Gunde Ninda Gudi Gantalu June 13th : రోహిణి మోసాన్ని తెలుసుకున్న మనోజ్.. నానా రచ్చ చేసిన ప్రభావతి
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూన్ 12వ తేదీ 443వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మీనా బాలుకు సర్ ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటుంది. పూల దండల ఆర్డర్ తో వచ్చిన డబ్బులతో బాలు కోసం కారు కొనివ్వాలని నిర్ణయించుకుంటుంది. అందుకు బాలు స్నేహితుడు రాజేష్ దగ్గరకు వెళ్లి విషయం చెబుతుంది. అందరూ ఓ కారు కన్సల్టెన్సీకి వెళ్లి సెకండ్ హ్యాండ్ కార్లను చూస్తారు. ఒక కారును ఫైనల్ చేస్తారు. అక్కడ ముందుగా 80 వేలు అడ్వాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మీనా దగ్గర ఉన్న డబ్బులకు ఇంకా 20 వేలు కావాల్సి ఉంటుంది. ఆ డబ్బులను ఫైన్సాన్షియర్ దగ్గర అప్పుగా తీసుకుంటుంది. అతను ఇంటికి వచ్చి మీనాకు డబ్బులు ఇచ్చి వెళ్తాడు.
అది ప్రభావతి చూస్తుంది. ఎందుకు అప్పు చేశావని అడుగుతుంది. అందుకు మీనా అవసరం ఉందని, నేను బంగారం చేయించుకోవాలని చెబుతుంది. కానీ ప్రభావతి ఆ మాట నమ్మబోదు. మీ పుట్టింటి వాళ్ల కోసమే అప్పు చేశామని తప్పుగా అర్థం చేసుకుంటుంది. సూటిపోటుగా మాట్లాడుతూ ఉంటుంది. అయినా ఓపిగ్గానే ఉంటుంది. మరోవైపు మౌనికాను సంజూ టార్చర్ చేస్తూనే ఉంటాడు. కానీ మౌనికా సంజూను మంచిగా మార్చుకోవాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం ప్రారంభిస్తుంది. ఇక సంజూ మౌనికా చేస్తున్న పూజలకు ఆటంకం కలిగించాలని ప్రయత్నిస్తాడు.ఇంకోవైపు రోహిణి పని చేస్తున్న బ్యూటీ పార్లర్ కు మనోజ్ వెళ్తాడు. అక్కడ పార్లర్ కు ప్రభావతి నేమ్ బోర్డుకు బదులు క్వీన్ బ్యూటీ పార్లర్ అని ఉంటుంది. అది చూసి షాక్ అవుతాడు. ఇక మనోజ్ పార్లర్ కు వచ్చిన సంగతి తెలుసుకొని రోహిణి కంగారు పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 13వ తేదీ 444 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.?

బాలుకు తెలియకుండా కారు కొనివ్వడానికి మీనా చాలా ప్రయత్నం చేస్తుంటుంది. ఎవ్వరికీ తను కారు కొనబోయే విషయం తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతుంది. అంతే కాదు డబ్బులు అరెంజ్ కావడంతో వెంటనే వెళ్లి కారు కన్సల్టెన్సీ ఆఫీస్ లోనూ కట్టేస్తుంది. రాజేష్, మీనా వెళ్లి డబ్బులు కట్టి కారును సొంతం చేసుకుంటారు. ఇక మీనా రాజేష్ ను మరో సాయం అడుగుతుంది. ఒకసారి బాలును కూడా తీసుకొచ్చి కారును చూపించమని అంటుంది. వాడిని ఎందుకు తీసుకొచ్చి చూపించడమని రాజేశ్ సందేహిస్తాడు. మళ్లీ ఈ కారు నచ్చకపోతే డబ్బులు వృథా అవుతాయి కదా అని అనుకుంటుంది. వేరొకరికి కారు కావాలని చెప్పి కండీషన్ గురించి అడగమని మీనా సలహానిస్తుంది. అలా అసలు విషయం తెలియకుండా ఆ కారుపై బాలు అభిప్రాయాన్ని తెలుసుకోమని చెబుతుంది. అందుకు రాజేష్ సరేనని అంటాడు.మొత్తానికి బాలుకు కారునివ్వబోతున్నందుకు మీనా సంతోషంలో మునిగి తేలుతుంటుంది.
