Gunde Ninda Gudi Gantalu June 9th : మీనా గుండె ముక్కలు.. వణికిపోయిన బాలు
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూన్ 6వ తేదీ 439వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలు, మీనాలపై ప్రభావతి అక్కసు వెళ్లగక్కుతుంది. తన ఇంట్లోనే పూల కుప్పలు పోసి దండలు అళ్లుతుండటంతో తనకు కూర్చోవడానికి కూడా స్థలం లేదని మండి పడిపోతుంది. దీంతో మీనా, బాలులపై తేపకో సూటిపోటు మాట అంటూ ఉంటుంది. అందుకు బాలు కూడా ప్రభావతి మాటలను తల్లి అని చూడకుండా తిప్పి కొడుతాడు. ఇక సత్యం కూడా ప్రభావతి మాటలను విమర్శిస్తూ ఉంటాడు. నోరూ మూయించే ప్రయత్నం చేస్తాడు.
ఇక రవి అందరికీ కిచిడి వండుతాడు. ఇంట్లో వాళ్లతో సహా పని కోసం వచ్చిన వారికి కూడా వడ్డిస్తాడు. అందరూ తిని బాగుందని అభినందిస్తాడు. ఒక రెస్టారెంట్ కూడా ఓపెన్ చేసుకో అని సలహాలు, సూచనలు ఇస్తారు. ఇక మీనా వాళ్ల చెల్లెలు సుమతి రవికి షేక్ హ్యాండ్ ఇచ్చి బాగుందని పొగుడుతుంది. దీంతో ప్రభావతి సుమతి తీరును తప్పుబట్టే ప్రయత్నం చేస్తుంది. సుమతి రవిని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తోందని శృతికి చెబుతుంది. కానీ శృతి మాత్రం ఈరోజుల్లో మాట్లాడుకోవడం, అభినందించడం సహజమేనని, దాంట్లో అనుమానించాల్సిన పనిలేదని తిరిగి బుద్ధి చెబుతుంది. మరోవైపు ప్రభావతిని సత్యం తమ గదిలోకి తీసుకెళ్లి మరీ క్లాస్ పీకుతాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది. ఇక జూన్ 9వ తేదీ 440 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.?

ప్రభావతి మీనా వాళ్ల చెల్లెలు సుమతిపై నింద వేస్తుంది. రవితో చనువుగా ఉంటుందని శృతితో చెబుతుంది. కావాలనే గొడవ పుట్టించాలని ప్రయత్నిస్తుంది. కానీ శృతి అత్త ప్రభావతి మాటలను ఏమాత్రం పట్టించుకోదు. పైగా అందరి ముందు సుమతిపై అత్త ప్రభావతికి అనుమానం ఉందని, ఆమె రవితో మాట్లాడటంలో తప్పును చూసిందని, నాకేమీ తప్పు అనిపించలేదని చెబుతుంది. అలాగే మిగితా వాళ్లకు కూడా తమకేం తప్పు అనిపించలేదని అంటారు. దీంతో సత్యం ప్రభావతిని ఇంట్లోనికి తీసుకెళ్లి ప్రభావతికి వార్నింగ్ ఇస్తాడు. నువ్వు ఇలా ఆలోచించడం మానేయవా అని అంటాడు. ఇంకోసారి ఇలా మాట్లాడితే ఊరుకోనని చెబుతాడు. రవి జీవితం బాగుండాలనే అలా మాట్లాడానని అంటుంది. శృతికి లేని అనుమానం నీకెందుకని, అనవసరంగా అతిచేయకని ప్రభావతిని సత్యం హెచ్చరిస్తాడు.
ఇక మరోవైపు 500ల పూల మాలలు అందించేందుకు మీనా కష్టపడుతూనే ఉంటుంది. మీనాతో పాటు పూల దండలు అల్లేందుకు వచ్చిన బస్తీ మహిళలందరూ కూడా చాలా వేగంగా పని చేస్తూ ఉంటారు. సాయంత్రం నుంచే ప్రారంభించినా వేగంగానే దండలు అల్లుతారు. ఇక అర్ధరాత్రి అయ్యే సరికి అందరూ నిద్ర మత్తులోకి జారుకుంటూ ఉంటారు. పని నెమ్మదిస్తుంది. దీంతో బాలు వచ్చి అందరి నిద్ర మత్తు పోగొట్టడానికి ప్రయత్నిస్తాడు. అందుకు పళ్లెంతో గంటేతో గట్టిగా కొడుతూ శబ్దం చేస్తాడు. అందరూ నిద్ర మత్తు నుంచి హఠాత్తుగా బయటికి వస్తాడు. శబ్ధం చేసింది ఎవరు అని ఎదురు చూస్తారు. ఇలా అందరూ నిద్ర మత్తులోకి జారుకుంటే ఎలా అని బాలు సూచిస్తాడు.
