Gunde Ninda Gudi Gantalu June 14th : రోహిణి గొంతు పట్టుకున్న ప్రభావతి.. అత్త చేతిలో పెద్ద కోడలు చిత్తుచిత్తు

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూన్ 13వ తేదీ 444వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలుకు కారు కొనిచ్చి సర్ ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటుంది మీనా. అందుకు పూల దండలు అల్లిన ఆర్డర్ ద్వారా వచ్చిన డబ్బులతో కారును కొనివ్వాలని అనుకుంటుంది. అందుకు తగిన ఏర్పాట్లన్నీ చేస్తుంది. బాలు స్నేహితుడు రాజేష్ సాయంతో కారు కొనేందుకు సిద్ధమవుతుంది. కారు కన్సల్టెన్సీలో అడ్వాన్స్ డబ్బులు కూడా కడుతుంది. మరోవైపు బాలుకు కూడా ఆ కారును సర్ ప్రైజ్ గా ఇస్తున్నామని తెలియకుండా, చూపించమని రాజేష్ కు చెబుతుంది మీనా. అందుకు రాజేష్ కూడా సరేనని చెప్పి మీనాకు హామీనిస్తాడు.

అయితే మీనాకు అత్త ప్రభావతితో తలనొప్పి స్టార్ట్ అవుతుంది. పూల దండల ఆర్డర్ పై వచ్చిన డబ్బులే కాకుండా అప్పు చేసి మరీ తీసుకున్న డబ్బులను ఏం చేశావని ప్రభావతి మీనాను నిలదీస్తుంది. అంతే కాదు రవి, శృతి, సత్యం, బాలు అందరి ముందే ప్రశ్నిస్తుంది. అసలు ఎందుకు అప్పు తీసుకున్నావని అడుగుతుంది. తన పుట్టింటికి దోచి పెట్టడానికే అప్పు తీసుకుందని ప్రభావతి మీనాను నిందిస్తుంది. దాంతో మీనా ఫైర్ అవుతుంది. అసలు మా పుట్టింటి వాళ్లు నా దగ్గర నుంచి నయా పైసా కూడా ఆశించడం లేదని చెబుతుంది. మరోవైపు రోహిణి తన పార్లర్ కు ప్రభావతి పేరును తీసేసిన విషయం ఇంట్లో మనోజ్ ద్వారా తెలుస్తుంది. అంత పెద్ద విషయం తెలిసినా రోహిణిని మాత్రం ప్రభావతి ఒక్క మాట అనదు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 14వ తేదీ 445 ఎపిసోడ్ లో ఏం జరిగి ఉంటుందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial Expected episode 445 June 14th Expected

బాలు తన స్నేహితులు, తోటి డ్రైవర్ల కోసం తన కారును అమ్ముకుంటాడు. ఫైన్సాన్షియర్ గుణ, మీనా తమ్ముడు శివ చేసిన రచ్చ కారణంగా కోపోద్రేకిడవుతాడు. దాంతో గుణ దగ్గర అప్పు చేసిన తన స్నేహితులకు సాయం చేసేందుకు తన కారు అమ్మి ఆ అప్పులు కడుతాడు. ఆ తర్వాత తను ఆటో కొనుక్కోని నడుపుతూ ఉంటాడు. విషయం తెలిసినా మీనా బాధపడుతుంది. అదృష్టం కొద్ది మీనాకు బాలు స్నేహితుడు అశోక్ ద్వారా పెద్ద పూల దండల ఆర్డర్ వస్తుంది. ఆ ఆర్డర్ పూర్తి చేయడంతో లాభం వస్తుంది. ఆ డబ్బులతో మీనా బాలుకు కారు కొనివ్వాలని అనుకుంటుంది. అనుకున్నట్టుగానే రాజేష్ సాయంతో సెకండ్ హ్యాండ్ కారును కొనేందుకు నిర్ణయించుకుంటుంది. అందుకు డబ్బులు సరిపోకపోవడంతో చక్రపాణి అనే వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు చేస్తుంది.

