Gunde Ninda Gudi Gantalu August 9th: మీనా, బాలుపై నిందారోపణ.. రెచ్చిపోయిన ప్రభావతి, రోహిణి, మనోజ్
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఆగస్టు 8వ తేదీ 484వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రోహిణి పార్లర్ కు కల్పనా వస్తుంది. కల్పనాను చూసిన వెంటనే రోహిణి షాక్ అవుతుంది. ఇక మనోజ్ కు ఫోన్ చేయడంతో వెంటనే తిరిగి వస్తాడు. ఇక కల్పనాను నిలదీస్తూ ఉంటాడు. అసలు నిన్ను ఎంతగానో నమ్మితే నువ్వు చేసే పని ఇదా అంటూ ఫైర్ అవుతాడు. అందులో నా తప్పేం లేదని కల్పనా తిరిగి బదులు ఇస్తుంది. మోసపోవడం నీ తప్పే అవుతుంది. అందుకు నేనేం చేయలేను కదా. అలాగే నాతో నువ్వు 6 నెలలు కాపురం చేశావు, నేను నీ దగ్గర డబ్బులు తీసుకున్నాను.. దానికి దీనికి సరితూగింది చెల్లుకు చెల్లు అని అంటుంది. దాంతో మనోజ్ ఇంకా ఫైర్ అవుతాడు.
అసలు నువ్వు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావని ఫైర్ అవుతాడు. వెంటనే కోపంతో బాలు కల్పనా మెడ పట్టుకుంటాడు. నన్ను మోసం చేసిందే గాకా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతావా? అని ఫైర్ అవుతాడు. ఇక నాకు వెంటనే నా డబ్బులు ఇవ్వాలని లేదంటే నేను అస్సలు ఊరుకోనని మనోజ్ ఫైర్ అవుతాడు. నా దగ్గర డబ్బులు లేవని, నేను కెనడాకు వెళ్లాలని నన్ను వదిలేయండి అని కల్పనా అంటుంది. కానీ రోహిణి మాత్రం కల్పనాను గట్టిగా పట్టుకుంటుంది. పోలీసులకు ఫోన్ చేయమని అంటుంది. అప్పటికే చెప్పానని మనోజ్ అంటాడు. ఇక కల్పనాను గదిలోనే బంధించి పోలీసులు రాగానే అప్పగిస్తారు. మనోజ్, రోహిణి నన్ను ఈ గదిలో బంధించారని పోలీసులకు కల్పనా చెబుతుంది. కానీ అప్పటికే కల్పనాపై కేసు నమోదై ఉండటంతో కల్పనా మాటలు నమ్మరు. ఇక పోలీసులు వారిని స్టేషన్ కు తీసుకొని వెళ్తారు. ఇక అక్కడ ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఆగస్టు 9వ తేదీ 485 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

పోలీసులు కల్పనాను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తారు. మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కల్పనాను అదుపులోకి తీసుకుంటారు. ఇక కల్పనాతో పాటు కేసు పెట్టిన మనోజ్ ను, రోహిణిని కూడా స్టేషన్ కు తీసుకొని వెళ్తారు. స్టేషన్ లోపలికి వెళ్లిన తర్వాత ఎస్సై విచారణ జరిపిస్తారు. అసలు ఏం జరిగిందని మనోజ్ ను అడుగుతారు. అందుకు మనోజ్ ఈ అమ్మాయిని నేను ఎంతో గాఢంగా ప్రేమించానని, కానీ నన్ను మోసం చేసిందని 40 లక్షల రూపాయలు కూడా ఎత్తుకొని వెళ్లిందని కల్పనాపై ఫిర్యాదు చేస్తాడు. కానీ కల్పనా మాత్రం నాకు ఇతని ఎలాంటి సంబంధం లేదని చెబుతుంది. మనోజే తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని అంటుంది. మరో పెళ్లి కూడా చేసుకున్నాడని మీ ముందే సాక్ష్యం ఉందని అంటుంది. దాంతో మనోజ్ రోహిణి షాక్ అవుతారు. ఇక కల్పనా చెప్పింది అబద్ధమని అంటారు. దీంతో ఎస్సై స్పందిస్తూ కల్పనా నీ దగ్గర డబ్బులు కొట్టేసింది అనడానికి ఏదైనా ఆధారం ఉందా? అని ప్రశ్నిస్తాడు. దాంతో మనోజ్ ఉందని బదులిస్తాడు. కల్పనాతో నాకు ఒక జాయింట్ అకౌంట్ ఉందని, అందులోంచి ఆమె డబ్బులు తీసుకుందని ఆధారంగా చూపిస్తాడు.
