Gundeninda Gudigantalu December 20th Episode: లక్ష బహుమతి.. మీనా, ప్రభావతిల మధ్య హోరాహోరీ..

Courtesy: jiohotstar

Gundeninda Gudigantalu: గుండెనిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్‌లో బాలు తన చెల్లెలు మౌనిక తాను ఎవరో అన్నట్టు వ్యవహరించిన తీరును తలచుకుంటూ లోపల లోపల కుమిలిపోతాడు.ఈ పరిస్థితిని గమనించిన మీనా, బాలునికి ధైర్యం చెబుతుంది. 'నీ చెల్లి ఎప్పుడూ నీకు దూరం కాదు. అందరికంటే నీకే ఎక్కువ దగ్గరగా ఉంటుంది. అనవసరంగా ఎక్కువ ఆలోచించి బాధపడకండి' అంటూ ఓదారుస్తుంది. సంజూ అక్కడే ఉండొచ్చు, గొడవ కాకూడదనే ఉద్దేశంతో మౌనిక అలా మాట్లాడి ఉండవచ్చని వివరిస్తుంది. అయినా మీనా మనసులో మాత్రం మౌనిక ప్రవర్తనపై అనుమానం, ఆందోళన పెరుగుతూనే ఉంటుంది.

ఇక మరోవైపు సంజూ అసలు స్వరూపం బయటపడుతుంది. మౌనికతో చాలా హీనంగా మాట్లాడుతూ, 'చెల్లెలు ముందు నువ్వు పరాయిదానిలా కనిపించడంతో నాకు చాలా హ్యాపీగా ఉంది. బాలు ఇలా కుమిలిపోతూ ఉంటే అదే నాకు కావాల్సింది' అంటూ ద్వేషాన్నిబయటపెడుతాడు. ఈ సమయంలో మీనా మౌనికకు ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్‌ను గమనించిన సంజూ వెంటనే కట్ చేయమని ఆదేశిస్తాడు. సంజూ మాటలకు భయపడి మౌనిక ఫోన్ లిఫ్ట్ చేయకుండా మౌనంగా ఉంటుంది. దీంతో మీనా మరింత కంగారు పడుతూ, సంజూ - మౌనిక మధ్య ఏదైనా గొడవ జరిగిందా అని బాధపడుతుంది.

Gunde Ninda Gudi Gantalu serial Expected episode 580 December 20th 2025 here is full story

ఇదిలా ఉండగా మనోజ్ మనసులో మరో భయం మొదలవుతుంది. అజ్ఞాత వ్యక్తి రాసిన లెటర్ గుర్తుకు వచ్చి నిద్రలేక తల్లడిల్లిపోతాడు. ఆ లెటర్ చేతిలో పట్టుకుని తల్లి ప్రభావతిని గార్డెన్‌కు పిలుస్తాడు. 'మళ్లీ ఏం సమస్య తెచ్చావ్?'అని ప్రశ్నించిన ప్రభావతికి లెటర్ చూపిస్తాడు. కానీ ప్రభావతి మాత్రం దాన్ని పెద్దగా పట్టించుకోకుండా..'నీ వల్లే అందరికీ సమస్యలు వస్తాయి, కానీ నీకు సమస్య తెచ్చేవారు ఎవరున్నారు?' అంటుంది.ఈ మాటలతో మనోజ్ ఇన్‌డైరెక్ట్‌గా తల్లినే అనుమానించడంతో ప్రభావతి ఆగ్రహంతో మనోజ్‌ను చితకబాదుతుంది. నన్నే అనుమానిస్తావా? అంటూ మందలిస్తుంది.

మరుసటి రోజు ఉదయం బాలు తన స్నేహితుడు రాజేష్‌ను ఇంటికి పిలిచి, తన రెండో కారును తండ్రి సత్యం చేత కిరాయికి ఇస్తాడు. ఇది చూసిన రాజేష్ ఆనందంతో బాలుని పొగడ్తలతో ముంచెత్తుతాడు. అయితే మనోజ్ మాత్రం అక్కడ కూడా వెటకారం మానడు. 'ఎవడు పడితే వాడు బిజినెస్ మాన్ కాలేడు. స్టేటస్ ఉండాలి' అంటూ సెటైర్ వేస్తాడు. ఈ మాటలకు మీనా మండిపడుతుంది. నాలుగు లక్షల ఫర్నిచర్ మోసాలు, ఇతరుల బంగారం అమ్ముకోవడం లాంటి విషయాలను గుర్తుచేస్తూ ఘాటుగా సమాధానం చెబుతుంది. రోహిణి మీనాపై ఫైర్ అవుతుంటే, ప్రభావతి కూడా మనోజ్‌కు మద్దతుగా మాట్లాడుతుంది. 'బొమ్మ కార్లు కొంటారులే' అంటూ ప్రభావతి చేసిన వ్యాఖ్య మీనాకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తుంది.

