Gunde Ninda Gudi Gantalu June 7th : బాలు, మీనాకు ప్రాణ భయం.. ఆ దుర్మార్గుడి కుట్రకు బలి

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూన్ 6వ తేదీ 439వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలు, మీనాలు సంతోషంలో ఉంటారు. తమకు పొలిటికల్ పార్టీ నేత నుంచి వచ్చి పెద్ద ఆర్డర్ గురించి అందరికి చెప్పుకుంటూ.. ఆర్డర్ పనులను వేగవంతం చేస్తూ ఉంటారు. 500ల పూల దండలు అల్లే పనిలో ఫుల్ బిజీ అవుతారు. బాలు, మీనాలకు కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తారు. తమకు వీలైన పనులు చేస్తూ ఉంటారు.

రవి అందరికీ వంట చేసి రాత్రికి భోజనం పెడతాడు. రుచికరమైన కిచిడిని తయారు చేస్తాడు. అందరికీ తానే స్వయంగా వడ్డిస్తాడు. ఇక రవి చేసిన వంటను అందరూ మెచ్చుకుంటారు. త్వరలో రెస్టారెంట్ పెట్టమని సలహానిస్తారు. తను కూడా అదే పనిలో ఉన్నానని చెబుతాడు. ఇక రవికి సుమతి కూడా కాంప్లిమెంట్ ఇస్తుంది. దీంతో ప్రభావతి పెద్ద రచ్చ చేయాలని ప్రయత్నస్తుంది. కానీ శృతి అత్త ప్రభావతి ఆలోచనను తిప్పి కొడుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది. ఇక జూన్ 7వ తేదీ 440 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.?

Gunde Ninda Gudi Gantalu serial Expected episode 440 June 7th 2025 here is full story

సామూహిక వివాహాల కోసం పెద్ద ఎత్తున్న పూల దండాలు కావాల్సి రావడంతో బాలుకు తన ఫ్రెండ్ అశోక్ ఆర్డర్ ఇప్పిస్తాడు. ఏకంగా 500 పూల దండాలు అల్లడానికి బాలు ఆర్డర్ తీసుకుంటాడు. ఇక మీనా బాలు ఆ పూల దండలను అల్లే పనిలో నిమగ్నమై ఉన్నారు. మొదటి సారిగా పెద్ద ఆర్డర్ రావడంతో ఎలాగైనా జాగ్రత్తగా సమయానికి ఆర్డర్ పూర్తి చేయాలని అనుకుంటారు. అందుకు తగ్గట్టుగానే పనులను చకచకా నడిపిస్తూ ఉంటారు. మరోవైపు బాలు, మీనాలకు కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తూ ఉంటారు. తమకు తోచిన పనులు చేస్తూ ఉంటారు. ఇక మీనా కూడా ఆర్డర్ సకాలం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. అన్ని వందల పూల దండలు తను ఒక్కతే కట్టలేదు కాబట్టి బస్తీ నుంచి మహిళలను పిలిపిస్తుంది.

బస్తీ నుంచి వచ్చిన మహిళలు త్వరత్వరగా పూల దండలు అల్లుతుంటారు. బాలు వారికి కావాల్సిన ఏర్పాట్లను చూస్తూ ఉంటాడు. అయితే సుమతి కూడా పూల దండలు కట్టేందుకు అక్క మీనా ఇంటికి వస్తుంది. సుమతి పూల దండలు అల్లడం కోసం వస్తున్నానని అక్కడ ఇంట్లో తల్లి, తమ్ముడు శివకు చెప్పి వస్తుంది. దాంతో శివ ఈ విషయాన్ని రౌడీ షీటర్, ఫెనాన్షియర్ గుణకు చెబుతాడు. మా అక్కకు పెద్ద ఆర్డర్ వచ్చిందని, 500 పూల దండల ఆర్డర్ రావడంతో అందరూ ఆ పనిలో బిజీగా ఉన్నారని చెబుతాడు. ఇక అప్పటికే మీనా, బాలుపై పగ తీర్చుకుందామని చూస్తున్న గుణ ఈ విషయం తెలియడంతో కుట్రకు పూనుకుంటాడు. ఆ పూల దండలు పార్టీ నేత తలపెట్టిన కార్యక్రమానికి చేరకుండా అడ్డుకోవాలని అనుకుంటాడు.

