Gundeninda Gudigantalu December 13th Episode: షీలా డార్లింగ్ పంచాయతీ..సత్యం ఆవేదన.. మీనాకు ప్రభావతి క్షమాపణ?
Courtesy: jiohotstar
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్‌లో డ్రామా పీక్‌కు చేరింది. ఇంట్లో కొత్త కారు కొనుగోలు విషయంపై బాలు-మీనాల మధ్య చిన్న గొడవ చెలరేగింది. బాలు కొత్త కారుకు ఆసక్తి చూపగా, ఇంట్లో గొడవలు సర్దుమణిగిన తరువాత కారు తీసుకోమని బాలుకు తన నిర్ణయాన్ని చెబుతుంది. దీంతో నిరాశతో వెనుదిరిగిన బాలు, తన తల్లిదండ్రులను కలపడానికి ఓ కొత్త ప్లాన్ వేస్తాడు.
ఇదే సమయంలో డబ్బింగ్ స్టూడియోలో శృతి ప్రెగ్నెన్సీ సీన్‌కి వాయిస్ ఇస్తూ బాగా ఎమోషనల్ అయిపోతుంది. ప్రతి తల్లి పడే బాధలను అర్థం చేసుకుని వెంటనే తల్లికి ఫోన్ చేసి క్షమాపణ చెబుతుంది. ఇంటికి తిరిగి వచ్చిన శృతి ఆ సీన్‌లో తనకెంత కష్టమైందో అవాక్కయి చెబుతుండగా.. రోహిణి మాత్రం పుసుగుసుమంటూ ప్రెగ్నెన్సీ అనుభవాలను డీటెయిల్‌గా చెబుతుంది. రోహిణి చెప్పిన వివరాలు విని మీనా, శృతి ఇద్దరూ షాక్ అవుతారు. వెంటనే శ్రుతి 'నువ్వే అనుభవించినట్టు మాట్లాడుతున్నావ్"అని ప్రశ్నించగా, రోహిణి తడబడి 'క్లైంట్స్ చెప్పారని'కవర్ చేస్తుంది.

ఇదిలా ఉంటే.. తన ప్లాన్ ప్రకారం బాలు సుశీలమ్మను ఇంటికి తీసుకొస్తాడు.ఇంట్లో జరుగుతున్న సమస్యలన్నింటినీ విని సుశీలమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మీనా చెప్పకపోవడం బాధగా ఉన్నప్పటికీ, సమస్యను పరిష్కరించడానికి తాను ముందుకొస్తానని చెబుతుంది. ప్రభావతి చూసిన వెంటనే 'నా కొడుకు ఇంటికి వచ్చా.. నన్ను ఎవరు ఆపుతారు?' అంటుంది సుశీలమ్మ. ప్రభావతి, మనోజ్ వల్ల వచ్చిన సమస్యలు తెలుసుకున్న సుశీలమ్మ, 'పెద్ద పెద్ద డిగ్రీలు చదివించాడు అనుకుంటే మేకిలా తయారయ్యాడు' అంటూ ప్రభావతిపై నిప్పులు చెరుగుతూ క్లాస్ తీసుకుంది.
తర్వాత సత్యంని కలుసుకున్న సుశీలమ్మ, భార్యతో గొడవపడి ఇలా మౌనంగా ఉండడంపై బాగా మందలిస్తుంది. దీంతో సత్యం మనోజ్ చేసిన దొంగతనం, దానికి ప్రభావతి ఇచ్చిన కవరింగ్ గురించి చెబుతాడు. ఈ నిజాలు విని సుశీలమ్మ షాక్ అవుతుంది. సత్యం ఇక సహించలేనని, ఏళ్ల తరబడి భరించానని చెబుతాడు. దీనికి సుశీలమ్మ "ఈ వయసులో పిల్లలకి ఆదర్శంగా ఉండాలి" అని చెబుతూ, ఇద్దరు క్షమాపణలు చెప్పుకుని కలిసి వెళ్లాలని సూచిస్తుంది. అయితే సత్యం 'ముందు ప్రభావతి మీనాకు క్షమాపణ చెప్పాలి'అని, మీనాపై ప్రభావతి చేసిన అవమానకర ప్రవర్తన, అహంకారంతో గాజులు విసరడం అన్నింటికి కలిపి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాడు.
