Gunde Ninda Gudi Gantalu August 2nd: బాలు చేతిలో మనోజ్ ప్రాణం.. రోహిణి కొత్త ప్లాన్ లో చిక్కులు
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఆగస్టు 1వ తేదీ 479వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలు కొనిచ్చిన స్కూటీని తీసుకునేందుకు మీనా నిరాకరిస్తుంది. ప్రభావతి బయటి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత బాలు చేసిన పనిని చెబుతుంది. అప్పటికే బాలుకు స్కూటీ కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నిస్తూ ఉంటారు. అసలు ఒంటి మీద గాయం ఎందుకు అయ్యిందని, అసలు నువ్వు చేసి డబ్బులు తీసుకొచ్చావని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు. మరోవైపు రోహిణి, మనోజ్ బాలును నిందిస్తూ ఉంటారు. ఇదే సమయంలో ప్రభావతి వచ్చి బాలుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో నేను చెబుతానని అంటుంది. అప్పటికే ప్రభావతి, కామాక్షితో కలిసి బాలు రౌడీలను తరిమి కొట్టడం చూస్తుంది. ఇరుగు పొరుగు బాలు గురించి రౌడీలా మాట్లాడుకోవడం విని మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
ఇంటికి తిరిగి వచ్చాక బాలు బంఢారం బయట పెడుతుంది. బాలు రౌడీయిజం చేసి డబ్బులు సంపాదించాడని చెబుతుంది. పలువరు రౌడీలను కొట్టి తరమడం, అందుకు ఒక పెద్దాయన బాలుకు డబ్బులు ఇవ్వడాన్ని నేను కళ్లార చూశానని చెబుతుంది. ఆ మాటలు విన్నాక సత్యం, మీనా షాక్ అవుతారు. ఇక రోహిణి చెలరేగిపోతుంది. ఇలా మనుషులను కొట్టి సంపాదించే బదులు అడుక్కు తినడం మంచిదని అంటుంది. మరోవైపు మనోజ్ రౌడీలా మారే బదులు పార్క్ లో పల్లీలు తింటూ కూర్చోవడం ఉత్తమమని బాలును నిందిస్తూ ఉంటారు. ఇక సత్యం కూడా బాలును ప్రభావతి చెప్పింది నిజమేనా అని ప్రశ్నిస్తాడు. అందుకు బాలు మౌనంగా ఉంటాడు. గట్టిగా అడగడంతో అవునని సమాధానం ఇస్తాడు. నేను ఆ రౌడీలను తరిమి కొట్టాను కానీ డబ్బుల కోసం చేయలేదని చెబుతాడు. కానీ ఎవరూ బాలు మాటను పట్టించుకోరు. పైగా బాలును ఇష్ట మొచ్చి నట్టుగా నిందిస్తారు. నానా మాటలు అంటారు. అదే సమయంలో ఆ పెద్దాయన వీళ్ల ఇంటికి వస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఆగస్టు 2వ తేదీ 480 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

బాలును ఇంట్లో వాళ్లందరూ నిందిస్తూ ఉంటారు. బాలు వాళ్లకి బదులిచ్చే ప్రయత్నం చేస్తాడు. నేను రౌడీలను తరిమి కొట్టింది నిజమే కానీ, ఆ పనిని నేను డబ్బుల కోసం చేయలేదని చెబుతాడు. ఆ పెద్దాయన కూతురు పెళ్లికి సాయం చేసేందుకు వాళ్లను ఎదిరించానని చెబుతాడు.అయినా ఇంట్లో వాళ్లు ఎవరు నమ్మబోరు. ఇక సత్యం, మీనా కూడా బాలు చేసిన పనికి ఆగ్రహంగా ఉంటారు. ఇక ఇదే సమయంలో బాలుకు సపోర్ట్ ఇస్తూ ఆ పెద్దాయన ఇంటికి వస్తాడు. బాలు చేసిన పని వల్ల నా కూతురు పెళ్లి సవ్యంగా చేసుకుంటున్నానని చెబుతాడు. నా కూతురు పెళ్లి కోసమని ఆ ఇంటిని అమ్మాలని అనుకున్నానని, కానీ రౌడీలు కబ్జా చేసి ఖాళీ చేయమంటే తిరిగి బెదిరించారని చెబుతాడు. అదే సమయంలో బాలు వచ్చి సాయం చేశాడని వివరిస్తాడు. ఇలాంటి కొడుకు ఉన్నందుకు మీరు అదృష్ట వంతులని పొగుడుతాడు. ఇక అంత పెద్ద సాయం చేసి కూడా బాలు డబ్బులు తీసుకోవడానికి నిరాకరించారు. కానీ నేనే బలవంతంగా ఇచ్చానని, తన చెల్లి పెళ్లికి బట్టల కోసమని చెప్పి ఇచ్చానని అంటాడు.
