Gunde Ninda Gudi Gantalu October 11th Episode: భారతనాట్యం గురువుగా మారిన ప్రభావతి.. తొలి శిష్యురాలెవరో తెలుసా?
Courtesy: jiohotstar
Gunde Ninda Gudi Gantalu: ప్రముఖ మా టీవీ సీరియల్ గుండె నిండా గుడిగంటలులో మరోసారి ఉత్కంఠభరితమైన ఎపిసోడ్ ప్రసారం అయింది. శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో ప్రభావతి తన డ్యాన్స్ స్కూల్ కోసం ఇళ్లు అద్దెకు ఇవ్వమని మీనాక్షిని అడుగుతుంది. మొదట అంగీకరించకపోయినా, ఇంట్లో పనిపాట లేకుండా ఖాళీగా కూర్చోవడంకంటే డాన్స్ స్కూల్ పెట్టుకోవడం మంచిదని భావించి తన ఇంటిని ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. మరుసటి రోజు అందరినీ ఇంటికి త్వరగా రమ్మని పిలుస్తుంది ప్రభావతి. మొదట సత్యం వచ్చి "ఎందుకమ్మా ఇంత అర్జెంటుగా పిలిచావు?" అని అడుగుతాడు. మీనా చిరునవ్వుతో "అత్తయ్య కొత్త అవతారంలో కనిపించబోతున్నారు" అంటుంది. "ఏంటి పాత పెళ్లాన్ని కొత్తగా చూస్తానా?" అంటూ సత్యం వెటకారంగా ప్రశ్నిస్తాడు. అప్పుడు మీనా "అత్తయ్య భరతనాట్యం స్కూల్ ప్రారంభించబోతున్నారు" అని చెప్పేసింది. ఆ వార్త విని సత్యం షాక్ అవుతాడు. "ఇంత వయసులో ఇలాంటి పనులు?" అని అయోమయంగా అడుగుతాడు. ఇంతలో బాలు, రవి, శృతి కూడా చేరుకుంటారు. సత్యం భూతం వస్తుందన్నట్లుగా జోక్ వేస్తూ "భూతం కాదు, మీ అమ్మ వస్తున్నారు" అంటాడు.
ఇంతలోనే గజ్జల శబ్దంతో ప్రభావతి భరతనాట్యం డ్రెస్‌లో కిందికి వస్తున్నది. ఆమె రూపం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. "ఇది నా అసలు స్వరూపం, నాట్యం నా ప్రాణం" అంటూ ప్రభావతి డైలాగ్ విసురుతుంది. శృతి "మీరు జగదేకవీరుడు సినిమాలో శ్రీదేవిలా ఉన్నారు" అని పొగడడంతో ప్రభావతి మరింత రెచ్చిపోతుంది. "పెళ్లి పేరుతో నా కళను తొక్కేశారు" అంటూ సత్యంపై విరుచుకుపడుతుంది. తర్వాతి రోజు ప్రభావతి డాన్స్ స్కూల్ ప్రారంభోత్సవం జరుగుతుంది. శృతి తల్లిని ముఖ్య అతిథిగా పిలవాలని అనుకున్నా కుదరదు. దీంతో సత్యం అసహనం వ్యక్తం చేస్తాడు. అయినా శృతితో దీపం వెలిగింపజేస్తుంది, తర్వాత రోహిణిని పిలుస్తుంది. ఆపై మీనా గురించి వెటకారంగా మాట్లాడడంతో బాలు ఆగ్రహంతో "నా భార్యను అందరి ముందు అవమానించావు" అంటూ ఆవేశానికి లోనవుతాడు. మీనాను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సత్యం అడ్డుకుని "రిబ్బన్ కటింగ్ మీనా చేతులతో జరగాలి" అని అంటాడు. కానీ ప్రభావతి మాత్రం గట్టిగా "అవసరం లేదు" అంటూ నిరాకరిస్తుంది. ఇలా ప్రభావతి మరోసారి మీనాను అందరి ముందూ అవమానిస్తుంది.

ప్రభావతి ఎన్నో ఆశలు పెట్టుకుని 'ప్రభావతి క్లాసికల్ డ్యాన్స్ స్కూల్'అనే పేరుతో డాన్స్ స్కూల్ ప్రారంభించింది. తన ప్రతిభతో, కృషితో ఆ స్కూల్ ద్వారా లక్షలు సంపాదించాలని కలలు కంటోంది. కానీ మొదటి రోజే క్లాస్‌రూం నిశ్శబ్దంగా కనిపించింది. ఒక్క విద్యార్థి కూడా రాకపోవడంతో ఆమె నిరాశగా క్లాస్ రూంలో దోమలు ఈగలు కొట్టుకుంటూ తిరుగుతుంది. ఈ విషయాన్ని గమనించిన మీనాక్షి వెటకారంగా, "ఇప్పటివరకు ఒక్కరు కూడా జాయిన్ కాలేదా?" అని అడుగుతుంది. దాంతో ప్రభావతి "ఇప్పుడే కదా స్కూల్ పెట్టింది... టైమ్ పడుతుంది, వెయిట్ చేయాలి" అంటూ సమాధానమిస్తోంది.
ఇంతలోనే కాలింగ్ బెల్ మోగడంతో ప్రభావతిలో కొత్త ఆశ చిరుగురిస్తోంది. 'ఎవరో అడ్మిషన్ కోసం వచ్చారేమో' అని ఉత్సాహంగా తలుపు తెరుస్తుంది. కానీ తలుపు వద్ద మీనా, బాలు పూలు, పండ్లు పట్టుకుని నిలబడి ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. "వీళ్లు నన్ను ఎగతాళి చేయడానికి వచ్చారేమో!" అని ప్రభావతి అంటుంది. దీంతో లేదు అత్తయ్య మేము నిజంగానే నాట్యం నేర్చుకోవడానికి వచ్చామని అంటుంది మీనా. దాంతో ప్రభావతి వ్యంగ్యంగా, 'నాట్యం అంటే గజ్జి కట్టి తడితక్కలు వేయడం కాదు!'అంటుంది.
మీనా వెంటనే "అయితే నేర్పించి చూడండి" అంటూ సవాల్ విసురుతుంది. 'నాతో సమానంగా చేయగలవా?'అని ప్రభావతి అడగగా, మీనా "చెయ్యగలను గురువుగారు" అని ధైర్యంగా బదులిస్తుంది. బాలు కూడా "కాదనకండి గురువుగారు" అంటూ బతిమిలాడతాడు. చివరికి ప్రభావతి కొంచెం గర్వంగా, కొంచెం ఆసక్తిగా ఒప్పుకుంటుంది. మీనాకు భరతనాట్యం నేర్పించడం మొదలుపెడుతుంది. ఈ విధంగా ప్రభావతి తన డ్యాన్స్ స్కూల్‌లో మొదటి శిష్యురాలిగా మీనాను స్వీకరిస్తుంది. కొత్త గురువు-శిష్యుల బంధం సీరియల్‌లో ఎలాంటి మలుపుకు దారితీస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