ఇక అప్ కమ్మింగ్ ఎపిసోడ్‌లో ప్రభావతి చేసిన దారుణాలను ఒక్కొక్కటిగా తన తల్లి సుశీలమ్మకు చెబుతాడు సత్యం. దీంతో సుశీలమ్మ ఆ దారుణాలను విని, షాక్ అవుతుంది. ప్రధానంగా మీనా నగలను దొంగతనం చేయడమే కాకుండా.. ఆ నిందను మీ నా తల్లిపై, తనపై వేయడంతో సుశీలమ్మ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అంతే కాకుండా.. ప్రభావతి అహంకారంతో మీనా ముఖంపై గాజులను విసిరేయడం.. అస్సలు సహించదు. వెంటనే కుటుంబ సభ్యులందరినీ ఏకం చేసి సుశీలమ్మ పంచాయతీ పెడుతుంది. ఈ పంచాయతీలో ప్రధానంగా ప్రభావతిని టార్గెట్ చేస్తుంది. ముందుగా సత్యం తన వాదనలో వినిపించగా.. ప్రభావతి మాత్రం నోరు విప్పకుండా సైలెంట్ గా ఉండిపోతుంది.
దీంతో సుశీలమ్మ.. మనోజ్ గాడు వ్యాపారంలో మోసపోతే ఆ విషయాన్ని ఇంట్లో చెప్పకుండా వాడిని కాపాడే ప్రయత్నంలో మీనా నగలను దొంగతనం చేయడం పెద్ద తప్పు ఆ తప్పును కవర్ చేయడానికి.. మీనా పై నిందలు వేయడం నువ్వు చేసిన మరో తప్పు ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ అందరి ముందు ఈరోజు తలదించుకోవడం ఏమైనా భావ్యంగా ఉందా అంటూ ప్రభావతిని నిలదీస్తోంది. వెంటనే తన కొడుకు సత్యం ను పిలిచి, ప్రభావతి తప్పులను క్షమించి ఇద్దరు మాట్లాడుకోండి. మీ పిల్లల ముందు ఇలా వేరువేరుగా ఉండడం సరికాదు అని సుశీలమ్మ సూచిస్తుంది. దీంతో సత్యం తన కోరిక మీ నాకు నీకు సారీ చెబితేనే నేను ప్రభావంతో మాట్లాడుతాను సత్యం తెగేసి చెప్తాడు.
ప్రభావతి తన తప్పును అంగీకరించక పోగా.. తాను మీ నాకు ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పను అని మొండికేసి కూర్చుంటుంది. దీంతో సత్యానికి ఎక్కడలేని కోపం వస్తుంది.. చూసావా ఇంత జరిగినా దాని అహంకారం కొంచెం కూడా తగ్గలేదు. మీనా మీద, మీనా పుట్టింటి మీద ఎన్నో నిందలు వేసింది. ఆ తప్పులకు కచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే.. అంటూ సత్యం తెగేసి చెబుతాడు. దీంతో ఇంట్లో ఉద్రిక్త వాతావరణం ఎలా ఉంటుంది. సత్యం మాటకు ప్రభావతి వస్తుందా? మీనాకు ప్రభావతి క్షమాపణ చెబుతుందా? లేదా మీనానే తగ్గి తన అత్తయ్య ను క్షమిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
అలాగే.. బాలు తన కొత్త కారు ప్రయత్నాలు విజయవంతం అవుతాయా లేదా ఇంట్లో మరేమైనా అడ్డంకులు ఎదురవుతాయా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. మరోవైపు రోహిణి మీ నాకు కలిగిన సందేహం తీరుతుందా? లేదా ఆ సందేహాన్ని తీర్చుకోవడానికి మీనా ఏమైనా ప్లాన్స్ వేస్తుందా అనేది కూడా ఉత్కంఠ భరితంగా మారింది. ఒకవేళ మీనా రోహిణి బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే.. సీరియల్ మరింత ఉత్కంఠ గా మారుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చూడాలి మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో..


Click it and Unblock the Notifications