మరోవైపు ప్రభావతి మీనాపై బుసలు కొడుతుంది. అసలు డబ్బులు ఎందుకు అప్పుగా తీసుకుందనే విషయం తెలియక తల బాదుకుంటుంది. ఎలాగైనా ఉన్న డబ్బులకు తోడు అప్పు తీసుకున్న డబ్బులతో ఏం చేసిందనే విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటుంది. మీనాను అందరి ముందు అడిగి కడిగి పారేస్తానని ఊగిపోతుంది. ఇక బాలు ఇంట్లో నుంచి బయటకి వెళ్తుంటే ఆపుతుంది.కాస్తా మాట్లాడాలి కాసేపు ఆగమని చెబుతుంది. ఆ లోపు సత్యం బయటి నుంచి ఇంట్లోకి వస్తాడు. సత్యంను కూడా ఇంట్లో ఆగమని చెబుతుంది. మీ అందరికీ ఓ విషయం చెప్పాలని అంటుంది. సరే చెప్పమని వాళ్లు అడగటంతో కాసేపు ఆగండి అని మీనా వచ్చే వరకు వెయిట్ చేయిస్తుంది. మీనా ఇంట్లో అడుగు పెట్టగానే ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అసలు ఎక్కడికి వెళ్లి వచ్చావే అని నిలదీస్తుంది.
అందుకు మీనా స్పందిస్తూ బయట పని ఉండి వెళ్లి వచ్చానని అంటుంది. అదే ఎక్కడికి వెళ్లి వచ్చావో చెప్పొచ్చు కదా అని ప్రభావతి మీనాను ప్రశ్నిస్తుంది. ఎవ్వరికీ చెప్పకుండా మీ పుట్టింటికి వెళ్లి వచ్చావు కదా అని అంటుంది. అందుకు మీనా మౌనంగా ఉంటుంది. ఇక ప్రభావతి రెచ్చిపోతుంది. మీనా తన పుట్టింటికి వెళ్లిందని, పూల దండలపై వచ్చిన డబ్బులను తీసుకెళ్లి తన పుట్టింటికి ఇచ్చి వచ్చిందని కోపం చేస్తుంది. అంతే కాదు మరి కొంత డబ్బులు కాగితంపై సంతకం చేసి అప్పుగానూ తీసుకుందని ప్రభావతి అంటుంది. దాంతో బాలు, సత్యం షాక్ అవుతారు. కానీ బాలు మాత్రం మీనాపై పూర్తి నమ్మకంగా ఉంటాడు. నా భార్య మీనా ఏ పని చేసినా దాని వెనకాల ఒక బలమైన కారణం ఉండే ఉంటుందని చెబుతాడు. మరోవైపు సత్యం కూడా మీనాకు సపోర్ట్ గా నిలుస్తాడు. ఆఫీస్ కు వెళ్దామని కిందికి దిగిన రవి, శృతిలు కూడా విషయం తెలుసుకొని మీనాకే సపోర్ట్ చేస్తారు. మీనా కష్టపడి సంపాదించిన డబ్బులను తన అవసరాలకు ఖర్చు పెట్టుకోవడంలో తప్పేమీ లేదు కదా అని అందరూ అంటారు.
కానీ ఎందుకనే విషయాన్ని చెప్పాలి కదా అని ప్రభావతి వాదిస్తుంది. ఇప్పుడు నేను ఎవ్వరికీ ఏం చెప్పను. ముందుముందు మీకే తెలుస్తుంది. నా పుట్టింటికో, బంగారానికో ఆ డబ్బును నేను వాడుకోలేదని మీనా ప్రభావతికి సమాధానం ఇస్తుంది. ఆ డబ్బు గురించి నువ్వెమైనా అడగాలని అనుకుంటున్నావా? అని బాలును మీనా ప్రశ్నిస్తుంది. అందుకు బాలు స్పందిస్తూ చచ్చినా అడగబోనని అంటాడు. ఇక మరోవైపు మనోజ్ రోహిణి పార్లర్ కు ప్రభావతి పేరును తీసివేయడంతో షాక్ అవుతాడు. కోపంతో రగిలిపోతాడు. కానీ రోహిణి తన తెలివి తేటలు ఉపయోగించి డబ్బులు బాగా వస్తాయని, అందుకే పెద్ద కంపెనీతో పార్లర్ ను కలిపేశానని చెబుతుంది. దాంతో మనోజ్ సంతోషిస్తాడు. ఇంటికి వెళ్లి అందరూ హాలు లో ఉండగానే ప్రభావతికి గుడ్ న్యూస్ అమ్మ అని అసలు విషయం చెబుతాడు. పార్లర్ కు నీ పేరు తీసేసి క్వీన్ పార్లర్ అని మార్చేశాం. దాని కారణం ఉంది. బాగా డబ్బులు వస్తాయని చెబుతాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. ప్రభావతి కూడా కంగుతింటుంది. అంత పెద్ద తప్పు చేసినా ప్రభావతి రోహిణిని పల్లెత్తు మాట అనదు. సైలెంట్ గా వెళ్లిపోతుంది. పైగా రోహిణికే సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











