Gundeninda Gudigantalu November 15th Episode: బామ్మ కోరిక నెరవేరింది..బాలుకే రిటర్న్ గిప్ట్.. షాక్‌లో ప్రభావతి
Courtesy: jiohotstar
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్‌లో సుశీలమ్మ 75వ పుట్టినరోజు వేడుకలు సందడిగా జరుగుతుండగా, అందరూ ఉన్నా బాలు మాత్రం కనిపించకపోవడంతో టెన్షన్ మొదలవుతుంది. రవి-శృతి కేక్ కట్ చేయమని కోరినా, "బాలు వచ్చేంతవరకు కేక్ కట్ చేయను" అని బామ్మ పట్టుదలగా చెబుతుంది. మనోజ్, ప్రభావతి మాత్రం బాలుపై హేళన చేస్తూ "ఎక్కడో తాగి తిరుగుతుంటాడు" అని మాటలు విసురుతారు. వెంటనే మీనా గట్టిగా సమాధానం చెబుతూ "నా భర్త తాగడు, ఏదో పనిపై వెళ్లి ఉంటాడు" అని నిలదీస్తుంది. ఆమె నమ్మకాన్ని సుశీలమ్మ మెచ్చుకుంటూ, ప్రభావతి, మనోజ్‌లకు గట్టిగా మందలిస్తుంది.
బాలు రాకపోవడంతో ముందుగా గిఫ్టులు అందిస్తారు. మనోజ్ నవరత్నాల హారం, రవి స్పెషల్ కేక్, రోహిణి మేకప్, శృతి కొత్త మొబైల్, ప్రభావతి పెద్ద టీవీ ఇస్తారు. ఇంకా బాలు రాకపోవడంతో అందరూ ఆందోళన పడుతుండగా, అకస్మాత్తుగా బాలు ఎంట్రీ ఇస్తాడు. "ఈ రోజు నీకోసం పెద్ద గిఫ్ట్ తెచ్చాను షీలా డార్లింగ్" అని చెప్పగానే అందరూ ఆశ్చర్యంతో నిలుస్తారు. ప్రభావతి మరోసారి సెటైర్లు వేస్తుంది. కానీ బాలు సుశీలమ్మ కళ్లు మూయమని చెబుతూ అసలు సర్ప్రైజ్ చూపిస్తాడు.

సుశీలమ్మ చిన్ననాటి స్నేహితులు సబ్బులు,రాజీ, సత్య ఒక్కొక్కరిగా లోపలికి వస్తారు. కళ్లుమూసి తెరిచిన సుశీలమ్మ వారిని చూసి చిన్న పిల్లైపోతుంది. వారి బాల్య జ్ఞాపకాలు, అల్లరి క్షణాలు, పాటలు అన్నీ ఒక్కసారిగా కళ్లముందు కదలాడుతాయి. ఈ నలుగురు స్నేహితులను తీసుకురావడం వెనుక మీనా పంపిన వీడియోలోని 'చివరి కోరిక' ఉండటం బాలూ బయటపెడతాడు. వృద్ధాప్యంలో జ్ఞాపకాలే అతిపెద్ద బహుమతిగా నిలుస్తాయి... అటువంటి మరచిపోలేని గిఫ్ట్ బాలు ఇచ్చి అందరి హృదయాలు గెలుచుకుంటాడు.
ఇక అప్‌కమింగ్ ఎపిసోడ్‌లో సత్యవతి అందరూ ఊహించని మరో పెద్ద సర్ప్రైజ్ ఇస్తుంది. సుశీలమ్మ వన్‌సైడ్ లవర్ గోపాలాన్ని కూడా పుట్టినరోజు వేడుకలకు తీసుకువస్తుంది. గోపాలం ఎంట్రీ ఇవ్వగానే సుశీలమ్మకు సిగ్గేస్తుంది. వెంటనే సత్యవతి, "మా ఆయన నిన్ను ప్రేమించి చచ్చాడులే... నీ వెంట పడుతుంటే నేనేమో నా వెంట పడుతున్నాడని మురిసిపోయేదాన్ని" అని చెప్పడంతో అందరూ సుశీలమ్మ చిన్ననాటి లవ్ స్టోరీ గురించి ఆసక్తిగా అడుగుతారు. అది వన్‌సైడ్ లవ్ అని, కానీ అందులో ఉన్న అందమైన జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికీ తన మనసులో ఉన్నాయని సుశీలమ్మ చిన్నగా నవ్వుతుంది.