మీనా వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు చేయడం ప్రభావతి చూస్తుంది. అసలు ఎందుకు అప్పు చేయాల్సి వచ్చిందని, ఆ డబ్బుతో ఏం చేశావని నిలదీస్తుంది. కానీ మీనా ఇప్పుడు నేను చెప్పలేనని మున్ముందు మీకే తెలుస్తుందని అంటుంది. ఈ విషయంలో మీనాకు కుటుంబ సభ్యులందరూ సహకరిస్తారు. కానీ ప్రభావతి మాత్రం నానా రచ్చ చేస్తుంది. ఇంట్లో ఎవ్వరికి తెలియకుండా డబ్బులన్నీ ఏదో చేస్తుందని నిందిస్తుంది. దాంతో మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది. నేను ఇప్పుడు ఏమీ చెప్పలేనని పైన గదిలోకి వెళ్లిపోతుంది. ఇదే సమయంలో మనోజ్ రోహిణి ఇంటికి తిరిగి వస్తారు. ఇక మనోజ్ రోహిణి పార్లర్ కు తల్లి ప్రభావతి పేరును మార్చేసినట్టు చెబుతాడు. దాంతో ప్రభావతితో పాటు సత్యం, బాలు షాక్ అవుతారు.

తల్లి ప్రభావతి పేరును పార్లర్ నుంచి తీసివేయడం ఏంటని మనోజ్ ను సత్యం, బాలు, ప్రభావతి అడుగుతారు. దాంతో మనోజ్ స్పందిస్తూ అసలు విషయం చెబుతాడు. అసలు ఆ పార్లర్ ను క్వీన్ బ్యూటీ పార్లర్ కు అమ్మేసినట్టు చెబుతాడు. అందుకు కారణం ఉందని చెబుతాడు. అలా ఆ కంపెనీతో కలిసిపోవడం వల్ల కస్టమర్లు పెరుగుతారని, ఎక్కువ ఆదాయం వస్తుందని మనోజ్ తల్లి ప్రభావతికి వివరిస్తాడు. దీంతో ప్రభావతి అక్కడే ఉన్న రోహిణిని అడుగుతుంది. ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నిస్తుంది. నేను చెబుదామని అనుకున్నాను అత్తయ్య, కానీ ఈలోపు మనోజే చెప్పాడని బదులిస్తుంది. ఇక రోహిణిని మాత్రం ఒక్క మాట అనకుండా.. పర్లేదమ్మ పేరులో ఏముంది మనకు ఆదాయం ముఖ్యం. అలాగే నువ్వు ఏ పని చేసినా దాని వెనకాల ఏదోక కారణం ఉండే ఉంటుందని చెప్పి సమర్దిస్తుంది.

ప్రభావతి రోహిణితో మాట్లాడిన మాటలు, తీరుకు సత్యం, బాలు షాక్ అవుతారు. చూశావా నాన్న ప్రభావతమ్మ రోహిణి ఎంత పెద్ద తప్పు చేసినా పల్లెత్తు మాట కూడా అనలేదు. కానీ మీనాపై మాత్రం విరుచుకుపడిందని బాలు తండ్రి సత్యంతో అంటాడు. అలా ఏం కాదులేరా లోపల మీ అమ్మకు బాగానే కాలిపోతూ ఉంటుంది. నెమ్మదిగా గదిలోకి పిలిచి ఎలా మండిపోతుందో ఎవరికి తెలుసు అని సత్యం కొడుకు బాలుతో అంటాడు. ఇక ప్రభావతి పేరును బ్యూటీ పార్లర్ కు తీసివేసిన విషయం తెలిసిన తర్వాత చాలా బాధపడుతుంది. ఎందుకిలా చేసిందని తనతో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక రేపటి నుంచి తనను బాలు, మీనా చులకనగా చూస్తారని ఆందోళన పడుతూ ఉంటుంది.

కాగా, రోహిణ కూడా అత్త ప్రభావతికి అసలు విషయం తెలిసిపోవడంతో ఎలా స్పందిస్తుందోనని భయపడుతుంది. ఇక రాత్రి అందరూ పడుకుంటారు. మనోజ్, రోహిణి కూడా ప్రభావతికి నిజం చెప్పడం వల్ల ఏమనుకుంటుందోనని కాసేపు మాట్లాడుకొని పడుకుంటారు. ఇక రోహిణికి కల వస్తుంది.అందులో ప్రభావతి రోహిణిని తన గదిలోకి పిలిచి తన పేరును ఎందుకు మార్చావని ప్రశ్నిస్తుంది. ఇదే దాచావా? లేకా ఇంకేమైనా దాచావా అని నిలదీస్తుంది. అసలు మీ నాన్న మలేషియాలో ఉంటున్నదని కూడా నిజమేనా అబద్ధమా అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంది. ఈ క్రమంలోనే రోహిణి గొంతు పట్టుకున్నట్టుగా కల కంటుంది. తేరుకొని ఆందోళన పడుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X