మీనా శపథం చేయబోతే బాలు అడ్డుకుంటాడు. ఈ సమయంలో సత్యం ప్రభావతిపై ఘాటుగా మండిపడి, 'ప్రయోజకుడైన కొడుకును దూరం పెట్టి, దద్దమ్మలను నెత్తిన పెట్టుకున్నావ్' అంటూ చీ కొడుతాడు. ఎపిసోడ్ చివర్లో మనోజ్ తన సమస్యలకు పరిష్కారం కోసం జ్యోతిష్యుడిని ఆశ్రయిస్తాడు. లెటర్ చూపించగానే జ్యోతిష్యుడు భయాన్ని క్యాష్ చేసుకోవాలని 'నీకు పెద్ద ప్రమాదం రాబోతోంది. ప్రతిరోజూ వేర్వేరు రంగుల బట్టలు వేసుకో'అంటూ భయపెడతాడు. ఈ హెచ్చరికతో మనోజ్ మరింత భయాందోళనకు లోనవుతాడు. ఇలా ఈ ఉత్కంఠభరితమైన ఎపిసోడ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతూ ముగిసింది.

రాబోయే ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారబోతోంది. ఈసారి కథలోకి ఓ కొత్త ట్విస్ట్‌గా బెస్ట్ కపుల్ కాంపిటీషన్ ఎంటర్ అవుతోంది. రవి తన హోటల్‌లో ఏర్పాటు చేసిన ఈ స్పెషల్ కాంపిటీషన్ గురించి ఇంట్లో వారందరికీ వివరించడంతో, ఒక్కసారిగా ఇంట్లో సందడి మొదలవుతుంది. రవి, తన హోటల్‌లో 'ఆదర్శ దంపతుల పోటీ'నిర్వహిస్తున్నామని చెబుతాడు. ఈ మాట వినగానే మీనా ఎగ్జైట్మెంట్‌తో రవి దగ్గరకు వెళ్లి, ఆ కాంపిటీషన్ ఏంటి? ఎలా ఉంటుంది? ఎవరు పాల్గొనొచ్చు? అని వివరంగా అడుగుతుంది. రవి చిరునవ్వుతో, ఇది కేవలం ఆట కాదు, భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధం, అవగాహన, ప్రేమను పరీక్షించే పోటీ అని చెబుతాడు. ఆసక్తి ఉన్నవాళ్లు దరఖాస్తు పత్రాలు నింపాలని కూడా సూచిస్తాడు.

ఈ సమయంలో మీనాక్షి సరదాగా 'మీ అమ్మానాన్నలు కూడా ఇందులో పాల్గొనవచ్చా?'అని ప్రశ్నించగా, ప్రభావతి వెంటనే విసుగ్గా స్పందిస్తుంది. 'నాకెందుకు ఇవన్నీ? మేం పోటీకి వెళ్లడమేంటి?' అంటూ ఆలోచననే తిరస్కరిస్తుంది. ఇక మనోజ్ మాత్రం తన స్టేటస్ కార్డు బయటకు తీస్తూ 'ఇలాంటి చిన్న చిన్న కాంపిటీషన్‌లకు వెళ్తే నా స్టేటస్ పడిపోతుంది' అంటూ ఓవర్ యాక్టింగ్ చేస్తాడు. అయితే ఈ సీన్‌కు అసలైన ట్విస్ట్ శృతి మాటలతో వస్తుంది. 'అందరూ వస్తారు అనుకున్నా... ప్రైజ్ మనీ లక్ష రూపాయలు కదా' అని అనగానే ఇంటిల్లిపాది ఒక్కసారిగా షాక్ అవుతుంది. మనోజ్ అయితే 'లక్ష రూపాయలా?' అంటూ నోరు తెరుచుకుని ఆశ్చర్యపోతాడు. అదే మనోజ్ స్టేటస్ మాటలు మరిచిపోయినట్లే కనిపిస్తాడు.

లక్ష రూపాయల ప్రైజ్ మనీ విన్న వెంటనే ప్రభావతి పూర్తిగా మారిపోతుంది. 'లక్ష రూపాయలైతే కచ్చితంగా పాల్గొనాల్సిందే' అంటూ ఎగ్జైట్మెంట్‌తో ఫామ్ ఫిల్ చేయడానికి ముందుకు వస్తుంది. దీంతో ఈ కాంపిటీషన్ చుట్టూ ఇంట్లో మరో కొత్త కలకలం మొదలవుతుందని స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే ఎపిసోడ్లలో ఈ పోటీ కుటుంబంలో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X