Gunde Ninda Gudi Gantalu June 10th : డేంజర్ లో మౌనికా.. బాలు మీనాకు కొత్త సవాల్

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూన్ 9వ తేదీ 440వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. 500ల పూల మాలలు అందించేందుకు మీనా కష్టపడుతూనే ఉంటుంది. పూల దండలు అల్లేందుకు బస్తీ మహిళలందరూ కూడా వేగంగా పని చేస్తూ ఉంటారు. ఇక అర్ధరాత్రి అయ్యే సరికి అందరూ నిద్ర మత్తులోకి జారుకుంటారు. దీంతో బాలు వచ్చి అందరి నిద్ర మత్తు పోగొట్టడానికి ప్రయత్నిస్తాడు. అందరూ నిద్ర మత్తులోకి జారుకుంటే ఎలా అని బాలు అంటాడు. అందరూ మేలుకున్నాక వారిలో జోష్ నింపేందుకు ప్రయత్నిస్తాడు. మరోవైపు సుమతి కూడా అందరిని అలరించేందుకు అంత్యక్షరి ఆడుదామని సూచిస్తుంది.

ముందుగా మీనానే పాట పాడటని అంటారు. మీనా చక్కటి పాట పాడి అందరిలో హుషారు పెంచుతుంది. స్త్రీల గొప్ప తనాన్ని వివరించే పాటను పాడుతుంది. ఆ తర్వాత బాలు పాటను వినిపిస్తాడు. మీనా, బాలు పాడిన తర్వాత సుమతి, కామాక్షి, రోహిణి కూడా పాడుతారు. మరోవైపు మనోజ్ ఆడుతూ పాడుతూ అలరిస్తాడు. చివరిగా ప్రభావతి భరత నాట్యం చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇక రవి, శృతి ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేసి ఆకట్టుకుంటారు. మరోవైపు బాలు చెల్లులు మౌనికాను సంజూ టార్చర్ పెడుతూ ఉంటాడు. మానసికంగా క్షోభ పెడుతూ ఉంటాడు. ఇక ఫుల్ గా తాగేసి వచ్చి బెడ్ రూమ్ లో పడుకుంటాడు. మౌనికా హాల్ లోనే పడుకోకుండా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది. ఇక జూన్ 10వ తేదీ 441 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.?

Gunde Ninda Gudi Gantalu serial Expected episode 441 June 10th

మీనా రాత్రంతా కష్టపడి పూల దండలు అల్లుతూనే ఉంటుంది. బస్తీ మహిళలందరూ తమకు వీలైనంత వరకు పూల దండలు అల్లి ఇంటికి వెళ్లిపోతారు. ఇక మీనా మాత్రం మిగిలిన దండలను అల్లుతూనే రాత్రి అందరూ పడుకున్న మీనా ఒక్కతి మాత్రం పూల దండలు అల్లుతూనే ఉంటుంది. ఇక బాలు కూడా కాసేపు పడుకొని నిద్ర లేస్తాడు. చూసే సరికి మీనా ఒక్కతే మిగిలిన పూల దండలను అల్లుతుంటుంది. ఇక బాలు మీనాను కాసేపు నిద్ర పోవాల్సిందని అంటాడు. కానీ మీనా మాత్రం మళ్లీ మీ మాట పోతుందని, ఎక్కడా ఒక్క దండ కూడా తగ్గకుండా పూల దండలు అల్లిన తర్వాతనే పడుకుంటున్నానని తెలుపుతుంది. ఇక బాలు మీనాకు టీ కాచి ఇస్తాడు. దాంతో మీనా ఇంకా సంషిస్తుంది. త్వరగా పని పూర్తి చేసుకుంది.

ఇక పూల దండలు అల్లడం పూర్తయ్యాక ట్రాలీని పిలిచి పూల దండల లోడ్ ను ఎక్కించడానికి బాలు మీనా సిద్ధంగా ఉంటారు. ట్రాలీ వాడు వస్తాడు. కానీ ఆ డ్రైవర్ తన ప్రియురాలితో ఎప్పుడూ ఫోన్ లోనే మాట్లాడుతూ ఉంటాడు. చుట్టూ పక్కల ఏం జరుగుతుందనే ధ్యాసలో అస్సలు ఉండడు. ఓవైపు బాలు, మీనా పూల దండలను మోస్తూ, ట్రాలీ లోకి ఎక్కిస్తూ ఉంటారు. కనీసం ఆ డ్రైవర్ బాధ్యతగా వ్యవహరించడు. అయితే బాలు, మీనానే పూర్తిగా లోడ్ ఎక్కిస్తారు. ఇక చెప్పిన అడ్రస్ కు, సామూహిక వివాహాలు జరిగే లోకేషన్ ను ఈ దండలను చేర్చాలని చెబుతాడు. త్వరగా, జాగ్రత్తగా ఈ పూల దండల లోడ్ ను చేర్చమని అంటాడు. దానికి ఆ డ్రైవర్ కూడా సరేనని చెప్పి వెళ్తాడు. ఇక ట్రాలీని పంపించే ముందు బాలు పూల దండలతో నింపిన లోడ్ దగ్గర ఫొటోలు కూడా తీసుకుంటాడు. ఇక ఆ తర్వాత ట్రాలీ వెళ్లిపోతుంది.

