Gunde Ninda Gudi Gantalu June 11th : బాలు చేతికి చిక్కిన దొంగ.. తాటతీసిన మీనా భర్త
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూన్ 11వ తేదీ 441వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలు మీనాలు రాత్రిభవళ్లు కష్టపడి పూల దండలను రెడీ చేస్తారు. ఉదయాన్నే ట్రాలీలో దండల లోడ్ లను నింపి పార్టీ నేత నిర్వహించే సామూహిక వివాహాల కార్యక్రమానికి పంపిస్తారు. కానీ అప్పటికే బాలు, మీనాలపై పగ సాధించాలని చూస్తున్న ఫైనాన్షియర్ గుణ ఆ పూల దండలు పెళ్లి కార్యక్రమానికి చేరకుండా చేయాలని ప్లాన్ చేస్తాడు.అందుకు తన అనుచరులను పంపించి ఆ పూల దండలను లోడ్ చేసిన ట్రాలీని ఎత్తుకెళ్లమని చెబుతాడు. ఆ రౌడీలు బాలు, మీనా లోడ్ చేసి పంపించిన ట్రాలీని ఫాలో అయ్యి ప్లాన్ ప్రకారమే దొంగలిస్తారు. ఇక వెంటనే ఆ ట్రాలీ డ్రైవర్ జరిగిన విషయాన్ని బాలుకు చెబుతాడు. బాలు, మీనా చాలా టెన్షన్ పడుతారు. మరోవైపు అసలు ఆ ట్రాలీని ఎవ్వరు ఎత్తుకెళ్లారని ఆందోళన పడుతూ ఉంటారు. ఎవరో కావాల్సిన వాళ్లే ఈ పని చేసి ఉంటారని అనుకుంటూ ఉంటారు.
ఈ క్రమంలో బాలు స్నేహితుడు, రాజకీయ నేత దగ్గర పని చేస్తున్న అశోక్ ఫోన్ చేస్తాడు. దండలు రాకపోతే మన ప్రాణాలు పోతాయని భయపడుతూ చెబుతాడు. అశోక్ ఫోన్ లో నుంచి ఆ పార్టీ నేతనే మళ్లీ నేరు మాట్లాడి అర గంటలో పూల దండలు కార్యక్రమానికి చేరకపోతే మీ ఇద్దరి ఫొటోలకు దండలు వేస్తానని చెప్పి హెచ్చరిస్తాడు. ఇక బాలు, మీనా టెన్షన్ పడుతూ ఉంటారు. అరగంటలో బండిని ఎలా కనిపెట్టాలని ఆలోచిస్తాడు. ఇక వెంటనే ఆ ట్రాలీ ఫొటోను తన క్యాబ్, ఆటో డ్రైవర్ల గ్రూప్ లో పెట్టి ఆ బండిని దొంగలించారు. కనిపిస్తే వెంటనే చెప్పండి అంటూ మేసెజ్ పెడ్తారు. ఆ మెసేజ్ చూసిన ఆటో డ్రైవర్ ఒకరు బండిని చూశానని, లోకేషన్ ను కూడా చెబుతాడు. ఇక ఆ బండినే ఫాలో అవుతూ ఉంటారు. ఈ క్రమంలో తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 11వ తేదీ 442 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.?

బాలు, మీనాలకు ఫైనాన్షియర్ గుణ ద్వారా చాలా పెద్ద ప్రమాదం వస్తుంది. ఎంతో కష్టపడి రాత్రంతా అల్లిన పూలదండలను, ట్రాలీలో లోడ్ చేసి పంపిస్తారు. కానీ గుణ మాత్రం తన కుట్ర పూరిత ప్లానింగ్ కు బాలు, మీనా బలవుతారు. ఎవరో బండిని ఎత్తుకొని వెళ్లారని బాలుకు తెలుస్తుంది. దాంతో పార్టీ నేత నుంచి చాలా ఒత్తిడి పెరుగుతుంది. అరగంటలో పూల బండిని తన ముందు ఉంచాలని ఆ పార్టీనేత హెచ్చరిస్తాడు. లేదంటే ఏమాత్రం ఊరుకోనని, వెంటనే బండిని వెతికి తన ముందు ఉంచాలని ఆదేశిస్తాడు. ఇక బాలుకు కూడా బండి దొరికిందని కబురు రావడంతో, వాళ్లు పంపించిన లోకేషన్ కు వెళ్తారు. అప్పటికే బాలు పెట్టిన మెసేజ్ చూసిన రాజేష్ ఆ బండిని ఫాలో అవుతూ వెళ్తాడు. డంపింగ్ యార్డు వద్దకు వెళ్లిన ఆ ట్రాలీని ఓవర్ టేక్ చేసి ఆపుతాడు.