సరైనా ఆధారం లభించడంతో కల్పనాను వెంటనే మనోజ్ కు డబ్బులు కట్టమని అంటారు. లేదంటే నీపైన కేసు నమోదు చేసి కోర్టుకు తీసుకెళ్లాల్సి వస్తుందని హెచ్చరిస్తారు. దాంతో బయపడి పోయిన కల్పనా ఇప్పటికిప్పుడు 40 లక్షలు అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలని అంటుంది. నాకు కాస్తా సమయం కావాలని అడుగుతుంది. నేను కెనడా వెళ్లాక ఎలాగైనా అడ్జస్ట్ చేస్తానని అంటుంది. అలాగైతే మరో దారి ఉందని పోలీసులు చెబుతారు. ఇండియాలో నీకు తెలిసిన వారు కానీ, బంధువులు కానీ ఉంటే వారితో సాక్షి సంతకం చేయించి నువ్వు వెళ్లిపోవచ్చని అంటారు పోలీసులు. దాంతో కల్పనా సరేనని అంటుంది. ఇక సాక్షి సంతకం చేయించేందుకు పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్స్ తో పాటుగా బయటికి వస్తూ ఉంటుంది. ఇదే సమయంలో కల్పనా బాలుకు ఎదురవుతుంది. మేడమ్ మీరు ఇక్కడ ఏంటని అంటుంది. దీంతో తను కొందరి డబ్బులు ఇవ్వాలని, ఇండియా రావడంతో నన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెబుతుంది. కానీ ఇప్పుడు వీళ్లు నన్ను వదిలేయాలంటే మాత్రం సాక్షి సంతకం పెట్టాల్సి ఉందని చెబుతుంది.
బాలును సాక్షిగా సంతకం పెట్టమని అడుగుతుంది. దాంతో బాలు అసలు మీరు వాళ్లకు ఎందుకు డబ్బులు ఇవ్వాలని అడుగుతాడు. దానికి కల్పనా అదొక పెద్ద కథ నీకు ఎలాంటి సమస్య ఉండదు. నా ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయ్యాక అమ్మేసి వాళ్లకు డబ్బులు ఇచ్చేస్తాను. ఆ తర్వాత నీకు ఎలాంటి సమస్య రాదని చెబుతుంది. మరోవైపు రోడ్డు సైడ్ పార్క్ చేసిన మీనా స్కూటీని పోలీసులు తీసుకు రావడంతో, బాలు ఆ స్కూటీని తీసుకొని వెళ్లడానికి వస్తాడు. అది ముందే గమనించిన కానిస్టేబుల్స్ లో సాక్షి సంతకం పెడితే వెంటనే స్కూటీని ఇస్తామని అంటారు. ఏదేమైనా ఒకసారి నేను పూర్తిగా సమస్య ఏంటో తెలుసుకున్నాకే సంతకం పెడుతానని అంటాడు. కానీ కల్పనా, కానిస్టేబుల్స్ కలిసి బాలుతో సంతకం చేయడానికి ఒప్పుకుంటాడు.
అయితే రోహిణి, మనోజ్ లకు మీనా, బాలు పోలీస్ స్టేషన్ లో చూడకపోవడంతో బాలు ఇరుక్కుపోయే పరిస్థితి నెలకొంది. మీనాతో పాటే రోహిణి, మనోజ్, కల్పనా అందరూ పోలీస్ స్టేషన్ కు వస్తారు. కానీ గమనించకపోవడంతో కల్పనా దగ్గర బాలు సాక్షి సంతకం ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇక బాలు సాక్షి సంతకం పెట్టే సమయంలోనైనా మనోజ్, రోహిణి వచ్చి అడ్డుకుంటారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు మనోజ్, రోహిణి ఎంతగానో కల్పనాను పట్టుకోవాలని ప్రయత్నించి స్టేషన్ వరకు వస్తే ఈజీగా తప్పించుకునేందుకు బాలు కారణం అవుతుండటంతో ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.


Click it and Unblock the Notifications










