Gunde Ninda Gudi Gantalu June 12th : మీనాపై అత్త ప్రభావతి కుట్ర.. రోహిణి పార్లర్ కు వెళ్లి షాకిచ్చిన మనోజ్
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూన్ 11వ తేదీ 442వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలు, మీనాలకు పెద్ద గండం తప్పింది. రాజకీయ నేత నుంచి ప్రాణభయం తొలగిపోయింది. 500 పూల దండలను సమయానికి ఇవ్వకపోతే ప్రాణాలతో బతకనివ్వని చెప్పిన ఆ నేతకు ఎట్టకేళలకు బాలు రౌడీలు ఎత్తుకెళ్లిన ట్రాలీని తిరిగి తీసుకొచ్చి అప్పగిస్తాడు. దీంతో బాలు నిజాయతికీ మెచ్చి ఆ నాయకుడు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే డబ్బులు ఇస్తాడు. ఇక ఆ డబ్బులను తీసుకొని మీనా బాలు ఇంటికి తిరిగి వెళ్తారు. పూల దండలు అల్లడంతో వచ్చిన డబ్బుల్లో తనకోసం ఎంతగానో సాయం చేసిన బస్తీ వాళ్లకు కూడా మీనా డబ్బులు ఇవ్వడానికి వెళ్తుంది. కానీ వాళ్లు తీసుకోరు.
తమ సాయాన్ని డబ్బుతో ముడిపెట్టొద్దని మీనాకు సూచిస్తారు.ఇక ఆ డబ్బులతో మీనాను బంగారు చైన్ చేయించుకోమని సలహానిస్తారు. కానీ మీనా మాత్రం ఆ డబ్బులతో బాలుకు కారు కొనివ్వాలని అనుకుంటున్నట్టు చెబుతుంది. తన భర్త ఆటో నడుపుతుంటే మనస్సుకు బాధగా ఉందని అంటుంది. ఇక కారు కొనే విషయమై బాలు స్నేహితుడు రాజేష్ వద్దకు వెళ్తుంది. వెళ్తూ వెళ్తూ తన వెంట డబ్బులు కూడా తీసుకెళ్తుంది. బాలుకు చెప్పకుండానే కారు కొనాలని అనుకుంటుంది. రాజేష్ దగ్గరకు వెళ్లి కారు విషయం మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. కారు కొనివ్వాలనుకుంటున్నానని చెబుతుంది. ఈ క్రమంలో తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.ఇక జూన్ 12వ తేదీ 443 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.?

పూల దండల ఆర్డర్ తో వచ్చిన డబ్బులను మీనా ఇంట్లో భద్రంగా దాస్తుంది. అయితే ఆ డబ్బులతో మీనా బాలకు కారును కొనివ్వాలని అనుకుంటుంది. ఇక బాలుకు కూడా చెప్పకుండా కారు కొనిచ్చి సర్ ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటుంది. అందుకు బాలు ప్రాణ స్నేాొహితుడు రాజేష్ దగ్గరకు వెళ్తుంది. తన భర్త బాలుకు కారు కొనివ్వాలని అనుకుంటున్నట్టు చెబుతుంది. బాలు ఆటో నడుపుతూ ఉంటే తనకు అస్సలు నచ్చడం లేదని అంటుంది.అందుకే బాలుకు కారు ఇద్దామని అనుకుంటున్నానని చెబుతుంది. మరీ కారు కొనడానికి డబ్బులు ఉన్నాయా? అని రాజేష్ అడుగుతాడు. కొత్త కారు తీసుకోవడం చాలా కష్టం అవుతుందని చెబుతాడు. అయితే సెకండ్ హ్యాండ్ లో కారు తీసుకుందామని రాజేష్ సలహానిస్తాడు. అలాంటి కారేదైనా ఉంటే చూడండి అన్న అంటూ రాజేష్ తో అడుగుతుంది.
అందుకు రాజేష్ స్పందిస్తూ సెకండ్ హ్యాండ్ లో ఒక కారు ఉందని చెబుతాడు. బాలు కూడా గతంలో ఆ కారు తీసుకుందామని చూశాడని మీనా తో చెబుతాడు. మరి ఇప్పుడు ఆ కారు ఉందో లేదో ఒకసారి వెళ్లి చూద్దామని అనుకుంటారు. వెంటనే ఆ కన్సల్టెన్సీకి అందరూ వెళ్తారు. అక్కడ ఓనర్ ను కలుస్తారు. సెకండ్ హ్యాండ్ లో కారు తీసుకోవాలని అనుకుంటామని చెబుతారు. గతంలో బాలు కోసం చూసిన కారునే కావాలని అడుగుతారు. ఆ కారు ఉందని యజమానికి చెబుతాడు. మరీ బాలు అప్పుడు డబ్బులు లేవని చెప్పాడు కదా. ఇప్పుడు ఎలా తీసుకుంటారని అడుగుతాడు. మీనాను చూపించి బాలుకు తెలియకుండా తీసుకోవాలి అనుకుంటున్నట్టు చెబుతాడు రాజేశ్. దాంతో ఆయన సరేనని కారును చూపిస్తాడు. మొత్తం 3 లక్షలు కట్టాలని అంటాడు. కానీ మొత్తం ఇప్పుడే కట్టాల్సిన పనిలేదని చెబుతాడు. ముందుగా అడ్వాన్స్ 80 వేలు ఇస్తే సరిపోద్దని చెబుతాడు. అందుకు మీనా సరేనని అంటుంది.
