Gundeninda Gudigantalu November 29th Episode: నిమ్మకాయ ప్లాన్ సక్సెస్.. మనోజ్,ప్రభావతీలను చితకబాదిన సత్యం

Courtesy: jiohotstar

Gundeninda Gudigantalu: గుండె నిండా గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్‌లో ఊహించని మలుపులు చోటుచేసుకున్నాయి. బాలు తెచ్చిన మంత్రించిన నిమ్మకాయకు నిజంగా ఏదో పవర్ ఉన్నది అనుకుంటారు. మీనా కూడా అది నిజమని నమ్ముతుండగా, బాలు అసలు నిజం చెబుతాడు. "ఆ నిమ్మకాయ కూడా నేనే కొన్నాను. ఎలాంటి స్వామీజీ వుండరు" అని కావాలనే అలా చెప్పి దొంగలు బయటపడేందుకు స్కెచ్ వేసినట్లు వివరించాడు. మీనా ఆనందంతో మురిసిపోతూ, బాలును పొగడ్తలతో ముంచెత్తుతుంది. వెంటనే శ్రుతి-రవి దగ్గరికి వెళ్లి అదే నిజం చెబుతుంది. "స్వామీజీ మీ బాలు అన్నయ్యా రవి... మీ పెద్దన్నయ్య నిజం చెప్పాలనే అలా చేశారు" అని మీనా చెప్పగానే, శ్రుతి కూడా అదే నమ్మకం వ్యక్తం చేస్తుంది. "నిజమే మీనా... నాకు కూడా అలాగే అనిపిస్తోంది" అంటుంది. చివరికి శ్రుతి రవిని చూస్తూ, "బాలు స్కెచ్ వేశాడు కదా... దొంగ ఎవరో దొరికిపోతారులే" అని విశ్వాసం చూపుతుంది.

మరోవైపు.. మనోజ్, ప్రభావతి ఇద్దరూ తమ గదిలో భయంతో వణికిపోతున్నారు. చేతులు వంకరపడుతున్నాయంటూ, ముఖం వంకర అవుతోందంటూ, "ఏదో జరుగుతోంది" అంటూ ఒకరినొకరు చూసుకుంటారు. మంత్రం తమ మీద పడుతోందని నమ్మకం మరింత గట్టిగా పెరుగుతుంది. వారి కన్నుల్లో ఎమోషన్, భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమయంలో రోహిణి గదిలోకి వస్తుంది. వాళ్ల భయపు ఎక్స్‌ప్రెషన్స్ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. "మీరెందుకు భయపడుతున్నారు? బాలు అన్నాడు కాబట్టి మంత్రం పడిందా? గుడి పూజారులకు తెలుసు స్వామీజీ విషయాలు. బాలుకు ఏమి తెలుసు? వాడు భయపెట్టడానికి చెప్పాడు అంతే." అని వారిని బుద్ధికలిపే విధంగా తిట్టి, అప్పుడు అలానే ధైర్యం చెప్పి వెళ్లిపోతుంది.

Gunde Ninda Gudi Gantalu serial Expected episode 565 November 29th 2025 here is full story

ఈ ఒక మాటే మనోజ్, ప్రభావతిని కొంత సర్దుబాటు చేస్తుంది. కానీ భయం పూర్తిగా దూరం కాలేదు. రాత్రి అవుతుంది. అందరూ తమ గదులకెళ్తారు. కానీ భయంతో నిండిన మనోజ్‌కు ఒక భయంకరమైన కల. అతడు వీల్ చెయిర్‌లో ఉండి కదలలేకపోతున్నాడేమో అనే కల. అదే సమయంలో ప్రభావతికి కూడా అదే కల! ఇద్దరూ ఒక్కసారిగా నిద్రలేచి, ఊపిరి బిగబట్టి హాల్లోకి పరుగెత్తుకుంటూ వచ్చేస్తారు. అర్ధరాత్రి.. ఇంట్లో నిశ్శబ్దం, చీకటి అదే నిమ్మకాయ అక్కడే ఉంది. వాళ్లు దాని దగ్గరకు చేరి, మళ్ళీ భయంతో గుసగుసలాడుతుంటారు. "ఈ నిమ్మకాయలే మన మీద శాపం పడేలా చేశాయేమో..." అంటూ ఆందోళనగా మాట్లాడుకుంటారు.

భయం తట్టుకోలేక ప్రభావతి తనకు తెలిసిన కామాక్షీకి ఫోన్ చేస్తుంది. భయపడుతూ.. బాలు ఏమి చేశాడో, ఇంట్లో ఉన్నవాళ్లు ఎలా భయపడ్డారు అన్నది చెబుతుంది. కానీ, నిద్ర మబ్బులో ఉన్న మీనాక్షి ఆ మాటలు సరిగా వినిపించవు. కామాక్షీ "ఏం జరిగింది? సరిగా చెప్పు!" అని అడుగుతుంటే, ప్రభావతి మాత్రం భయంతో పూర్తిగా వివరించలేకపోతుంది.

ఇక అప్ కమ్మింగ్ ఎపిసోడ్ మనోజ్, ప్రభావతి ఇద్దరూ కలిసి నిమ్మకాయను బయటికి తీసి దూరంగా పడేయాలని నిర్ణయిస్తారు. నిమ్మకాయ తీసుకుని వెళ్లేసరికే.. ఒక్కసారిగా ఇంట్లో లైట్లు వెలుగుతాయి. అక్కడ బాలు, సత్యం, శ్రుతి, మీనా, రవి... ఐదుగురు వారి ముందే నిల్చున్నారు.
భయంతో వారు చేతిలో ఉన్న నిమ్మకాయలతో దొరికిపోతారు.దీంతో మనోజ్ కు బాలు అడుపడి .. "సిగ్గు లేదురా? నా పెళ్లాం నగలు అమ్ముకోవడానికి కూడా దిగి వచ్చావా?" అంటూ మనోజ్‌ను తిడుతాడు. మీనా కూడా అక్కడే మధ్యలో "నా నగలు తీసి ఆయనకు ఇచ్చింది మీరు కదా?" అని ప్రభావతిని ప్రశ్నిస్తుంది.

దీంతో ప్రభావతి కోపంతో "ఏం వాగుతున్నావే!" అంటూ మీనాను కొట్టబోతుంది. ఇప్పుడే సత్యం ముందుకు వచ్చి, ఆమె చేతిని పట్టుకొని తోసేస్తాడు. ఆ తర్వాత సత్యం మనోజ్ వైపు తిరిగి "నగలు అమ్మేశారా?" అని ప్రశ్నిస్తాడు. మనోజ్ భయంతో, నేరం ఒప్పుకుంటూ "అవును... ఆ నగలు అమ్మేసింది నేనే." అని చెబుతాడు. అతడు అక్కడితో ఆగకుండా, "ఈ విషయం అమ్మకు కూడా తెలుసు" అని చెప్పి ప్రభావతినే చిక్కుల్లో పడేస్తాడు. దీంతో ప్రభావతి భయం కన్నుల్లో స్పష్టంగా కనిపిస్తుంది.మరిన్ని వివరాలు తదుపరి ఎపిసోడ్‌లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X