Gundeninda Gudigantalu December 6th Episode: మీనాపై ప్రభావతి నింద.. మరోసారి సత్యం ఉగ్రరూపం..
Courtesy: jiohotstar
Gundeninda Gudigantalu: గుండెనిండా గుడిగంటలులో శుక్రవారం ఎపిసోడ్‌లో ఇంట్లో ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి స్థాయికి చేరుకుంటాయి. ప్రభావతి చేసిన తప్పే పెద్ద కలకలానికి దారితీసింది. మీనా ఏ తప్పూ లేకుండానే గాజులను ముఖంపై విసిరేసిన ప్రభావతి ప్రవర్తనతో కుటుంబంలో వాతావరణం పూర్తిగా తారుమారైంది. బాధతో కన్నీళ్లు పెట్టుకున్న మీనాకుసపోర్టుగా నిలిస్తాడుబాలు. ముందుకు వచ్చి 'అమ్మ తప్పు బయటపడింది కాబట్టే అలా చేసింది' అంటూ ఓదార్చే ప్రయత్నం చేశాడు. మీనా ఎప్పుడూ మంచి కోరే అమ్మాయి అయినా... ఎందుకో ప్రభావతికి మీనా చేసే పని ఏదీ నచ్చదని సత్యం కూడా అభిప్రాయపడ్డాడు.
ఇదిలా ఉండగా బాలు.. మనోజ్‌పై తీవ్ర ఆగ్రహంతో 'నీ వల్లే ఇంత సమస్య.. 40 లక్షలు అప్పట్లో, ఇప్పుడు మళ్లీ నాలుగు లక్షల కోసం మీనా నగలు అమ్మేశావు. మొత్తం 44 లక్షలు... ఇవన్నీ ఎప్పుడు ఇస్తావు?'అంటూ నిలదీశాడు. మనోజ్ మాత్రం నిర్లక్ష్యంగా 'నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడే ఇవ్వలేను' అని తప్పించుకోవడానికి ప్రయత్నించగా, రోహిణి ముందుకు వచ్చి ఆ డబ్బులు తానే చెల్లిస్తానని చెప్పింది. దీనిపై బాలు 'మనోజ్ మాదిరిగానే నువ్వూ వాయిదా పెడుతున్నావు' అంటూ అసహనం వ్యక్తం చేసినా... చివరికి సత్యం మాటపై బాలు శాంతించి అక్కడినుంచి వెళ్లిపోయాడు.

ఇంతలో ప్రభావతి, రోహిణి, మీనాక్షి మధ్య మరో సారి గొడవ మొదలైంది. రోహిణి చేతిలో గాజులు కనిపించగానే 'నేను భిక్ష వేసిన గాజులను ఎందుకు తీసుకువచ్చావ్?' అంటూ ప్రభావతి మండిపడగా, రోహిణి మాత్రం 'మనోజ్ చేసిన తప్పుకు నేనే ముగింపు పలుకుతా.. ఇక అంతా క్లియర్ అవుతుంది'అని చెప్పింది. మీనాక్షి మాత్రం ప్రభావతిపై తీవ్ర అసహనంతో 'ఇన్ని సంవత్సరాల్లో నాన్నను ఇలా ఎప్పుడూ చూడలేదు... ఈసారి మాత్రం మీ తప్పు నిజంగానే పెద్దది' అని ప్రశ్నించింది.
ఇక మీనా మాత్రం ఇంటి దాబాపైకి వెళ్లి ఏడుస్తుంది. బాలు,శృతి ఆమెను ఓదార్చడానికి వచ్చి 'మీ మీద గాజులు వేసిందంటే... తన తప్పు బయట పడిపోతుందనే భయం' అని చెప్పి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. మీనాకు మాత్రం ఆమె అత్తామామలు మాట్లాడుకోవట్లేదనేది పెద్దగా బాధ చేసింది. తరువాత ప్రభావతి-మీనాక్షి ఇద్దరూ గుడికి వెళ్లినప్పుడు... చేతికి గాజులు లేకపోవడంపై మీనాక్షి సటైర్ వేయడంతో ప్రభావతి మరింత రగిలిపోయింది. మీనాకు క్షమాపణ చెప్పమన్న మీనాక్షి సూచనను ప్రభావతి తిరస్కరిస్తుంది. తాను చచ్చినా క్షమాపణ చెప్పను' అంటూ మొండితనం చూపించింది. దీంతో మీనాక్షి "ఇలా ఉంటే అందరికి దూరమవుతావు" అని హెచ్చరించింది.
