Gunde Ninda Gudi Gantalu July 5th : బాలుపై చేయిచేసుకున్న శృతి.. మీనాను దోషిగా తేల్చి బీభత్సం
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూలై 4వ తేదీ 459వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. శృతికి తాళి మార్చే ఫంక్షన్ ను వాళ్ల తల్లిదండ్రులు అంగరంగ వైభవంగా జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఆ ఫంక్షన్ ద్వారా శృతిని, రవిని తమ ఇంటికే పూర్తిగా తీసుకొచ్చుకోవాలని, రవిని ఇల్లరికం తెచ్చుకోవాలని ప్రయత్నిస్తారు. అందుకు ఇద్దరు మనుషులను ఏర్పాటు చేసి బాలుతో గొడవ చేయాలని ప్లాన్ చేస్తారు. కానీ వాళ్లిద్దరు బాలుకు ఎంత కోపం తెప్పించాలని ప్రయత్నించినా అస్సలు కోపం తెచ్చుకోడు బాలు. వాళ్లిద్దరూ బాలును కొట్టినా, బాధపెట్టినా ఏమాత్రం స్పందించడు. భార్య మీనా, తండ్రి సత్యంకు ఇచ్చిన మాట కోసం మౌనంగా ఉంటాడు. ఎవ్వరితోనూ మాట్లాడకుండా, ఎవ్వరితోనూ గొడవ పడకుండా ఉంటాడు.
మరోవైపు బాలుతో గొడవ చేయించాలని మనోజ్ భార్య రోహిణి కూడా ఎంతగానో ప్రయత్నిస్తుంది. తను కూడా ఒక తాగుబోతును ఏర్పాటు చేసి అతనితో బాలుకు తాగించమని చెబుతుంది. దాంతో బాలుకు తాగించేందుకు ఆ వ్యక్తి ఎంతగానో ప్రయత్నిస్తాడు. బాలును చాలా బలవంతం చేస్తాడు. తాగమని మందు పోసి గ్లాస్ చేతికి ఇస్తాడు. తాగమని చాలా ఒత్తిడి చేస్తాడు. కానీ బాలు మాత్రం అస్సలు తాగనంటాడు. మాటల్లో పెట్టి అతనితోనే రివర్స్ లో తాగిస్తాడు. మందు మొత్తం అతనితోనే తాగించి, మీనా వచ్చి పిలవగానే వెళ్లిపోతాడు. ఇక తన భర్త తనకోసం అస్సలు తాగకపోవడంతో మీనా ఎంతగానో ఉప్పొంగిపోతుంది. తన భర్త బాలుకు థ్యాంక్స్ చెబుతుంది. ఇక ఫంక్షన్ కూడా సజావుగా జరుగుతుంది. దీంతో ఇటు శృతి వాళ్ల అమ్మనాన్న అనుకున్న ప్లాన్, మరోవైపు రోహిణి అనుకున్న ప్లానింగ్స్ ఏమాత్రం వర్కౌ అవుట్ కావు. దాంతో ఎలాగైనా గొడవ చేయాలని శృతి వాళ్ల నాన్న సురేంద్ర మీనాపై దొంగతనం నిందను వేస్తాడు. ఈ క్రమంలో ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూలై 5న తేదీ 460 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

బాలును అడ్డుగా పెట్టుకొని ఫంక్షన్ లో పెద్ద గొడవ చేయించాలని శృతి వాళ్ల అమ్మ శోభ, తండ్రి సురేంద్ర కుట్ర పన్నుతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే బాలు మొదటి నుంచే ఫంక్షన్ హాలుకు వచ్చిన సమయం నుంచి మౌనంగా ఉంటాడు. ఎవ్వరితో మాట్లాడకుండా, ఎవ్వరు ఏమన్నా సైలెంట్ గా ఉంటానని మీనాకు, తండ్రి సత్యంకు మాట ఇస్తాడు. వాళ్లకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడు. శృతి వాళ్ల అమ్మానాన్నలు బాలుపై కుట్ర చేసినా ఏమాత్రం వారి ట్రాప్ లో పడడు. పైగా మనోజ్ భార్య రోహిణి కూడా బాలుతో పెద్ద గొడవ చేయించాలని ప్రయత్నిస్తుంది. ఇక బాలు రోహిణి నుంచి, శృతి వాళ్ల తల్లిదండ్రుల కుట్ర నుంచి ఎట్టకేలకు తప్పించుకుంటాడు. తన మౌనంతో ఎలాంటి గొడవకు ఆస్కారం లేకుండా చేస్తాడు. అందరి సంగతి తర్వాత చెబుతానని అనుకుంటాడు. అంతేకానీ ఫంక్షన్ లో మాత్రం తన వల్ల ఎలాంటి గొడవ రావొద్దని మాత్రం నిర్ణయించుకుంటాడు. ఫంక్షన్ మొత్తం అలాగే ఉంటాడు.
