Gunde Ninda Gudi Gantalu January 3rd Episode: చింటూ తల్లికి బాలు ఫోన్.. రోహిణి రహస్యాలు బయటపడతాయా?

Courtesy: jiohotstar

Gundeninda Gudigantalu: గుండె నిండా గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్ ప్రారంభంలో బాలు, మీనా ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపిస్తారు. ఈ సమయంలో బాలు చింటూ కోసం తీసుకొచ్చిన డ్రెస్‌ను మీనాకు చూపిస్తాడు. డ్రెస్ చూసిన మీనా చాలా ఎమోషనల్‌గా స్పందిస్తూ, చింటూ పుట్టినరోజు దగ్గరలో ఉందని గుర్తుచేస్తుంది. 'మనమే వెళ్లి గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేద్దాం' అంటుంది మీనా.. చింటూ విషయంలో ఉన్న ప్రత్యేకమైన అనుబంధం ఈ సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే.. రవి పనిచేస్తున్న రెస్టారెంట్‌కు అతని అత్త శోభ అనుకోకుండా రావడం ఉద్రిక్తతలకు దారితీస్తుంది. ఆమె రావడమే రవిలో అనుమానాలను రేకెత్తిస్తుంది.

పిల్లల విషయంలో ఆలస్యం ఎందుకు చేస్తున్నారని, జీవితంలో కొన్ని విషయాలు సమయానికి జరగాలని శోభ సూటిగా మాట్లాడుతుంది. ఆమె మాటలు రవిని అయోమయంలో పడేస్తాయి. విషయం అర్థం కాకపోయినా, ఆమె మాట్లాడే తీరులో ఉన్న అహంకారం రవికి అసహనాన్ని కలిగిస్తుంది. ఇంతలోనే శోభ తన బ్యాగ్ నుంచి బ్లాంక్ చెక్కును తీసి రవికి ఇస్తుంది. 'రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నావు కదా, తీసుకో' అంటూ నిర్లక్ష్యంగా చెక్కును అతని చేతిలో పెడుతుంది. రవి ఎవరి దగ్గర నుంచి ఉచితంగా డబ్బులు తీసుకోని వ్యక్తినని, తన స్వాభిమానానికి ఇది విరుద్ధమని ఆమె బాగా తెలుసు.

Gunde Ninda Gudi Gantalu serial Expected episode 580 January 3rd 2025 here is full story

Courtesy: jiohotstar

అయినా.. తన అత్త శోభ.. బ్లాక్ చెక్ ఇవ్వడంతో ఆవేశంతో ఊగిపోతాడు. దీంతో వెంటనే శృతి డబ్బింగ్ స్టూడియోకు వెళ్లాడు. 'మన పర్సనల్ విషయాలు మీ అమ్మగారికి ఎందుకు చెబుతున్నావ్?' అంటూ శృతిపై విరుచుకుపడతాడు. దీంతో శృతి ' అసలేం జరిగిందని ప్రశ్నించగా.. అప్పుడు రవి అసలు నిజాన్ని బయటపెడతాడు. 'మీ అమ్మ బ్లాంక్ చెక్ ఇచ్చింది. నేను మా నాన్న దగ్గర నుంచే డబ్బులు తీసుకోను. అలాంటిది మీ అమ్మ దగ్గర నుంచి ఎలా తీసుకుంటాను?' అంటూ తన ఆత్మగౌరవాన్ని స్పష్టంగా చెబుతాడు. శృతి మాత్రం, 'నీ బాగు కోసం మా అమ్మ ఇచ్చింది' అంటూ సమర్థించడమే కాకుండా, పెద్దన్నయ్య మనోజ్ కూడా అలాగే చేశాడని ఉదాహరణ ఇస్తుంది. దీంతో రవి మరింత ఆగ్రహానికి లోనై.. చెక్‌ను చింపి శృతి ముఖాన వేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

ఇక మరోవైపు చింటూ బర్త్‌డే సన్నివేశాలు పూర్తిగా ఎమోషనల్‌గా సాగుతాయి. తల్లి రోహిణి వస్తేనే పుట్టినరోజు చేసుకుంటానని చింటూ మారం చేయడంతో శాంతమ్మ ఆవేదనకు గురవుతుంది. అదే సమయంలో రోహిణి సడన్‌గా వచ్చి చింటూకి సర్ప్రైజ్ ఇవ్వడంతో అతడి ఆనందానికి అవధులు ఉండవు. ఈ క్షణాల్లో శాంతమ్మ చింటూ భవిష్యత్తు గురించి తన భయాన్ని వ్యక్తం చేస్తుంది. అయితే రోహిణి మాత్రం ఈ విషయాలపై మాట్లాడొద్దంటూ తల్లిని సీరియస్‌గా హెచ్చరిస్తుంది.