అయితే బాలు పూల దండల ట్రాలీని పంపించేస్తాడు. దీంతో విజయవంతంగా ఆర్డర్ పూర్తి చేశామని ఇద్దరూ సంతోషిస్తాడు. అయితే అప్పటికే బాలుకు పార్టీ నేత దగ్గర పనిచేస్తున్న అశోక్ ఫోన్ చేసి పూల దండల గురించి ఆరా తీస్తాడు. పూల దండలు ఎప్పుడు వస్తాయని, పూర్తిగా అల్లడం అయ్యిందా? అని బాలును అడుగుతూ ఉంటాడు. అందుకు బాలు అన్నీ పూర్తయ్యాయని చెబుతాడు. ఒక్కటి కూడా తగ్గడానికి వీల్లేదని బాలుతో అశోక్ అంటాడు. ఒక్కటి కూడా తగ్గే సమస్యే లేదని చెబుతాడు. అయితే త్వరగా పంపించు అని అశోక్ అంటాడు. ఇక బాలు పూల దండల లోడ్ ను పంపించేస్తాడు. అయితే ఫైనాన్షియర్ గుణ అప్పటికే మీనా, బాలును నవ్వుల పాలు చేయాలని చూస్తున్న సంగతి తెలిసిందే. దీంతో తన అనుచరులను పంపించి ఆ పూల దండల ట్రాలీని ఎత్తుకెళ్లమని చెబుతాడు.

ఇక ట్రాలీ స్టార్ట్ కాగానే వెంటనే తన అనుచరులు ఫాలో అవుతారు. కాస్తా ముందుకు వెళ్లగానే గుర్తు తెలియని మరో ఇద్దరు రౌడీలను పెట్టి వాళ్లతో ట్రాలీని ఎత్తుకెళ్లేలా ప్లాన్ చేస్తారు. ఇక ట్రాలీ దగ్గరికి రాగానే పక్కనే బైక్ పై వెళ్తూ ఆ రౌడీలు పూల దండల లోడ్ ఉన్న ట్రాలీ డ్రైవర్ ను టైర్ పంక్ఛర్ అయ్యిందని మభ్య పెడుతారు. దాంతో అతను ట్రాలీ ఆపి ఏమైందని దిగి చూస్తాడు. ఈ క్రమంలో ఆ రౌడీ ట్రాలీని స్టార్ చేసి తీసుకెళ్తాడు. ఇక ఆ ట్రాలీని సిటీలో ఎక్కడ కనిపించకుండా చేయాలని, అలాగే ఆ పూల దండలను సిటీ ఔట్ కట్స్ లో ఉన్న డంపింగ్ యార్డ్ దగ్గరకు తీసుకెళ్లి కాల్చేయండి అని చెబుతాడు. ఇక ఆ ట్రాలీనీ డంపింగ్ యార్డ్ వైపే తీసుకెళ్తాడు ఆ రౌడీ.

అయితే ట్రాలీని ఎత్తుకెళ్లిన సంగతిని డ్రైవర్ బాలుకు ఫోన్ చేసి చెబుతాడు. అదే సమయంలో బాలుకు పార్టీ నేత ఫోన్ చేసి పూల దండల గురించి అడుగుతాడు. ఇంకా ఎందుకు రాలేదని, నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? అని అంటాడు. నాకు పూల దండలు రాకపోతే మాత్రం నిన్ను, నీ ఫ్ఱెండ్ ను చంపేస్తానని హెచ్చరిస్తాడు. ఇక బాలు ఆ ట్రాలీ ఎక్కడికి వెళ్లిపోయిందని ఆటోలో వెతుకుతూ ఉంటాడు. బాలుతో పాటు మీనా కూడా వెతుకుతుంది. ఇలా ఎంత వెతికినా ప్రయోజనం ఉండదని, ఆ ట్రాలీ దగ్గర దిగిన ఫొటోను తన డ్రైవర్ల గ్రూప్ లో పెడుతాడు. ఆ బండి కనిపిస్తే చెప్పండి అని, అత్యవసరమని చెబుతాడు. కాసేపటికి ఆ బండి కనిపించిందని బాలుకు ఫోన్ వస్తుంది. అయితే గుణ బాలు, మీనా పడుతున్న టెన్షన్ ను మొదటి నుంచి చూసి ఎంజాయ్ చేస్తాడు. ఇక బండి దొరికిందనే ఫోన్ వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది తర్వాత ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X