ఇక బాలు శబ్దం చేసి నిద్ర నుంచి లేపినందుకు ప్రభావతి, మనోజ్, రోహిణి చిరాకు పడుతారు. ఇక మీనా మాత్రం నిర్విరామంగా పూల దండలు కడుతూనే ఉంటుంది. బస్తీ వాళ్లు కూడా బాలు శబ్దం చేయడంతో నిద్ర మత్తు నుంచి తేరుకొని ఇక వేగంగా దండలు కట్టడం ప్రారంభిస్తారు. అందరికీ కాళ్లు, చేతులు లాగుతున్నాయని మీనా అంటుంది. అయినా ఎలాగైనా ఆర్డర్ ను త్వరగా పూర్తి చేయాలని మీనా పట్టుదలగా ఉంటుంది. మరోవైపు బాలు కూడా అందరిలో జోష్ నింపాలని ప్రయత్నిస్తాడు. కానీ ఈలోపు సుమతి స్పందిస్తూ చిన్నప్పుడు నిద్ర రాకుండా అంత్యాక్షరి ఆడుకున్నట్లు ఇప్పుడు కూడా పాడుకుంటూ పనులు చేసుకుందామని చెబుతుంది.
అలాగైతే బ్రెయిన్ నిద్ర మత్తును వదిలిపోతుందని, అప్పుడు అందరూ చురుకుగా పని చేస్తారని బాలు అంటాడు. ముందుగా మీనానే పాట పాడటని అంటారు. కానీ మీనా నేను పాడనంటూ సిగ్గు పడుతుంది. బాలు పాడు మీనా అని అడగటంతో ఇక పాడుతుంది. స్త్రీల గొప్ప తనాన్ని వివరించే పాటను పాడుతుంది. ఆ తర్వాత బాలు చక్కటి పాటను వినిపిస్తాడు. మీనా, బాలు పాడిన తర్వాత సుమతి, కామాక్షి, రోహిణి కూడా పాడుతారు. ఇక మనోజ్ ఏకంగా రోజ్ రోజ్ రోజా పువ్వా సాంగ్ కు ఆడుతూ పాడుతూ అలరిస్తాడు. ఇక రవి, శృతి ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేసి ఆకట్టుకుంటారు. చివరిగా ప్రభావతి భరత నాట్యం చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. దాంతో అందరి మొహాలు హుషారుతో వెలిగిపోతుంది.
అయితే అందరూ నవ్వుతూ ఉంటే కామాక్షి ఇంట్లో నుంచి లేచి కన్నీళ్లతో బయటికి వెళ్తుంది. అది గమనించిన ప్రభావతి వెనకాలే వెళ్లి ఏమైందని అడుగుతుంది. అందుకు కామాక్షి స్పందిస్తూ తనకు చాలా సంతోషంగా ఉందని, మీ అందరూ ఇలా సంతోషంగా ఉండటం చూస్తూ కడుపు నిండిపోతుందని అంటుంది. మీరు చాలా అదృష్టవంతులని అంటుంది. ఇంటి నిండా కొడుకులు, కోడళ్లతో ఆనందంగా జీవిస్తున్నారని చెబుతుంది. కానీ ప్రభావతి మాత్రం అది అర్థం చేసుకోకుండా ఎందుకు ఇంటి నిండా పూల గంపలతో నింపినందుకా? అని అంటుంది. అలా కాదా పూలు అల్లుతూ ఉంటే ఎంతటి అనుభూతి వస్తుందో తెలుసా అని కామాక్షి ప్రభావతితో అంటుంది. మా ఇంట్లో అయితే ఇంతటి ఆనందానికి నోచుకోలేదని తెలుపుతుంది. మా ఆయన, నేను మాత్రమే బోరుమని ఉంటామని అంటుంది.
మరోవైపు బాలు చెల్లులు మౌనికాను సంజూ టార్చర్ పెడుతూ ఉంటాడు. ఏమాత్రం కూడా మౌనికాను పట్టించుకోడు. పైగా నిందలు వేస్తూ ఉంటాడు. మానసికంగా క్షోభ పెడుతూ ఉంటాడు. ఇక ఫుల్ గా తాగేసి వచ్చి బెడ్ రూమ్ లో పడుకుంటాడు. భయంకరంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. దాంతో మౌనికా హాల్ లోనే పడుకోకుండా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. మౌనికాను చూసి అత్త దగ్గరికి వస్తుంది. ఎందుకు దిగాలుగా కూర్చున్నావని అడగటంతో సంజూ ఫుల్ గా తాగేసి వచ్చాడని, గదిలోకి వెళ్లాలంటేనే భయం వేస్తుందని అంటుంది. మా అన్నయ్య వద్దని చెబుతున్నా ఈ పెళ్లి చేసుకొని నరకం చూస్తున్నానని, ఇప్పుడు ఇంట్లో వాళ్లకు ఈ సంగతిని చెప్పలేనని, అలాగని ఈ నరకం భరించలేనని అంటుంది. అందుకు మౌనికా అత్త కూడా బాధపడుతుంది. ఓదార్చుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది తర్వాత ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