డబ్బులు జమా చేసుకొని వచ్చి తీసుకెళ్తామని, ఆ కారును ఎవ్వరికీ ఇవ్వొద్దని అంటుంది. ఇక మీనా దగ్గర పూలు అల్లిన డబ్బులు కేవలం 50 వేలు, తను పూలకొట్టు ద్వారా సంపాదించిన 10 వేలు మాత్రమే ఉన్నాయని రాజేష్ తో అంటుంది. ఇంకా 20 వేలు అవసరం ఉందని చెబుతుంది. ఆ డబ్బులు ఇస్తామని రాజేష్ అంటే కూడా వద్దని చెబుతుంది. నేను అరెంజ్ చేస్తానని చెప్పి ఇంటికి వెళ్తుంది. ఇక ఆ డబ్బుల కోసం మీనా చక్రపాణి అనే వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు తీసుకోవాలని అనుకుంటుంది. సుమతి చెప్పడంతో ఆ వడ్డీ వ్యాపారి అప్పు ఇచ్చేందుకు సిద్ధమవుతాడు. మీనా పూల కొట్టు చూసిన తర్వాతనే డబ్బు ఇస్తానంటాడు. దాంతో ఇంటికి వెళ్లి పూల కొట్టును చూసి మీనాతో ప్రామీసరీ నోట్ పై సంతకం చేయించుకొని అప్పుగా 20 వేలు ఇస్తాడు. అయితే వడ్డీ వ్యాపారి దగర మీనా అప్పు తీసుకున్న సమయంలో ప్రభావతి కూడా వచ్చి చూస్తుంది. ఎందుకు అప్పు చేస్తున్నావని మీనాను అడుగుతుంది. కానీ మీనా బదులివ్వదు. తనకు బంగారం కొనుక్కోవాలని ఉందని చెబుతుంది.
కానీ ప్రభావతి మాత్రం మీనా అప్పు తీసుకున్నందుకు ఇంట్లో నానా రచ్చ చేస్తుంది. అసలు ఆ డబ్బులు ఎందుకు తీసుకున్నావని అందరు ముందే నిలదీస్తానని అనుకుంటుంది. అంతకు ముందే మీనా బాలు హాలులో పడుకుంటారు. బాలు ఆటో నడిపి అలిసిపోవడంతో కాస్తా వెన్ను నొక్కుతూ ఉంటుంది. ప్రభావతి వచ్చే సమయానికి బాలు వెనక్కి తిరగడంతో బాలుపై మీనా పడుతుంది. అది చూసిన ప్రభావతి ఇంట్లో మనసుషులు ఉన్నరన్న సంగతే మర్చిపోయారా? హాలులోనే ఇలాంటి పని చేస్తే కిందికి దిగడానికి చాలా ఇబ్బందిగా ఉందని అంటుంది. సూటిపోటు మాటలతో నానా హంగామా చేస్తుంది. ఇక ఆ వెంటనే సత్యం వచ్చి ప్రభావతి నోరు మూయిస్తాడు.
మరోవైపు మౌనికాను సంజూ ముప్పు తిప్పలు పెట్టాలని ప్రయత్నిస్తాడు. కానీ మౌనికా తన భర్త మారాలని దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది. గుడిలో పూజారి చెప్పిన విధంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టకుండా ఉపవాస దీక్ష చేస్తుంది. కానీ సంజూ మాత్రం మౌనికా దీక్షకు ఆటంకం కలిగించాలని అనుకుంటాడు. ఇక మరోవైపు రోహిణి పార్లర్ కు మనోజ్ వెళ్తాడు. అక్కడ బ్యూటీ పార్లర్ పేరు మారడం గమనిస్తాడు. ప్రభావతికి బదులుగా క్వీన్స్ బ్యూటీ పార్లర్ అని ఉండటంతో చూసి షాక్ అవుతాడు. ఇక రోహిణికి మనోజ్ బ్యూటీ పార్లర్ కు వచ్చిన సంగతి తెలుస్తుంది. దీంతో బోర్డు పై ఉన్న పేరు చూస్తాడేమోనని కంగారు పడుతూ రెసెప్షన్ కు వస్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