అనుకున్నట్టుగా బాలు మౌనంగా ఉండటంతో ఫంక్షన్ లో ఎలాంటి గొడవ జరగదు. దాంతో శృతి వాళ్ల అమ్మనాన్న మరో ప్లాన్ కు సిద్ధం అవుతారు. ఈలోగా ఊహించని విధంగా మీనా వైపు కథ మళ్లుతుంది. ఫంక్షన్ మొత్తం సాఫీగా జరగడంతో రవి, శృతి ఎంతగానో సంతోషిస్తారు. ఇక ఫంక్షన్ లో ఏర్పాటు చేసిన ఫుడ్ కాకుండా వాళ్లిద్దరు కలిసి బయటికి వెళ్లి తినేసి వద్దామని అనుకుంటారు. దాంతో శృతి తన మెడలోని పూలదండను తీసి తన బెడ్ రూమ్ లో పెట్టేసి వెళ్తుంది. ఆ పూల దండకు శృతి చైన్ ఉంటుంది. అనుకోకుండా శృతి గదిలోకి వెళ్లిన మీనా పూలదండకు ఉన్న చైన్ ను చూస్తుంది. ఎవరైనా తీసుకుంటాని తానే తీసి దాచి తిరిగి ఇద్దామని అనుకుంటుంది. దీంతో పూల దండకు ఉన్న చైన్ ను తీస్తూ ఉంటుంది. అదే సమయంలో శృతి గదిలోకి ఆమె తండ్రి సురేంద్ర వస్తాడు. పూలదండలో ఇరుక్కుపోయిన చైన్ ను మీనా తీస్తుండటాన్ని గమనిస్తాడు.
అప్పటికే ఎలాగైనా గొడవ చేయాలని చూస్తున్న అతనికి మీనా వల్ల అవకాశం దక్కింది. ఇక వెంటనే మీనాను ఏం చేస్తున్నావని అడుగుతాడు. పూలదండలో చైన్ ఇరుక్కుపోయిందని, తీస్తున్నానని చెబుతుంది. దాంతో సురేంద్ర చైన్ దొంగలిస్తుందే గాక ఎదురు సమాధానం చెబుతున్నావా? అని అంటాడు. అదే సమయంలో శృతి తల్లి శోభను పిలిచి మీనా దొంగతనం చేస్తోందని చెబుతాడు. ఇక మీనా నేను దొంగతనం చేసే ప్రయత్నం చేయలేదని, శృతి మర్చిపోయిన చైన్ ను తీసి తిరిగి ఇద్దామని అనుకున్నానని చెబుతుంది. కానీ ఆ విషయాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోరు. శోభ, సురేంద్ర ప్రభావతిని పిలిచి మీ కోడలు దొంగతనం చేస్తోందని నింద వేస్తుంది. ఇక ప్రభావతి మీనా అలాంటిది కాదని చెప్పే ప్రయత్నం చేసినా కూడా సురేంద్ర, శోభా వినిపించుకోరు. మీనా చాలా బాధపడుతుంది. వెంటనే వెళ్లి బాలుతో జరిగిన విషయాన్ని చెబుతుంది.
ఇక మీనా ఏడుస్తూ కనిపించడంతో బాలు చిర్రెత్తిపోతాడు. తన భార్యపై దొంగతనం నిందారోపణ చేస్తారా అని మండిపడుతాడు. మరోవైపు సత్యం కూడా శోభ, సత్యంల ఆరోపణలను ఖండిస్తాడు. మీనా మంచి అమ్మాయని, తనకున్న బంగారాన్నే ఇంట్లో పెట్టేసిందని, తనకు అలాంటి బుద్ధి లేదని చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ శృతి వాళ్ల నాన్న సురేంద్ర సత్యంపై మాటలు జారుతూనే ఉంటాడు. అంతే కాకుండా మీనాను కూడా దొంగ దొంగ అంటూ అవమానిస్తారు. దొంగతనం చేసే బదులు ఎక్కడైనా పడి చచ్చిపోవచ్చు కదా అని దారుణమైన మాటలు మాట్లాడుతారు. అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న బాలు శృతి వాళ్ల నాన్న సురేంద్ర చెంప పగలగొడుతాడు. కాలర్ పట్టుకొని లాగుతాడు. ఇదే సమయంలో శృతి ఎంట్రీ ఇస్తుంది. అసలేం జరిగిందో తెలుసుకోకుండా బాలుపై మండిపడుతుంది. మీనా గురించి తెలుసుకున్న తర్వాత కూడా బాలుపైనే ఫైర్ అవుతుంది. ఇంత గొడవ తర్వాత శృతి, రవిలు ఎవరి ఇంటికి వెళ్లారనేది రాబోయే ఎపిసోడ్స్ పై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











