Gunde Ninda Gudi Gantalu June 28th : రోహిణి తప్పించుకొని బాలును ఇరికించింది.. శృతి ఫంక్షన్ లో ఊహించని షాక్
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూన్ 27వ తేదీ 454వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. శృతికి తాళి మార్చే ఫంక్షన్ ఉంటడంతో అందరూ కలిసి ఫంక్షన్ హాలుకు వెళ్తారు. ఇక అక్కడే రోహిణి కూడా తాళి మార్చే కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభావతి చెప్పడంతో గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రోహణి వాళ్ల నాన్నను ప్రభావతి మలేషియా నుంచి రమ్మని చెబుతుంది. దాంతో తన తండ్రిని రప్పించే బాధ్యత తనది చెప్పి ఒప్పిస్తుంది. కానీ అందరూ ఫంక్షన్ హాలుకు చేరుకున్నాక కూడా ఇంకా రోహిణి వాళ్ల నాన్న రాకపోవడంతో ప్రభావతి మండిపడుతుంది. ఇకెప్పుడు మీ నాన్న వస్తాడని ఫైర్ అవుతుంది. ఏమైనా అడిగితే వస్తున్నాడని, ఫైట్ ఎక్కాడని, దిగాడని చెబుతూనే ఉన్నావని మండి పడుతుంది. ముందు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాడో కనుక్కోమని అంటుంది.
దాంతో రోహిణి సరేనని చెప్పి ప్రభావతి మందే మరొక ఫోన్ నెబర్ కు కాల్ చేసి అందుబాటులో లేదని చెబుతుంది. మార్గ మధ్యలోనే ఉంటారని చెబుతుంది. ఇక మీ నాన్న వచ్చేంత వరకు మనకు సమయం లేదుగానీ నువ్వైతే త్వరగా రెడీ అవ్వమని ప్రభావతి రోహిణికి చెబుతుంది. ప్రభావతి వెళ్లిపోగానే రోహిణి ఇంకా ఆందోళన పడుతుంది. ఫంక్షన్ లో బాలును అడ్డుగా పెట్టుకొని ఫోకస్ మొత్తం తన మీద నుంచి బాలుపైకి వెళ్లేలా ప్లాన్ చేయాలని అనుకుంటుంది. అందుకోసం తన స్నేహితురాలు విద్యతో కలిసి మనుషులను ఏర్పాటు చేస్తుంది. బాలుతో గొడవ పడేందుకు మనుషులను ఏర్పాటు చేయించాలని చెబుతుంది. అలాగే తమ మనిషిని ఒకరిని రప్పిస్తుంది. కిరాయి రౌడీని పిలిపిస్తారు. ఈ క్రమంలో తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 28వ తేదీ 455 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

బాలును అడ్డుగా పెట్టుకొని ఫంక్షన్ మొత్తాన్ని ఖరబ్ చేయాలని, ఆ నింద మొత్తం బాలుపైనే తోసేయాలని ఇద్దరు ప్రత్నిస్తున్నారు. తొలుత శృతి వాళ్ల అమ్మ శోభ బాలుపై కుట్ర పన్నుతుంది. తన కూతురు శృతిని, రవిని పూర్తిగా తమ ఇంటికి తీసుకు రావాలని ప్రయత్నం చేస్తుంది. ఇందుకు తాళి మార్చే ఫంక్షన్ పేరుతో పెద్ద ఎత్తున బంధువులు, తమ బలగాన్ని ఆహ్వానిస్తారు. ఇక బాలుతో గొడవ చేయించేందుకు తమ అనుచరులను కూడా ఫంక్షన్ లోకి రానిస్తారు. వాళ్లతో ఎలాగైనా బాలుతో గొడవ పడేలా చేయాలని, బాలుకు ముక్కు మీదనే కోపం ఉంటుంది కాబట్టి అది వాడుకోని పెద్ద గొడవ చేయాలని ప్లాన్ చేస్తుంది. మరోవైపు బాలు ఇంకెవ్వరితో గొడవ పడకూడదని నిర్ణయించుకుంటాడు. ఫంక్షన్ పూర్తయ్యే వరకు అస్సలు నోరు కూడా తెరవొద్దని గట్టి పడుదలతో ఉంటాడు. కనీసం ముందు వరుసలో కూడా కూర్చొకుండా వెళ్లి వెనకాల కూర్చొంటాడు. బాలుతో పాటే మీనా కూడా వెనకాల కూర్చొంటుంది. ఇద్దరూ సైలెంట్ గా తమకు ఆ ఫంక్షన్ తో సంబంధం లేదు అన్నట్టుగా ఉంటారు.
