వేరే అడ్రస్ కోసం వెతుకుతున్నానని చెబుతాడు. నేను సాయం చేస్తానని బాలు చెప్పినా ఏం అవసరం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోతాడు.
ఇక అనుమానం వచ్చిన బాలు సంజూ ఫొటో చూపించి అడిగిన స్థానికులలో ఒకరిని అతను దేని గురించి అడిగాడని ప్రశ్నిస్తాడు. ఒక అమ్మాయి ఫొటో చూపించి ఆమె కనిపించిందా అని అడిగాడని చెబుతాడు. దాంతో బాలు షాక్ అవుతాడు. వెంటనే మౌనికాకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుంది. ఇక నేరుగా సంజూ వాళ్ల ఇంటికి వెళ్లి మౌనికా ఎక్కడ అని అడుగుతాడు. సంజూ, సంజూ వాళ్ల నాన్నబదులివ్వకపోవడంతో వెంటనే సంజూ తల్లిని ప్రశ్నిస్తాడు. ఆమె సమాధానం ఇవ్వాలని ప్రయత్నిస్తుంది. కానీ సంజూ, సంజూ తండ్రి చెబితే బాగుండదని హెచ్చరిస్తారు. దాంతో ఆమె కూడా మౌనంగా ఉండిపోతుంది.
మర్యాదగా అడిగితే చెప్పబోరని, వెంటనే పండ్ల దగ్గర ఉన్న కత్తిని తీసుకొని వెళ్లి సంజూ గొంతుపై పెడుతాడు. తన చెల్లి మౌనికా ఎక్కడికి వెళ్లిందో చెప్పమని, లేదంటే గొంతు కోసేస్తానని బాలు హెచ్చరిస్తాడు. అయినా కూడా సంజూ చెప్పబోడు. బాలు గొంతు దగ్గర కత్తి పెట్టడంతో అంతా షాక్ అవుతారు. ఇక అదే సమయంలో మౌనికా ఇంటికి తిరిగి వస్తుంది. తన భర్త సంజూపై అన్న బాలు కత్తి పెట్టి బెదిరించడాన్ని అడ్డుకుంటుంది. మౌనికాను చూసిన బాలు శాంతిస్తాడు. వెంటనే మౌనికా దగ్గరకు వెళ్లి ఏమైందని, ఎక్కడికి వెళ్లావని, సంజూ నిన్ను ఏదైనా ఇబ్బంది పెట్టాడా? అని ప్రశ్నిస్తాడు. అంతే మౌనికా మాత్రం మౌనంగా ఉండి పోతుంది. అన్న కళ్లలోకి చూసి నిజం చెప్ప లేక పోతుంది. అప్పటికే బాలు ఆవేశంతో ఊగిపోవడం చూసి అసలు విషయాన్ని గుండెలోనే దాచేస్తుంది.
తాను ఆ ఇంట్లో క్షేమంగానే ఉన్నానని తన అన్న బాలుకు చెబుతుంది. అనవసరంగా నువ్వు వచ్చి ఎందుకు కంగారు పడుతున్నావని, తనకు ఏమాత్రం ఇబ్బంది లేకుండానే ఉన్నానని చెబుతుంది. మరోవైపు మీనాకు కూడా మౌనికా అసలు విషయం చెప్పకుండానే ఇంటికి వచ్చేస్తుంది. అప్పటికే మీనా అనుమానం వ్యక్తం చేసినా అసలు విషయం మాత్రం చెప్పదు. ఇక బాలును చెల్లి శాంత పరిచిన తర్వాత తిరిగి ఇంటికి పంపిస్తుంది. బాలు వెళ్తూ వెళ్తూ తన చెల్లి ఏదైనా జరిగితే మాత్రం అస్సలు ఊరుకోనని, ప్రాణాలు తోడేస్తానని హెచ్చరించి వెళ్తాడు. ఇక బాలు వెళ్లిన తర్వాత సంజూ మౌనికాను మళ్లీ టార్చర్ పెట్టడం మొదలు పెడుతాడు.
ఎక్కడికి వెళ్లావే అని, ఎవ్వరికీ చెప్పకుండా వెళ్లి ఏం చేద్దామనుకున్నావని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. నువ్వే కావాలని నీ అన్న బాలును తనపైకి ఉసిగొలిపి పంపించేశావా? ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారా? అంటూ మళ్లీ నిందించ సాగుతాడు. సంజూ తల్లి జోక్యంతో మౌనికాను వదిలేస్తాడు. ఇక మౌనికా కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంట్లోకి వెళ్లిపోతుంది. మరోవైపు సంజూ తన ప్లాన్ ఫెయిల్ అయ్యినందుకు బాధపడుతాడు. మౌనికాను ఇబ్బంది పెడుదామనుకుంటే తనే ఇరకాటంలో పడేసింది కదా అంటూ మండి పడుతాడు.
మరోవైపు మౌనికా సంగతిని బాలు తన ఇంట్లో వాళ్లకి చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ మళ్లీ సమస్య పెద్దదవుతుందని చెప్పకుండా మానేస్తాడు. ఇక పార్టీ నేత దగ్గర తీసుకున్న అడ్వాన్స్ తో పూల దండల కోసం పూలు కొనుక్కోని తీసుకు రావడానికి మీనా, బాలు కలిసి పూల మార్కెట్ కు వెళ్తారు. అక్కడ తమ ఆర్డర్ కు సరిపడా పూలను తీసుకు వచ్చి దండలను రెడీ చేయిస్తారు. మీనా, బాలుకు ఈ సందర్భంలోనే మౌనికా టాపిక్ వచ్చి మాటలు కలిసే అవకాశం ఉంది. ఇక నెక్ట్స్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