ఇక బాలు మీనా రాత్రంతా కష్టపడి పూల దండలు అల్లిస్తారు. అన్నింటిని జాగ్రత్తగా ప్యాక్ చేసి ట్రాలీలో పంపించేందుకు సిద్ధం చేస్తారు. ఇక ట్రాలీ రాగానే పూల దండలను అందులోకి ఎక్కించి, పార్టీ నేత తల పెట్టిన కార్యక్రమం దగ్గరకు తీసుకెళ్లమని చెబుతాడు బాలు. దాంతో అతను కూడా సరేనని అంటాడు. ట్రాలీలో పూల దండలు ఎక్కించడంతో తమ బాధ్యత తీరిపోయిందని బాలు మీనా అనుకుంటారు. మొత్తానికి రాత్రంతా కష్టపడి పూల దండలు అల్లి సమయానికి అందించామని సంతోషం వ్యక్తం చేశారు. తమ బస్తీవాళ్లు సహకరించడం, ఫ్యామిలీ మెంబర్స్ కూడా సాయం చేయడం వల్లే ఈ పెద్ద ఆర్డర్ పూర్తి చేయగలిగామని అనుకుంటారు.

అయితే ఎప్పుడెప్పుడు బాలు దొరుకుతాడా? వాళ్లను సమస్యల్లోకి నెట్టేద్దామా? అని ఫైనాన్షియర్ గుణ ఎదురు చూస్తున్న తరుణంలో ఈ పూల దండల ఆర్డర్ ఆయుధంలా కనిపిస్తుంది. దాంతో తన అనుచరులను పెట్టి ఆ పూల దండలు కార్యక్రమానికి అందకుండా చూడాలని ప్రయత్నిస్తాడు. అనుకున్నట్టుగానే బాలు ఇంటి దగ్గరి నుంచి 500 పూల దండలతో ట్రాలీ బయల్దేరడంతో తన అనుచరులు బండిని ఫాలో అవుతారు. కాస్తా ముందుకు వెళ్లిన తర్వాత ఆ ట్రాలీ డ్రైవర్ ను పిలిచి టైర్ లో గాలి లేదని, పూర్తి గా పంక్ఛర్ అయినట్టు ఉందని చెక్ చేసుకోమని చెబుతారు. అది నమ్మిన ట్రాలీ డ్రైవర్ వెంటనే బండిని పక్కకు ఆపి అన్ని టైర్లను చెక్ చేస్తూ ఉంటాడు.

టైర్లు అన్ని సరిగానే ఉన్నాయని తెలుసుకోనే లోపే గుణ అనుచరులు ఆ వెహికిల్ ను స్టార్ట్ చేసి తీసుకెళ్లి పోతాడు. దీంతో ఆ డ్రైవర్ కంగారు పడుతాడు. వెంటనే జరిగిన విషయాన్ని బాలుకు చేర వేస్తాడు. దాంతో బాలు కంగారు పడుతాడు. మరోవైపు పార్టీ నేత దగ్గర పనిచేస్తున్న తన స్నేహితుడు అశోక్ దగ్గర నుంచి బాలుకు ఫోన్ కాల్ వస్తుంది. త్వరగా దండలను పంపించురా అని కంటిన్యూయస్ గా ఫోన్ కాల్స్ వస్తాయి. దీంతో బాలు అసలు విషయం చెప్పకుండా దాచేస్తాడు. దండలు సమయానికి వస్తాయని చెబుతాడు. ఇక ఈ పని ఎవరు చేసి ఉంటారని బాగా ఆలోచిస్తాడు. ఎంతకు అంతు చిక్కకపోవడంతో తన స్నేహితుడు రాజేశ్ కు ఈ విషయం చెబుతాడు.

అలాగే తనకు తెలిసిన వాళ్లందరూ జరిగిన విషయాన్ని చెప్పి త్వరగా వెహికిల్ ను కనిపెట్టేందుకు ప్రయత్నిస్తాడు. మరోవైపు అక్కడ కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉండటంతో పూల దండల కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇంక దండలు రాకపోవడంతో బాలు స్నేహితుడు అశోక్ ను ఆ పార్టీ నేత మరింతగా ఒత్తిడి పెడుతాడు. ముందు ఫోన్ చేయమని చెబుతాడు. దాంతో అతను బాలుకు ఫోన్ చేసి పూల దండలు రాకపోతే మనల్ని చంపేస్తానని అంటున్నారురా బాలు అని చెబుతాడు. ఇక బాలు మాత్రం ఎవ్వరికీ తెలియకుండానే ఆ ట్రాలీ ఎక్కడికి వెళ్లింది? ఎవ్వరూ తీసుకెళ్లారనే విషయాలను తెలుసుకోవాలని అనుకుంటాడు. ఇలాంటి పరిస్థితి నుంచి బాలు, మీనా ఎలా బయటపడ్డారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X