Gunde Ninda Gudi Gantalu November 8th Episode: షీలా డార్లింగ్ మనసు గెలిచిందెవరు? రిటర్న్ గిఫ్ట్ ఎవరికి?

Courtesy: jiohotstar

Gundeninda Gudigantalu: గుండెనిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్‌లో సుశీలమ్మ 75వ పుట్టినరోజు వేడుకలతో ఇల్లు ఆనందంతో నిండిపోతుంది. కుటుంబ సభ్యులందరూ ఘనంగా వేడుకలు జరపడంతో సుశీలమ్మ సంతోషంగా "ఇంత ప్రేమగా చూసుకున్నందుకు అందరికీ థాంక్స్" అంటుంది. శృతి చిలిపిగా "బామ్మ మీ అందానికి రహస్యం ఏమిటి?" అని అడగగా, సుశీలమ్మ నవ్వుతూ "సంతోషంగా ఉండడం, నా పనులు నేనే చేసుకోవడం" అంటుంది. ఇదే సమయంలో బాలు "మా మీనా ఎప్పటికీ ముసలిద్ది కాదు" అంటూ పంచ్ వేస్తాడు. తర్వాత సుశీలమ్మ "నా మనసుకు నచ్చే బహుమతి ఇచ్చేవారికి ఊహించని రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను" అని ప్రకటిస్తుంది. దీంతో అందరూ ఆశ్చర్యపోతారు.

దీంతో ప్రభావతి సత్యం ను అడిగి ఏ గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తుంది. సత్యం సరదాగా "ఇప్పుడు మా అమ్మ గురించి కూడా నువ్వే ఆలోచిస్తున్నావా?" అని సైటర్ వేస్తాడు. కానీ ప్రభావతి "నేను కోడల్ని కదా, నాకు ప్రేమ ఉంటుంది కదా" అంటూ సమాధానం ఇస్తుంది. సత్యం మాత్రం ఆమె అసలు ఉద్దేశ్యం రిటర్న్ గిఫ్ట్ కోసమేనని గుర్తిస్తాడు. ఇక మనోజ్, రోహిణి కూడా గిఫ్ట్ గురించి చర్చిస్తారు. రోహిణి చీర రిటర్న్ చేయాలనే మనోజ్ ఆలోచనపై నవ్వుతూ "నీ పొదుపు లెవెల్ వేరు" అని సెటైర్ వేస్తుంది. మరోవైపు శృతి, రవి కూడా బామ్మకు ఏం గిఫ్ట్ ఇవ్వాలో చర్చిస్తారు. శృతి "సెల్‌ఫోన్ ఇస్తాను" అని చెబుతుండగా, రవి "ఆమెకి నచ్చిన వంటకం చేసేద్దాం" అని సలహా ఇస్తాడు.

Gunde Ninda Gudi Gantalu serial Expected episode 550 November 8th 2025 here is full story

Courtesy: Jiohotstar

బాలు మాత్రం బామ్మకు ప్రత్యేక గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. "ఆమె మనసు నాకు బాగా తెలుసు" అని చెబుతూ గిఫ్ట్ కోసం బయలుదేరుతాడు. బామ్మ అతన్ని ఆపుతూ "ఇప్పుడు ఎక్కడికి?" అని అడిగినా, బాలు "అర్జెంట్ పని ఉంది" అంటూ వెళ్లిపోతాడు. ఇక ప్రభావతి తన అత్తగారి గిఫ్ట్ కోసం మీనాక్షిని సంప్రదిస్తుంది. డబ్బు ఖర్చు చేయడం ఇష్టం లేక, ఇంట్లో ఉన్న వాడని టీవీని గిఫ్ట్‌గా ఇవ్వాలని ప్లాన్ చెబుతుంది. మీనాక్షి కూడా సరే అని అంగీకరిస్తుంది.

ఇక అప్ కమింగ్ ఎపిసోడ్ లో సుశీలమ్మ పుట్టినరోజు వేడుకల్లో కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా గడుపుతుండగా, మీనా మాత్రం ఆ క్షణాలను ఎప్పటికీ గుర్తుండేలా చేయాలని నిర్ణయిస్తుంది. ఆమె కెమెరా తీసుకుని వేడుకలన్నీ రికార్డ్ చేస్తూ "అమ్మమ్మగారికి ఈ వీడియోలన్నీ పంపిస్తాను" అంటుంది. ఈ వీడియో గిఫ్ట్ సుశీలమ్మకు ఎంతో ప్రత్యేకమైందిగా అనిపిస్తుంది. ప్రేమతో, మనసుతో చేసిన ఈ బహుమతి సుశీలమ్మ మనసును గెలుచుకుంటుందేమో అనిపిస్తోంది. మీనా ఆలోచన చూసి మురిసిపోతారు సత్యం. ఈ సందర్భంగా అందరూ 'ఈ బహుమతి గెలిచేది మీనానే అయి ఉండొచ్చు' అని అనుకుంటారు.

ఇక మరోవైపు బాలు కూడా తన బామ్మ కోసం మనసుకు నచ్చే గిఫ్ట్ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతని దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నప్పటికీ, ప్రేమ మాత్రం ఎక్కువే. "పెద్ద ఖర్చు చేయకపోయినా, మనసు పెట్టి ఇచ్చిన బహుమతే నిజమైనది" అని నమ్ముతూ ఊరు మొత్తం తిరుగుతాడు. ఎవరైనా గోల్డ్ చెయిన్ కొనొచ్చు, ఎవరైనా ఖరీదైన వస్తువులు ఇవ్వొచ్చు, కానీ బాలు మాత్రం బామ్మకు నిజమైన అనుబంధాన్ని చూపే గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.

ఇంతలో ఇంట్లో అందరూ సుశీలమ్మ పుట్టినరోజు వేడుకలకు సిద్ధమవుతారు. అలంకరణలు, కేక్ కటింగ్ ప్లాన్‌లు,ఆటలు పాటలు అన్ని మొదలవుతాయి.అయితే.. బాలు మాత్రం కనిపించకపోవడంతో సుశీలమ్మ ఆందోళన చెందుతుంది. "బాలు ఎక్కడ ఉన్నాడు?" అని అడుగుతుంది. అదే సమయంలో ప్రభావతి తన స్వభావం ప్రదర్శిస్తూ "మీ రోజు బామ్మ పేరు చెప్పి బయట తాగుతూ ఉంటాడు. ఇక వస్తాడో లేదో!" అంటూ వ్యంగంగా మాట్లాడుతుంది.

అందరూ నిశ్శబ్దంగా ఉంటారు. కానీ మీనా మాత్రం లోలోపల చింతిస్తుంది. బాలు నిజంగా బామ్మ కోసం చెయిన్ తెచ్చేందుకు వెళ్ళాడని ఆమెకు తెలుసు. "అతను ఎక్కడో మనసుతో గిఫ్ట్ కోసం తిరుగుతున్నాడు" అని అనుకుంటూ మనసులో బాధపడుతుంది. బాలు తెచ్చిన ఆ గిఫ్ట్ ఏంటో, సుశీలమ్మ ఎవరికీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందో అనే సస్పెన్స్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X