సుశీలమ్మ చిన్ననాటి స్నేహితులు ముగ్గురిని చూసి ఆనందంతో కళ్లు తడుస్తాయి. ఆ భావోద్వేగ క్షణంలో ఆమె బాలుని చూసి, "వీళ్ల గురించి నీకెలా తెలుసురా బాలు?" అని ఆశ్చర్యంగా అడుగుతుంది. వెంటనే బాలు చిరునవ్వుతో, "మీనా చెప్పింది బామ్మ... ఉదయం మీరు మీ చివరి కోరికగా చెప్పిన వీడియో ఆమె నాకు పంపింది" అని చెబుతాడు. అంతట మీనా మాట కలుపుతూ, "బామ్మ గారు బాధపడుతున్నట్టుగా అనిపించింది... మీ చిన్ననాటి జ్ఞాపకాలు మళ్లీ మీ ముందుకు రావాలని అనిపించింది. అందుకే వీడియోని వెంటనే బాలు కి పంపించాను" అని చెప్పుతుంది. ఈ మాటలు విన్న సుశీలమ్మ, అపారమైన ప్రేమతో ఇద్దరినీ చూసి, "అంటే నా సంతోషానికి నిజమైన కారణం మీరిద్దరే అన్నమాట. మా మనవడూ, మా మనవరాలని అయిన మీనా... మీరు ఇద్దరూ నాకు ఈ వయసులో ఇంత పెద్ద బహుమతి ఇచ్చారు" అని హృదయంగా చెబుతుంది.
తర్వాత బామ్మ తన స్నేహితులకు ఒక్కొక్కరినీ పరిచయం చేస్తూ.. "ఇవాళ నా కుటుంబాన్ని మీకు చూపించడం కూడా నా అదృష్టం" అని చెప్పుతుంది. ఆప్యాయత, నవ్వుల మధ్య ఆ క్షణం మరింత మధురంగా మారుతుంది. ఇదంతా చూస్తున్న శ్రుతి ఆనందంతో, "బాలు... ఇది నిజంగా గ్రేట్ సర్ప్రైజ్. ఈజీ కాదు బాబూ... కానీ నువ్వు చేసిన పని చాలా గొప్పది" అని పొగుడుతుంది. ఇంట్లో అందరూ ఆ భావోద్వేగ దృశ్యాన్ని చూసి హృదయపూర్వకంగా బాలు చేసిన సర్ప్రైజ్‌ను అభినందిస్తారు.
ఈ పాత జ్ఞాపకాలు, బాల్యం స్నేహితుల రీయూనియన్‌తో సుశీలమ్మ 75వ పుట్టినరోజు మరపురాని వేడుకగా మారుతుంది. చివరకు కేక్ కట్ చేసిన తరువాత, "నా మనసులోని కోరికను తీర్చిన బాలు ఒక్కరే నిజమైన గిఫ్ట్‌కి అర్హుడు" అంటూ ప్రత్యేక రిటర్న్ గిఫ్ట్ బాలుకే ఇస్తుంది. దాంతో ప్రభావతి, మనోజ్, రోహిణి ముఖాల పై నిరాశ స్పష్టంగా కనిపిస్తుంది. బాలును ఎగతాళి చేస్తోంది ప్రభావతి.
ఇదిలా ఉంటే.. ఇక నకిలీ బంగారం అంశం మాత్రం ఇంకా సస్పెన్స్‌లోనే ఉంది. శ్రుతి తల్లిని ఏదో చెప్పి పంపించినా ప్రభావతి-మనోజ్, బామ్మ వెళ్లిన వెంటనే బాలు ఎదుట నిలబడతారు. ఇప్పుడు బాలు అడిగే ప్రశ్నలకు వాళ్లు ఏమి సమాధానం చెబుతారో, అసలు నిజం బయటపడుతుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