మరోవైపు నాలుగైదు ఆటోలు కూడా ఆ ట్రాలీని ఫాలో అవుతూ ఉంటారు. అది గమనించిన రౌడీ ట్రాలీని అక్కడే వదిలేసి పారిపోయేందుకు ప్రయత్నిస్తాడు. అదే సమయంలో బాలు, మీనా అక్కడికి చేరుకుంటారు. ఆ రౌడీని పట్టుకుంటారు. ఎవర్రా నువ్వు అని అడిగే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే రాజకీయ నేత ఇచ్చిన గడువు అయిపోతోందని ఆ రౌడీని వదిలేసి అక్కడికి వెళ్తారు. అయితే ఆ రౌడీని పంపంచింది ప్రత్యర్థి పార్టీ నేతలే అని బాలు అనుకుంటాడు. గుణ కావాలని ఇదంతా చేశాడని బాలు తెలుసుకోలేకపోతాడు. ఇక ఎట్టకేళలకు పార్టీ నేతకు ఆ పూల దండల ట్రాలీని తీసుకెళ్లి అప్పగిస్తాడు. కోపంలో ఊగిపోయిన ఆయన బాలు ట్రాలీతో కనిపించడంతో శాంతిస్తాడు. ఎందుకు ఇంత లేట్ అయ్యిందని, నువ్వు నాకు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ నాయకులకు ఎంతకు అమ్ముడు పోయావని బాలును అనుమానిస్తాడు.
అయితే, బాలు మాత్రం తను ఎవ్వరికీ అమ్ముడు పోలేదని, ఎవరో కావాలని ట్రాలీని ఎత్తుకెళ్లారని చెబుతాడు. ఇక ఆ పార్టీ నేత కూడా ఎవరో నేనంటే గిట్టని వారే ఈ పని చేసి ఉంటారని అనుమానిస్తాడు. మరోవైపు ట్రాలీలో దండలు అన్నీ సరిగా ఉన్నాయా? లేవా? అనేది ఒకసారి చూడమని తన అనుచరులకు చెబుతాడు. అన్నీ సరిగానే ఉన్నాయని వాళ్లు చెప్పడంతో బాలును వదిలేస్తాడు. ఎంతో నిజాయితీగా పనిచేసిన కూడా మిమ్మల్ని అవమానించడం బాధగా ఉందని బాలు అంటాడు. ఏమనుకోకు తమ్ముడు అంటూ ఆ పార్టీ నేత బుజ్జగిస్తాడు. ఆ తర్వాత దండల ఆర్డర్ కు ఇవ్వాల్సిన మొత్తం డబ్బులను తిరిగి ఇస్తాడు. పైగా బాలు నిజాయితీకి, సాహసానికి మెచ్చి కాస్తా ఎక్కువ డబ్బులు ఇస్తాడు. ఇక బాలు మీనా పెద్ద గండం నుంచి గటెక్కామని ఇంటికి వెళ్లిపోతారు.
ఇక ఇంటికి వెళ్లే క్రమంలో మీనా బస్తీ మహిళలకు డబ్బులు ఇద్దామని వెళ్తుంది. రాత్రంతా వాళ్లు కష్టపడి పనిచేసినందుకు డబ్బులు ఇద్దామని అనుకుంటుంది.కానీ వాళ్ల దగ్గరికి వెళ్లి డబ్బులు ఇవ్వబోతుంటే ఏమాత్రం తీసుకోరు. గతంలో నువ్వు మాకు చేసిన సాయమే నీకు ఈరోజు పని చేసిందని అంటారు. మా డబ్బులు ఇచ్చి దూరం చేయ్యకని చెబుతారు. ఇక సరేనని తిరిగి వెళ్లిపోతుంది మీనా. ఆ వచ్చిన డబ్బులతో మీనా బాలుకు కారును కొనివ్వాలని అనుకుంటుంది. అదే విషయమై డబ్బులు తీసుకెళ్లి మరీ బాలు స్నేహితుడు రాజేష్ ను కలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఆ తర్వాత ఎపిసోడ్ లో బాలు మీనాలు ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకుంటారు. రాత్రి పూట హాలు లో పడుకుంటారు.అయితే బాలు ఆటో నాన్ స్టాప్ గా నడపడంతో బాడీ పెయిన్స్ ఉన్నాయని చెబుతాడు. దాంతో మీనా బాలు శరీరాన్ని నొక్కుతూ ఉంటుంది. ఇదే క్రమంలో ప్రభావతి హాలులోకి రావడంతో బాలు హడావుడి చేస్తాడు. ఇదే క్రమంలో బాలుపై మీనా పడుతుంది. అది చూసిన ప్రభావతి నానా రచ్చ చేస్తుంది. ఇక సత్యం వచ్చి రేపటి నుంచి మీ గదిలో మీరు పడుకోండి అని చెబుతుంది.


Click it and Unblock the Notifications