గుడికి వెళ్లి మనసు చల్లార్చుకోవాలని ప్రభావతి, మీనాక్షి నిర్ణయించినా... అక్కడ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. రోహిణి-మనోజ్ నగల వ్యవహారం తర్వాత ఇంట్లో నెలకొన్న ఉద్రిక్తతను బయటపడేయాలని శోభ గట్టిగా ప్లాన్ వేసింది. గుడిలో ప్రభావతిని కలిసిన శోభ, బయటకు ఏమీ తెలియనట్లే మాట్లాడుతూ... వాస్తవానికి గట్టిగానే ఆరా తీయడం ప్రారంభించింది.
ప్రభావతి చేతులకు గాజులు కనిపించకపోవడాన్ని గమనించిన శోభ "చేతులకు ఏమైంది? బంగారు గాజులు కనిపించడం లేదు కదా" అని మెల్లిగా ప్రశ్నించింది. పక్కనే ఉన్న మీనాక్షి కూడా అప్పుడే అవకాశాన్ని అందుకొని "ఇది కుడి చేయి, ఇది ఎడమ చేయి... శోభను అలా అడుగుతోంది" అంటూ వెటకారం వేసింది. శోభ మాత్రం ఆగలేదు. "డాబాపై ఇంకో గది కట్టాలని అనుకుంటున్నారు కదా... అందుకోసమే గాజులు అమ్మేశారా?" అంటూ నేరుగా గొడవను ప్రస్తావించింది. శోభ మాటలకు ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయి మాట రాక సైలెంట్ అయిపోయింది.
తర్వాతి ఎపిసోడ్‌లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. ఇంటికి తిరిగి వచ్చిన బాలు, మీనాలను సత్యం హాల్లోకి పిలిచి మాట్లాడతాడు. ప్రభావతి చేసిన అతి పెద్ద తప్పుకు తనమే క్షమాపణ కోరడం ప్రారంభిస్తాడు. "మీనా... అత్తయ్య చేసిన వ్యవహారానికి నేను నన్నే బాధ్యుడిగా భావిస్తున్నా. నన్ను క్షమించు" అని మనస్పూర్తిగా అంటాడు సత్యం.
అయితే మీనా మాత్రం వెంటనే "మీరేం సారీ చెప్పాలి మామయ్య? తప్పంతా మనోజ్-అత్తయ్యలదే... మీరు ఎందుకు బాధపడుతున్నారు?" అంటూ అడ్డుకుంటుంది. అంతలోనే గుడి నుండి వచ్చిన ప్రభావతి గోడచాటున నిలబడి ఈ సంభాషణ మొత్తం వింటుంది. లోపలికి వచ్చిన తర్వాత ఏమీ విననట్టే నటిస్తూ సత్యం దగ్గరకు వస్తుంది. కానీ సత్యం మాత్రం మండిపడి "నా ముందు ఉండే దుష్టగ్రహం ఇక్కడి నుంచి వెంటనే పో!" అంటూ ఘాటుగా హెచ్చరిస్తాడు. సత్యం కోపం చూసిన ప్రభావతి మరింత గొడవ పడకుండా అక్కడినుంచి నిశ్శబ్దంగా జారుకుంటుంది.
తరువాత మీనా వంటగదిలో పూరీలు చేస్తూ ఉండగా, ప్రభావతి ఆమెను ఇబ్బంది పెట్టేందుకు అక్కడికి వస్తుంది. "ఏం చేస్తున్నావే?" అంటూ వ్యంగ్యంగా అడిగితే... మీనా శాంతిగా "పూరి చేస్తున్నాను... అయ్యాక మీకు కూడా తీసుకువస్తాను" అంటుంది. కానీ ప్రభావతి మాత్రం అన్నదే లేదు."నా మీద లేనిపోని చాడీలు చెప్పి... మా ఇద్దరి మధ్య గొడవ పెట్టావ్. ఇప్పుడు సంతోషంగా ఉన్నావా? నీ కడుపు నిండిపోయిందా?" అంటూ పైకి నిందలు వేస్తుంది.
తనను శాంతిగా ఉన్న మీనా ఏమీ అనకపోవడంతో ప్రభావతి మరింత ఘాటుగా "మాకు ఎవరికీ ఏం పెట్టకు... నీకు నచ్చింది చేసుకొని తిను!" అంటూ దుయ్యబట్టుతుంది. ఈ మాటలు విన్న బాలు ఆగ్రహంతో లేచి వస్తాడు. పక్కగా సత్యం కూడా అసహ్యంతో చదువుతున్న పేపర్‌ను కిందకి విసిరి నడుచుకుంటూ వెళ్లిపోతాడు. ఇంట్లో పరిస్థితి పూర్తిగా పేలుడు స్థాయికి చేరుతుంది. ఇక మిగిలింది ఒక్కటే ప్రశ్న... ప్రభావతి తన తప్పును గ్రహించి సత్యంకు క్షమాపణ చెప్పుతుందా? లేదా మళ్లీ మీనాపైనే నిందలు వేసి కొత్త కుట్ర పన్నుతుందా?అనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications










