Gunde Ninda Gudi Gantalu July 18th: శృతికి బుద్ధి చెప్పిన బాలు.. గుడి మెట్లపై అడుకుంటున్న మనోజ్
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూలై 17వ తేదీ 468వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రోహిణి తన తండ్రి మలేషియాలో ఇరుక్కున్నాడని చెప్పి, పోలీసులు అరెస్ట్ చేశాడని చెప్పి ప్రభావతి నుంచి తప్పించుకుంటుంది. ఇక బాలుకు రోహిణిపై సందేహం వస్తుంది. అసలు రోహిణి చెప్పిందంతా నిజమేనా అని, వాళ్ల మేనమామ నిజమే చెబుతున్నాడా? అని సందేహిస్తూ ఉంటాడు. మరోవైపు రోహిణి విషయంలో తను అనుకున్నది ఏమాత్రం జరగడం లేదని ప్రభావతి పట్టలేని కోపంలో ఉంటుంది. ఇక మీనా వచ్చి కాఫీ ఇవ్వడంతో నేలపై విసిరి కొడుతుంది. దాంతో మీనా ప్రభావతిపై కోపం చేస్తుంది. నేనేం తప్పు చేశానని కాఫీ నేలపాలు చేశారని ప్రశ్నిస్తుంది.
దీంతో మొత్తం నీవల్లనే ఈ ఇంట్లో అశుభం కలుగుతోందని ప్రభావతి మీనాపై అరుస్తుంది. నువ్వు కాలు పెట్టినప్పటి నుంచే ఒక సమస్య తర్వాత మరో సమస్య వస్తుందని నిందిస్తుంది. ఇక నువ్వే కావాలని బాలును రెచ్చగొట్టి శృతి వాళ్ల నాన్నతో గొడవ పడేలా చేశావని అంటుంది. అలా వాగ్వాదం జరుగుతుంది. మరోవైపు రోహిణిని దినేష్ వచ్చి డబ్బులు ఇవ్వమని బ్లాక్ మేయిల్ చేస్తాడు. లక్ష రూపాయలు ఇస్తేనే సరే లేదంటే నీ గుట్టు మొత్తం మీ ఇంట్లో వాళ్లకి చెబుతానని అంటాడు. దాంతో రోహిణి ఇస్తానని అంటుంది. మరోవైపు మనోజ్ కూడా రోహిణిని 14 లక్షలు అడుగుతాడు. నా దగ్గర లేవని ఇంటి పత్రాలు తాకట్టుపెట్టుకోమని రోహిణి సలహానిస్తుంది. ఇక మనోజ్ అదే ఫాలో అవుతాడు. ఈ క్రమంలో ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జూలై 18వ తేదీ 469 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

రోహిణికి ప్రస్తుతానికి తన అత్త ప్రభావతితో గండం తప్పిందనుకుంటే ఓవైపు దినేష్ తో ఆమెకు మళ్లీ టార్చర్ మొదలైంది. ఇప్పటికే చాలా డబ్బులు డిమాండ్ చేసిన దినేష్ రోహిణికి మళ్లీ డబ్బులు కావాలని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితిలో రోహిణి దినేష్ చెప్పిన కండీషన్స్ కు ఒప్పుకుంటుంది. తనకు మళ్లీ డబ్బులు ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తానని, ఇప్పటికైతే నన్ను వదిలేయమని బతిమిలాడుతుంది. త్వరగా డబ్బులు ఇవ్వాలని లేదంటే మళ్లీ తనతో ఇబ్బంది పడాల్సి ఉంటుందని రోహిణిని హెచ్చరిస్తాడు. అలా జరగదని రోహిణి నచ్చ చెబుతుంది. నువ్వు డబ్బులు ఇవ్వకపోతే మాత్రం మీ ఇంట్లో వాళ్ల అందరి ఫోన్ నంబర్లు తన దగ్గర ఉన్నాయని వాళ్లకు నీ గుట్టు మొత్తం చెబుతానని, తర్వాత నీ జీవితం ఏంటో నువ్వే తెలుసుకోమని హెచ్చరిస్తాడు. అందుకు రోహిణి అలా అస్సలు జరగదని కచ్చితంగా లక్ష రూపాయల డబ్బులు ఏర్పాటు చేస్తానని అంటుంది.
మరోవైపు రోహిణికి ప్రభావతి నుంచి టార్చర్ తప్పింది. మలేషియా తండ్రి అరెస్ట్ అయ్యాడని, పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయన ఇప్పట్లో జైలు నుంచి బయటికి వచ్చే అవకాశం లేదని తెలియడంతో ప్రభావతి సైలెంట్ గా ఉంటుంది. ఇక రోహిణి వాళ్ల తండ్రి గురించి అడగటం మానేస్తుంది. దీంతో రోహిణికి కాస్తా ఉపశమనం లభించింది. అలా అనుకునే లోపే ఓవైపు దినేష్ తో గండం వస్తుంది. దాని నుంచి గట్టెక్కే లోపే మరోవైపు మనోజ్ నుంచి మరో సమస్య వస్తుంది. తను కెనడాకు వెళ్తానని చెప్పి, జాబ్ కోసం తనకు 14 లక్షలు ఇవ్వమని అలా ఇబ్బంది పెడుతాడు. దాంతో రోహిణి మనోజ్ కు మరో సలహానిస్తుంది. మీ ఇంటి పత్రాలను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోమని చెబుతుంది. ఎలాగూ మీ అమ్మకు నీపై ప్రేమ ఎక్కువే కాబట్టి నువ్వు అడగగానే ఇస్తుందని అంటుంది. దాంతో మనోజ్ వెళ్లి అడుతాడు.
కానీ ప్రభావతి మాత్రం అస్సలు ఇవ్వనని అంటుంది. ఇప్పటికే నీకు డబ్బులు ఇచ్చి మోసపోయానని చెబుతుంది. ఇంక నిన్ను నమ్మి అస్సలు ఒక్క రూపాయి కూడా ఇవ్వబోనని అంటుంది. దాంతో మనోజ్ ప్రభావతిని బతిమిలాడుతూ ఉంటారు. అయినా కూడా ఇవ్వనని చెబుతుంది. ఇల్లు మొత్తం తాకట్టు పెట్టి ఇక మేమంతా రోడ్డు మీద అడుక్కు తినాలా అని ప్రశ్నిస్తుంది. కెనడాలో జాబ్ సెట్ అయ్యాకా నీకు నేను లక్షల్లో డబ్బులు పంపిస్తూనే ఉంటానని చెప్పి అస్సలు నమ్మబోరు. మాకు నమ్మకం లేదు అని బాలు, సత్యం, ప్రభావతి తిరిగి బదులిస్తారు. ఇక రోహిణి కూడా ఈ ఒక్కసారి నమ్మి డబ్బులు ఇవ్వచ్చు కదా అని అత్త ప్రభావతిని అంటుంది. నీ భర్తపై అంత ప్రేమ ఉంటే.. మీ మలేషియా తండ్రిని అడిగి ఇవ్వమని అంటుంది. అంత లేనప్పుడు సైలెంట్ గా ఉండమని సమాధానం ఇస్తుంది.
ఇక మరోవైపు శృతి డబ్బింగ్ చెప్పడానికి వెళ్లిన సమయంలో గొడవ జరుగుతుంది. డబ్బింగ్ స్టూడియోలో శృతి కంటే ముందే ఓ ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్పి పర్స్ మర్చిపోతుంది. ఇంటికి వెళ్తుంది. ఇక వెంటనే మళ్లి తిరిగి వస్తుంది. వారు బాలు కాబ్ లోనే డబ్బింగ్ స్టూడియో దగ్గరికి వస్తారు. అప్పటికే శృతి డబ్బింగ్ చెప్పి బయటికి వస్తూ ఉంటుంది. లోపలికి వెళ్లి సౌండ్ ఇంజనీర్ ను నా పర్సు మర్చిపోయానని, ఇందాక డబ్బింగ్ చెప్పింది ఎవరని అడుగుతుంది. దాంతో శృతి పేరు చెబుతాడు. వెంటనే శృతి దగ్గరకు వెళ్లి పర్సు ఇవ్వమని అడుగుతారు. నా దగ్గర మీ పర్సు ఎందుకు ఉంటుంది. నేనేమైనా దొంగనా అని అంటుంది. లేదు మా పర్సు నువ్వే తీశామని శృతి బ్యాగ్ ను చెక్ చేసేందుకు ప్రయత్నిస్తారు. అప్పటికే మాటలు విని బయట కారు దగ్గర ఉన్న బాలు లోపలికి వస్తాడు.
దొంగ అంటూ శృతి బ్యాగ్ ను చూడటంతో వాళ్లిద్దరి చెంపను పగలగొడుతుంది. ఇక పర్సు టీ కొట్టువాడు తీసుకున్నాడని బాలు కనిపెడుతాడు. వాళ్లతో శృతికి సారీ చెప్పిస్తాడు. ఆ తర్వాత శృతికి బుద్ధి చెబుతాడు. ఇప్పుడు నీకెలా జరిగిందో ఫంక్షన్ లో మీనాకూ అలానే జరిగిందని, మీ నాన్న నిన్ను రవిని విడదీయాలని చూస్తున్నారని, నీ కాపురాన్ని కాపాడుకునే బాధ్యత నీ చేతుల్లోనే ఉందని చెబుతాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు ప్రోమోలో మనోజ్ గుడి మెట్ల దగ్గర అడ్డుకుంటూ ఉంటాడు. మీనా మనోజ్ ను చూస్తుంది. ఆశ్చర్యపోయి వెంటనే బాలుకు ఫోన్ చేస్తుంది.


Click it and Unblock the Notifications