ఇక నా కూతురు పెళ్లికి ఫస్ట్ పెళ్లి కార్డును మీకే తీసుకొని వచ్చి ఇస్తున్నానని చెబుతాడు. ఆ పెళ్లి పత్రికను మొదటగా బాలుకు ఇవ్వబోతాడు. కానీ బాలు తన తల్లిదండ్రులకు ఇవ్వమని చెబుతాడు. ఆ పెద్దాయన సత్యం, ప్రభావతికి పెళ్లి పత్రిక ఇచ్చి వెళ్లిపోతాడు. ఇక అసలు విషయం తెలిసిన తర్వాత సత్యం ఇంట్లో వాళ్లందరిపైనా ఫైర్ అవుతాడు. బాలు ఏ పని చేసినా దాని వెనకాల అర్థం ఉంటుందని అంటాడు. ఇంకోసారి బాలుపై తప్పుగా మాట్లాడే ముందు అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం చేయమని అంటాడు. దాంతో అందరూ మౌనంగా ఉంటారు. కానీ మీనా మాత్రం బాలుపై ఫైర్ అవుతుంది. మీరు రక్తం చిందించి కొనిచ్చిన స్కూటీ నాకు ఏమాత్రం వద్దని అంటుంది. దాంతో బాలు కూడా నువ్వు కొనిచ్చిన కారును నేను కూడా తీసుకోనని మొండికేస్తాడు. కానీ ఉదయం మీనా స్కూటీని అలరించి, తన మొబైల్ పూల కొట్టును ప్రారంభిస్తుంది. ఇకపై గొడవలకు పోను అంటేనే స్కూటీని తీసుకుంటానని చెబుతుంది. బాలు కూడా హామీనిస్తాడు.
గొడవలకు వెళ్లడం మానేయాలని, ఇక ఎవ్వరికైనా సాయం చేసే ముందు కాస్తా మంచి చెడు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని తండ్రి సత్యం బాలుకు వివరిస్తాడు. మరోవైపు మనోజ్ కెనడా వెళ్లలేకపోతున్నందుకు బాధపడుతూ ఉంటాడు. రోహిణిని సాయం చేయమంటే చేయడం లేదని మాట్లాడుతాడు. దీంతో రోహిణికి ఒక ఆలోచన వస్తుంది. మనోజ్ 40 లక్షలు ఇచ్చిన అమ్మాయి ఆచూకీ కనిపెట్టి ఆ డబ్బులు తిరిగి లాక్కుందని సలాహానిస్తుంది. ఇక వెంటనే వాళ్లిద్దరూ ఆమె కల్పికా అడ్రెస్ ను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆమె కెనడాలో ఎక్కడ ఉంటుందో వివరాలు సేకరిస్తారు. కానీ ఆమె ఇండియాలోనే తిరుగుతూ ఉంటుంది. ఇక పోయి పోయి మనోజ్ నే వెతుక్కుంటూ వస్తుంది. అది కూడా బాలు క్యాబ్ లోనే వస్తూ ఉంటుంది. మరోవైపు ఆమె కోసం మనోజ్ వెతుకుతూ ఉంటాడు. ఈ క్రమంలో బాలు ద్వారా మనోజ్ కు కల్పికా ఆచూకీ లభ్యమయ్యే అవకాశం ఉంది. ఆమె దగ్గరకు వెళ్లి మనోజ్ డబ్బుల వ్యవహారం తేల్చమని అడిగే అవకాశం ఉంది. మరోవైపు కల్పికా విదేశాల నుంచి మళ్లీ ఎందుకు తిరిగి వచ్చింది, ఆమె ఇక్కడ ఏం చేయబోతుందనేది మరింత ఆసక్తికరంగా మారింది. అసలు మనోజ్ కు కల్పికా కలుస్తుందా లేదా అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. కానీ నెక్ట్స్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