ఇక మరోవైపు మనోజ్ భార్య, బాలు వదిన కూడా బాలునే అడ్డు పెట్టుకొని తన సమస్య నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంది. అందుకు బాలుతో ఎలాగైనా గొడవ జరిగేలా చేయాలని ప్లాన్ చేస్తుంది. తన స్నేహితురాలు విద్యతో కలిసి ఓ రౌడీని కిరాయికి తెప్పిస్తుంది. వాడితో బాలును ఎలాగైనా తాగేలా చేయించమని అంటుంది. కానీ వచ్చిన వాడేమో బాలును పైకి పంపించే ప్లానే చేస్తానని అంటాడు. అందుకు రోహిణి భయపడుతుంది. బాలుతో కేవలం మందు తాగిస్తే చాలు, అతనికి ఉన్న నోటి దూలకు గొడవ దానంతటా అదే అవుతుందని అంటుంది. ఇక అతనికి బాలు ఎక్కడ కూర్చున్నాడో రోహిణి, విద్య కలిసి చూపిస్తారు. ఇక తను బాలు సంగతి చూసుకుంటానని హామీనిచ్చి ఫంక్షన్ లోపలికి వెళ్తాడు. మరోవైపు శృతి వాళ్ల అమ్మ శోభ ఏర్పాటు చేసిన మనుషులు కూడా వస్తారు. వారికి కూడా శృతి వాళ్ల అమ్మ బాలును చూపించి గొడవ పెట్టుకోమని పురమాయిస్తుంది.
ఒకవైపు శృతి వాళ్ల అమ్మ ఏర్పాటు చేసిన మనుషులు, మరోవైపు సొంత వదిన రోహిణి ఏర్పాటు చేసిన మనుషులు ఇద్దరు కలిసి బాలుతో గొడవ చేయించేందుకు వెళ్తారు. ముందుగా శృతి వాళ్ల తల్లి శోభ ఏర్పాటు చేసిన మనుషులు వెళ్లి బాలు కూర్చొన్న కుర్చీల వరుసలో కూర్చొంటారు. బాలు అమాయకంగా ఎవ్వరితోనూ మాట్లాడకుండా కేవలం ఫంక్షన్ ను మాత్రమే చూస్తుంటాడు. ఇక గొడవ పెట్టుకునేందుకు ఇద్దరు కిరాయి రౌడీలు కుర్చీలను దాటుతూ బాలు కాలును కావాలనే తొక్కుతారు. ముందు ఒక వ్యక్తి తొక్కి వెళ్తాడు. దాంతో బాలు సరేనని ఊరుకుంటాడు. కానీ రెండోసారి కూడా కాలును తొక్కడంతో తిరగబడుతాడు. కళ్లు కనిపించడం లేదారా అని ఫైర్ అవుతాడు. ఇక పక్కనే ఉన్న మీనా బాలును ఆపాలని ప్రయత్నిస్తుంది. కోపం తగ్గించుకోమని చెప్పి వాళ్లకు సారీ చెప్పి వెళ్లిపోమని బతిమిలాడుతుంది. ఇక బాలు కూడా చూసీచూడనట్టుగా ఊరుకుంటాడు. వీళ్లతో అనవసరంగా తనకు గొడవ ఎందుకని బయటికి వెళ్లే ప్రయత్నం చేస్తాడు.
అప్పటికే బాలు తండ్రి సత్యాన్ని శృతి వాళ్ల తండ్రి సురేంద్ర తన స్నేహితుడితో అవమానిస్తాడు. కూర్చీలో కూర్చోబెట్టి కాలుపై కాలు వేసుకోమని చెప్పి చెబుతాడు. ఇక సురేంద్ర కుట్రను ముందుగానే గమనించిన సత్యం గొడవ జరిగేలా ఉందని తన స్నేహితుడిని తీసుకొని బయటికి వెళ్తాడు. ఇదే క్రమంలో బాలు కూడా ఎక్కడ ఏం గొడవ జరుగుతుందోనని పూర్తిగా సైలెంట్ గా ఉంటాడు. అయినా శృతి వాళ్ల అమ్మ శోభ, మనోజ్ భార్య రోహిణి ఇద్దరు కలిసి ఏర్పాటు చేసిన రౌడీలు బాలును నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ క్రమంలో బాలు వారిని ఎలా ఎదుర్కొన్నాడు. ఇంతకీ శృతి, రోహిణి తాళి మార్చే ఫంక్షన్ సవ్యంగా జరిగిందా? లేదా? అనే విషయాలపై ఉత్కంఠ నెలకొంది. ఇక చివరికి ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications










