Gunde Ninda Gudi Gantalu July 12th: రోహిణినికి ప్రభావతి ఫైనల్ వార్నింగ్.. బాలునూ ముప్పుతిప్పలు పెడుతూ
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూలై 12వ తేదీ 464వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. శృతికి తాళి మార్చే ఫంక్షన్ లో మీనాను ఆమె తల్లి దండ్రులు అవమానించిన సంగతి తెలిసిందే. అదే ఫంక్షన్ లో రోహిణి వాళ్ల నాన్న మలేషియా నుంచి వస్తారని చెప్పడంతో ప్రభావతి, సత్యం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు బాలును వాడుకొని ఫంక్షన్ లో పెద్ద గొడవ చేయాలని అటు రోహిణి, ఇటు శృతి వాళ్ల తల్లిదండ్రులు శోభ, సురేంద్ర కాపు కాచుకుని కూర్చొంటారు. ఇద్దరూ బాలును టార్గెట్ చేసినా కూడా బాలు మాత్రం సైలెంట్ గా ఉంటారు. రోహిణి, శృతి వాళ్ల తల్లిదండ్రులు చేసే ఎలాంటి రెచ్చగొట్టే పనులకు ప్రతిస్పందించడు. మౌనంగా ఉంటాడు. కానీ అనుకోకుండా చివర్లో బాలునే సహనం కోల్పోయి గొడవకు కారణం అవుతాడు.
శృతి చైన్ దొంగలించిందని కావాలనే శృతి వాళ్ల నాన్న సురేంద్ర మీనాపై నింద వేస్తాడు. అంతే కాదు అతని భార్య శోభకు కూడా చెప్పి మీనాను దారుణంగా దూషిస్తారు. మంచి మనస్సు ఉన్న మీనా వారి కఠినమైన మాటలకు తట్టుకోలేకపోతుంది. అయినా వాళ్లు వదిలి పెట్టకుండా మీనాను బంధువులు, ఇరు కుటుంబ సభ్యుల ముందు దొంగాదొంగ అంటూ నిందిస్తారు. ఇక ఆ విషయంలో బాలు తట్టుకోలేకపోతాడు. మీనాకు సపోర్ట్ చేస్తూ అందరి మాటలను ఖండిస్తూ వస్తాడు. మరోవైపు బాలు తండ్రి సత్యం కూడా మీనాకు మద్దతుగా నిలుస్తాడు. తన ఇంటి కోడలను అనరాని మాటలు అంటే ఏమాత్రం సహించేది లేదని అంటాడు. అయినా శృతి వాళ్ల నాన్న మాటలు జారుతూనే ఉంటాడు. దీంతో తట్టుకోలేని బాలు శృతి వాళ్ల నాన్న సురేంద్ర చెంపలు వాయిస్తాడు. దాంతో బాలుపై ప్రభావతి రగిలిపోతుంది. శృతి వాళ్ల అమ్మగారి ఇంటికి వెళ్తుంది. దాంతో రవి కూడా శృతి కోసం ఇంటి నుంచి బయటికి వెళ్లిపోతాడు. మరోవైపు ప్రభావతి రోహిణిని తన తండ్రి విషయంలో, బాలును రవి - శృతి నీవల్లే ఇంట్లో నుంచి వెళ్లిపోయారని నానా మాటలు అంటూ ఇబ్బంది పెడుతూ వస్తుంది. ఈ క్రమంలో వారికి పలు కండీషన్లు పెడుతుంది. ఇక ఈ క్రమంలో నెక్ట్స్ ఎపిసోడ్ జూలై 12న తేదీ 465లో ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది..?

శృతి-రవి ఇంట్లో లేకపోవడానికి కారణం బాలునే అని ప్రభావతి నిందిస్తుంది. తన కొడుకు కోడలు లేని ఇంట్లో బాలు ఉండటానికి ఏమాత్రం అనుమతించనని అంటుంది. దాంతో బాలు మీనా తమ సామాన్లు పట్టుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి సిద్దమవుతారు. దీంతో సత్యం వారిని అడ్డుకుంటాడు. వాళ్లతో పాటే నేను కూడా వెళ్లిపోతానని చెప్పడంతో ప్రభావతి కంగారు పడుతుంది. అలా కుదరదని చెబుతోంది. అయితే వాళ్లు కూడా ఇంట్లోనే ఉంటారని సత్యం సపోర్ట్ చేస్తాడు. దాంతో ప్రభావతి బాలు, మీనాను ఇంట్లో ఉండటానికి ఒప్పుకుంటుంది. కానీ ప్రతి విషయంలో బాలును, మీనాను తిడుతూనే ఉంటుంది. మీ వల్లే నా కోడలు శృతి, కొడుకు రవి ఇంట్లో నుంచి వెళ్లిపోయారని నిందలు వేస్తుంది. సమయం దొరికినప్పుడల్లా మాటల తూటాలు పేల్చుతుంది. అప్పటికే ఫంక్షన్ కు బాలును తీసుకు రావొద్దని చెబితే వినలేదు అంటూ సత్యంను కూడా తిడుతుంది.
అంతే కాదు రవిని ఇంటికి తీసుకు రావాల్సిన బాధ్యత నీదే అని బాలుకు కండీషన్ పెడుతుంది. శృతి వాళ్ల నాన్నను కొట్టింది నువ్వే కాబట్టి. నువ్వే వెళ్లి వాళ్ల నాన్న సురేంద్ర కాళ్లు పట్టుకొని మరీ క్షమాపణలు చెప్పైనా సరే రవి, శృతిలను ఇంటికి తిరిగి తీసుకురావాలని సూచిస్తుంది. ఫంక్షన్ లో జరిగిన గొడవలో తనది ఏమాత్రం తప్పు లేదని అందుకని నేను ఆ పెద్దాయన కాళ్ల మీద పడే సమస్యే లేదని బాలు సూటిగా బదులిస్తాడు. దీంతో ప్రభావతి బాలుపై మరింత కోపం పెంచుకుంటుంది. ఇక కనీసం రవికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని అడిగినా కూడా తన మాట వినడం లేదని బాధపడుతూ ఉంటుంది. మరోవైపు శృతి ప్రభావతి మొహం మీదనే తిరిగి రానని చెబుతుంది. మా నాన్నను కొట్టిన బాలు ఇంట్లో ఉంటే ఎలా వస్తానని అంటుంది. ఇక నన్ను చూడాలంటే వీడియో కాల్ చేయమని అంటుంది. దాంతో ప్రభావతి షాక్ అవుతుంది. అత్త అనే గౌరవం లేకుండా ఎంత సూటింగా మాట్లాడుతుందోనని మనస్సులో అనుకుంటుంది.
మరోవైపు శృతి - రవి ఇంటికి రాకపోవడంతో కాస్తా ఊపిరి పీల్చుకుంటుంది. తన ప్లాన్ ప్రకారం కాకపోయినా బాలు వల్ల ఇంకా పెద్ద గొడవనే జరిగిందని, దాంతో తన అత్త ప్రభావతి గురి తనపై నుంచి తప్పించుకుందని అనుకుంటుంది. ఇక తనను తన తండ్రి మలేషియా నుంచి ఎప్పుడు వస్తాడని అడగబోరని ఊహిస్తుంది. కానీ ప్రభావతి మాత్రం అస్సలు మర్చిపోదు. ఇప్పటికే డైనింగ్ టేబుల్ దగ్గరగా టిఫిన్ చేసే సమయంలోనే మీ నాన్న ఇంకెప్పుడు వస్తాడని ప్రశ్నిస్తుంది. కానీ రోహిణి వాంతీ చేసుకొని ప్రెగ్నెంట్ అనే నాటకంతో అప్పటి వరకు తప్పించుకుంటుంది. ఇక ప్రభావతి రోహిణి తల్లి కాబోతుందేమో అనుకొని సంతోష పడుతుంది. ఆ ఆనందంలో మలేషియా తండ్రి గురించి అడగటం మానేస్తుంది.
కానీ ప్రెగ్నెన్సీ లేదని తెలిసిన తర్వాత మళ్లీ రోహిణిని తన తండ్రి గురించి అడటం ప్రారంభిస్తుంది. ఈసారి మీ నాన్న కచ్చితంగా రావాల్సిందేనని అంటుంది. లేదంటే నా నిజ స్వరూపం చూస్తావని హెచ్చరిస్తుంది. అంతే కాదు మనోజ్ కూడా మలేషియా నుంచి మీ నాన్న రాకపోతే మాత్రం మా అమ్మ ప్రభావతి అస్సలు ఊరుకోదని హెచ్చరిస్తాడు. దీంతో రోహిణికి హార్ట్ బీట్ పెరుగుతుంది. ఈలోగా మళ్లీ ప్రభావతి వచ్చి ఫంక్షన్ జరిగి ఒక రోజు గడిచినా మీ నాన్న ఎక్కిన ఫ్లైట్ ఇంకా ఇండియాలో ల్యాండ్ అవ్వలేదా? ఆకాశంలో అలాగే గద్దలాగా తిరుగుతుందా? అని ప్రశ్నిస్తుంది. అసలు మీ నాన్నకు పట్టింపులేదా అని గట్టిగా అడుగుతుంది. ఇక రోహిణికి ఏం చెప్పాలో అర్థం కాదు. మా నాన్న ఇలా ఎందుకు చేస్తున్నారో నిజంగా నాకు అర్థం కావడం లేదని కంగారు పడుతున్నట్టుగా ప్రభావతికి సమాధానం ఇస్తుంది. మరోవైపు బాలు రవిని ఇంటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో తర్వాత ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications










