Gunde Ninda Gudi Gantalu July 26th: మీనా పూల కొట్టును తొలగించేందుకు కుట్ర.. కన్నీళ్లు పెట్టుకున్న మీనా

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూలై 26వ తేదీ 474వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. శృతి రవి మళ్లీ కలిసి పోతారు. దీంతో మళ్లీ ప్రభావతి, సత్యం ఇంట్లో నవ్వులు పూస్తాయి, సంతోషం విరజిల్లుతుంది. ఎప్పటికీ అందరం ఇలానే ఉండాలని సత్యం అంటాడు. దాంతో శృతి స్పందిస్తూ తప్పకుండా మామయ్య అని అంటుంది. ఫంక్షన్ లో జరిగినవేవీ ఎవ్వరూ తమ మనస్సులో మాత్రం పెట్టుకోవద్దని కోరుతుంది. ఈరోజు నుంచి మళ్లీ కొత్త లైఫ్ ను స్టార్ట్ చేద్దామని అంటుంది. అందుకోసం కేక కూడా తెచ్చానని చెబుతుంది. ఆ కేక్ పై హ్యాపీ ఫ్యామిలీ అని కూడా రాయిస్తుంది. ఇక అందరూ కలిసి కేక్ ను కట్ చేసి భార్య భర్తలుగా తినిపించుకుంటారు. అదే సమయంలో సంజూ మౌనికాను తీసుకొని ఆ ఇంటికి వస్తాడు. అందరూ బాధలో ఉంటారనుకుంటే ఇలా నవ్వుతూ సంతోషంగా ఉన్నారేంటనీ షాక్ అవుతాడు. సత్యం, బాబు, ప్రభావతిని అవమానిద్దామని ఎంతో జోష్ గా వచ్చి సంజూ మొహం వాడిపోతుంది. అప్పటికే మౌనికా నేను రానని ఎంత చెప్పినా వినకుండా తీసుకెళ్లి ఫూల్ అవుతాడు. కానీ మౌనికాకు మాత్రం నిజంగా అది సర్ ప్రైజ్ లానే మారింది.

రవి, శృతి కలిసిపోవడంతో అందరూ సంతోషంగా ఉండటం, అదే సమయానికి మౌనికా కూడా తిరిగి రావడంతో పూర్తి కుటుంబం ఒక్క దగ్గరైపోతుంది. దీంతో సత్యం, ప్రభావతి, బాలు ఆనందానికి అవధులు ఉండవు. ఇక సంజూ కడుపు మాత్రం రగిలి పోతుంది. ఏమాత్రం ఆ ఇంట్లో ఉండాలని అనుకోడు. వెంటనే వెళ్లిపోవాలని అనుకుంటాడు. దీంతో కుటుంబంతో సంతోషంగా ఉన్న మౌనికాను ఇంటికి వెళ్దాం పదా అని అంటాడు. కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా కూడా వినిపించుకోడు. చాలా అర్జెంట్ వర్క్ ఉందని చెప్పి మౌనికాను ఇంట్లో నుంచి తీసుకొని వెళ్లిపోతాడు. ఇక ఇంటికి వెళ్లిన తర్వాత మౌనికాకు టార్చర్ చూపిస్తాడు. మీరు చెప్పినట్టుగానే చేశాను కదా అని బదులిచ్చిన మౌనికా చెంప చెల్లుమనిస్తాడు. ఇకపై నాకు ఇష్టమొచ్చినప్పుడల్లా నిన్ను కొడుతూనే ఉంటానని చెబుతాడు. అది తెలిసి మీ అమ్మనాన్నలు కుమిలి కుమిలి ఎడ్వాలని అంటాడు. ఇంకా నీ నరకాన్ని చూసి మీ నాన్న కూడా చావాలని, అప్పుడు కూడా నువ్వు సంతోషంగానే ఉండాలని అంటాడు. సంజూ మృగంలా ప్రవర్తించడంతో ఏమీ చేయలేని స్థితిలో కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూలై 26వ తేదీ 475 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.?

Gunde Ninda Gudi Gantalu serial Expected episode 475 July 26th

రవి, శృతి తిరిగి ఇంటికి రావడంతో మళ్లీ ఆ ఇంటికి పూర్వ వైభవం వస్తుంది. వాళ్లిద్దరూ ఇంట్లో లేనప్పుడు ఇంట్లో జరిగిన విషయాలను తెలుసుకుంటారు. ముఖ్యంగా మనోజ్ గుడి మొట్ల దగ్గర అడుక్కోవడం తెలుసుకుని షాక్ అవుతారు. రవికి బాలు చెబితే.. శృతికి రోహిణి ముందే మీనా చెబుతుంది. అయితే రోహిణికి శృతి ఇంటికి తిరిగి రావడం అస్సలు నచ్చదు. ఇన్ని రోజులు శృతి ఇంటికి రావడం లేదని, దాంతో రవి కూడా ఇంటికి రాకుండా రెస్టా రెంట్ లో బాధలు పడుతున్నాడే ఆలోచనలో అత్త ప్రభావతి బిజీగా ఉందని రోహిణి అనుకుంటుంది. కానీ శృతి, రవి ఇంటికి తిరిగి రావడంతో ఇక ప్రభావతి గురి తనపై పెడుతుందని భయపడుతుంది. ఇక ఏదోలా మళ్లీ ఏదైనా సమస్యను తెచ్చిపెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంట్లో ఏదోక గొడవ జరిగితే తప్పా తన గురించి ప్రభావతి పట్టించుకోవడం మానది రోహిణి అనుకుంటుంది. మంచి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.

ఇక రాత్రి కావడంతో శృతి రవికి ఫోన్ చేసి పడుకోవడానికి పిలుస్తుంది. మరోవైపు రోహిణి కూడా మనోజ్ ను వెంటనే గదికి రమ్మని అంటుంది. మరోవైపు బాలు కూడా మీనా దగ్గరికి వెళ్లిపోతాడు. చాలా రోజుల తర్వాత కుటుంబం మొత్తం కలిసి పోయి సంతోషంగా ఉందని మీనా, బాలు అనుకుంటారు. శృతి, రవి కూడా ఎంతగానో ఆనందిస్తారు. ఇకపై ఎలాంటి మనస్ఫార్థాలు రాకుండా చూసుకోవాలని అనుకుంటారు. రోహిణి మాత్రం శృతి, రవి తిరిగి ఇంటికి తిరిగి రావడం అస్సలు జీర్ణించుకోదు. పైగా శృతి మీనాకు సపోర్ట్ గా మాట్లాడుతుండటం, మీనా కూడా శృతికి దగ్గర కావడంతో ఇక తన మాటలకు విలువ లేకుండా పోతోందని లోలోపల రగిలిపోతుంది. దానికి తోడు మనోజ్ కు జాబ్ లేక మరీ గుడి మెట్ల మీద అడుక్కునే స్థాయికి దిగజారిపోవడంతో ప్రశాంతతను కోల్పోతుంది. కుటుంబం అంతా కలిసిపోవడంతో ఇప్పుడు టాపిక్ మళ్లీ మనోజ్ పైకే వస్తుందని, దాంతో మళ్లీ తన తండ్రి నుంచి ఎలాంటి సాయం అందనందుకు ప్రభావతి తనపై రగిలిపోతుందని రోహిణి భయపడుతుంది.

ఎలాగైనా అత్త ప్రభావతి గురి తనపై ఉండ కూడదని ఆలోచిస్తుంది. ఇక మీనాను బలి చేయాలని చూస్తుంది. ముఖ్యంగా మీనాకు ఆధారమైన పూల కొట్టును తీయించేయాలని ఆలోచిస్తుంటుంది. అప్పటికే పూల కొట్టు అంటే నచ్చని ప్రభావతి ఎప్పుడు తీయించేద్దామా? అని అనుకుంటూ ఉంటుంది. ఇక నడి ఇంట్లోనే ఏకంగా పూల కొట్టు వ్యాపారం చేయడంతో రగిలిపోతుంది. ఇక శృతి వాళ్ల అమ్మ ఇంటికి వస్తుంది. అదే సమయంలో పూల కోసమని ఓ మహిళ ఏకంగా ఇంట్లోకే వస్తుంది. రెండు మూరల పూలు తీసుకొని వెళ్తుంది. ఇక శృతి వాళ్ల అమ్మ కూడా 200 ఇచ్చి పూలు ఇవ్వమని అడుగుతుంది. దాంతో ఎలాగైనా మీనా పూల కొట్టును లేకుండా చేయాలని నిర్ణయించుకుంటుంది. వెంటనే వెళ్లి రోహిణితో జరిగిన విషయం చెప్పడంతో మున్సిపాలిటీ వాళ్లకు కంప్లైట్ చేస్తే వాళ్లే తీసేస్తారని సలహానిస్తుంది. దాంతో తనకు జరిగిన అవమానాన్ని వెంటనే పూల కొట్టును తొలగించాల్సిందేనని అంటుంది. ఈ క్రమంలో నెక్ట్స్ ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X