ఈ సన్నివేశాల మధ్యలోనే బాలు - మీనా సడన్ ఎంట్రీ ఇవ్వడం కథను మరోసారి ఉత్కంఠకు తీసుకెళ్తుంది. వారిని చూసిన చింటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతాడు. బాలు అతడిని ఎత్తుకొని ముద్దాడటం భావోద్వేగంగా మారుతుంది. అయితే బాలు-మీనా రాకతో రోహిణి, శాంతమ్మ ఇద్దరూ తీవ్ర ఆందోళనకు గురవుతారు. ఈ సమయంలో శాంతమ్మ నోరు జారడంతో, చింటూ అమ్మ ఎవరు అన్న ప్రశ్న బాలు అడగడం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మారుస్తుంది. పరిస్థితిని కంట్రోల్ చేయాలనే ప్రయత్నంలో శాంతమ్మ కవరింగ్ చేస్తూ మాట మార్చేస్తాడు. కానీ బాలు-మీనా ఇంట్లోకి అడుగుపెట్టడంతో రోహిణి 'నా కొడుకు కోసం ఉండాలా? లేక నా కాపురం కోసం వెళ్లిపోవాలా?' అన్న ఆలోచనతో ఆమె కన్నీళ్లపర్యంతమవుతుంది.

ఇక రాబోయే ఎపిసోడ్‌లో మరింత భావోద్వేగంగా, ఉత్కంఠభరితంగా సాగనుంది. బాలు- మీనా ఇద్దరూ చింటూ పుట్టినరోజు కేక్ కట్ చేయించాలని నిర్ణయించుకుంటారు. ఇక చింటూ కేక్ కట్ చేసే ముందు చింటూ 'అమ్మ ఎక్కడ?' అంటూ అడగడంతో అక్కడి వాతావరణం మారిపోతుంది. ఆ ప్రశ్నతో బాలు కూడా ఆశ్చర్యానికి గురై 'వాళ్ల అమ్మ వచ్చిందా?' అంటూ అడుగుతాడు. చుట్టూ ఉన్నవాళ్లు కూడా "కళ్యాణి ఎక్కడ?" అంటూ ప్రశ్నలు వేయడం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా చేస్తుంది.

ఈ సమయంలో శాంతమ్మ ఏదోలా మాటలు సర్దిచెప్పి పరిస్థితిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. సరేలే అనుకుని బాలు చింటూకి కేక్ కట్ చేయించాలని ప్రయత్నించినా, చింటూ మనసులో మాత్రం తల్లి లేకుండా పుట్టినరోజు జరుపుకోవడం ఇష్టం ఉండదు. తన తల్లిని పిలిస్తే ఏమవుతుందో అన్న భయంతో చింటూ మౌనంగా ఉంటాడు. మరోవైపు రోహిణి ఈ దృశ్యాలన్నీ దూరం నుంచి చూస్తూ ఎమోషనల్ అవుతుంది. చివరికి రోహిణి లేకుండానే చింటూ పుట్టినరోజు వేడుకలు ముగుస్తాయి.

ఈ పరిణామాల తర్వాత బాలు శాంతమ్మను ప్రశ్నిస్తాడు. 'ఇన్ని సమస్యలు పెట్టుకుని చింటూను ఎలా చూసుకుంటారు?'అని నిలదీస్తాడు. దానికి శాంతమ్మ భావోద్వేగంగా స్పందిస్తూ, "రేపు నాకు ఏదైనా అయితే వీడిని ఎవడు చూస్తాడు?" అంటూ తన భయాన్ని బయటపెడుతుంది. తన గతంలో చేసిన తప్పుల వల్లే ఈరోజు చింటూ తల్లి లేకుండా పెరుగుతున్నాడని, తాను చనిపోయాక అతడి భవిష్యత్తు ఏమవుతుందో అర్థం కావడం లేదని చెబుతుంది.

ఈ మాటలు విన్న బాలు ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. "తప్పులు చేసిన వాళ్లు కాదు, ఏ తప్పూ చేయని చింటూనే శిక్ష అనుభవిస్తున్నాడు" అంటూ శాంతమ్మను ప్రశ్నిస్తాడు. అప్పుడు శాంతమ్మ అసలు నిజాన్ని బయటపెడుతుంది. అప్పటి పరిస్థితుల్లో వేరే మార్గం లేక తన కూతుర్ని బలవంతంగా ఒప్పించి పెళ్లి చేసిందని చెప్పడంతో బాలు షాక్ అవుతాడు. వెంటనే "మీ అమ్మాయితో నేను ఫోన్‌లో మాట్లాడతాను... నెంబర్ ఇవ్వండి" అంటూ శాంతమ్మను అడుగుతాడు.

ఈ మాటలను రోహిణి చాటుగా వింటూ, తన గతం పూర్తిగా బయటపడిపోతుందేమోనని భయపడుతుంది. ఇక రాబోయే ఎపిసోడ్‌లో బాలు రోహిణి గతాన్ని పూర్తిగా తెలుసుకుంటాడా? చింటూ తన తల్లి గురించి నిజం చెప్పగలడా? రోహిణి అందరి ముందుకు వస్తుందా? అనే ప్రశ్నలతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X