Gundeninda Gudigantalu December 27th Episode: విజేతలుగా బాలు,మీనా.. ప్రైజ్‌మనీతో ఊరేగింపు.. ప్రభావతి రచ్చ..

Courtesy: jiohotstar

Gundeninda Gudigantalu: గుండెనిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్ పూర్తిగా 'బెస్ట్ కపుల్ కాంపిటీషన్' చుట్టూనే తిరిగింది. ప్రభావతి కుర్చీపై నుంచి పడిపోవడంతో నడుము పట్టుకుని బాధపడుతుంది. ప్రభావతిని చూసి అందరూ కంగారు పడుతుండగా, మీనా తన తోడికోడళ్ల సహాయంతో నాటు వైద్యం చేస్తూ ఆమె నడుమును సెట్ చేసింది. చికిత్స కాస్త మొరటుగా ఉన్నప్పటికీ నడుము సెట్ కావడంతో ప్రభావతి ఊపిరి పీల్చుకుంది. అయితే నెమ్మదిగా నడుస్తూ స్టేజ్ దిగే సమయంలో ఆమె ముఖంలో నొప్పి స్పష్టంగా కనిపించింది.

స్టేజ్ దిగిన వెంటనే బాలు తన తల్లి ప్రభావతిపై సెటైర్లు వేయడం మొదలుపెట్టాడు. 'ఆ కుర్చీ అమ్మ బరువు మోయలేకపోయింది నాన్న... నాన్న మోసి ఉంటే ఆయన పరిస్థితి కూడా అంతే ఉండేది'అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. ఈ మాటలతో ప్రభావతి కసరుకోగా, బాలు ఆగకుండా 'మీనా నడుము సెట్ చేసింది కాబట్టి బతికిపోయావు... లేదంటే ముసలిదానిలా ఇంటికి వెళ్లాల్సి వచ్చేది' అంటూ మరోసారి సెటైర్ వేస్తాడు. ఈ మాటల మధ్యలో మీనాక్షి'నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది'అంటూ అనూహ్యంగా స్పందిస్తుంది.

Gunde Ninda Gudi Gantalu serial Expected episode 585 December 27th 2025 here is full story

'మనం గెలవకపోయినా పక్కవాళ్లు ఓడిపోతే వచ్చే ఆనందమే వేరు'అంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది. ఆమె మాటలకు షాక్ అయిన ప్రభావతి 'ఇంత రాక్షసత్వమా?'అనగా, మీనాక్షి కూడా వెనక్కి తగ్గకుండా 'నువ్వు మాత్రం తక్కువ కాదు... నాకంటే ఎక్కువే'అంటూ ఎదురు దాడి చేసింది. 'సర్లే మనకిక్కడ ఏం పని ఉంది? బయట కేజీ సేల్స్ నడుస్తున్నాయట... చీరలు కొనుకుందాం' అంటూ టాపిక్ డైవర్డ్స్ చేస్తుంది.

తర్వాత జడ్జెస్ కాంపిటీషన్‌లో లీడింగ్‌లో ఉన్న జంటలను ప్రకటించారు. ఇప్పటివరకు జరిగిన రౌండ్ల ఆధారంగా మనోజ్-రోహిణి జంట మొదటి స్థానంలో, శృతి-రవి రెండో స్థానంలో, మీనా-బాలు మూడో స్థానంలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ ప్రకటనతో పోటీ మరింత ఉత్కంఠగా మారింది. అనంతరం ప్రారంభమైన రౌండ్‌లో భార్యాభర్తలు ఒకరి జీతం గురించి మరొకరు చెప్పాల్సి వచ్చింది. శృతి-రవి తమ సమాధానాలతో జడ్జెస్‌ను పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. మనోజ్ మాత్రం జడ్జెస్‌కే ఎదురు ప్రశ్నలు వేయడం, చివరకు నెలకు పదివేలు మాత్రమే మిగులుతాయని చెప్పడంతో జడ్జెస్ సెటైర్లు వేయడం హైలైట్‌గా నిలిచింది.

అయితే బాలు-మీనా వంతు రాగానే సీన్ మారిపోయింది. ఒకరిపై ఒకరు నమ్మకంతో, నిజాయితీగా మాట్లాడటం జడ్జెస్‌ను పూర్తిగా ఇంప్రెస్ చేసింది. తరువాతి రౌండ్లలో కూడా బాలు-మీనా అన్యోన్యత మరోసారి బయటపడింది. "గొడవలు లేని సంసారం ఉప్పు కారం లేని వంటలాంటిది" అన్న బాలు మాటలకు, "గొడవలు వచ్చినా సాయంత్రంలోపే పోవాలి" అంటూ మీనా ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది. 'నీ మనసు నాకు తెలుసు' రౌండ్‌లో భావోద్వేగాలు పీక్స్‌కి చేరాయి. మనోజ్-రోహిణి ఎమోషనల్ మోమెంట్‌తో ప్రేక్షకుల్ని కదిలించగా, శృతి-రవి పిల్లల విషయంలో భిన్నాభిప్రాయాలతో వాగ్వాదానికి దిగారు.

చివరగా బాలు -మీనా స్టేజ్‌పైకి రాగానే వాతావరణమే మారిపోయింది. ఏడు ప్రశ్నలకు ఏడు సమాధానాలు ఒకేలా రావడంతో జడ్జెస్ ఆశ్చర్యపోయారు. 'మా శరీరాలు వేరైనా... మా మనసు ఒక్కటే' అన్న బాలు మాటలు ఈ ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచాయి. చివరి రౌండ్‌లో మాటలు లేకుండా 'డ్రీమ్ హౌస్' నిర్మించే టాస్క్‌లో మనోజ్- రోహిణి, రవి- శ్రుతి జంట వారి మధ్య అండర్ స్టాండింగ్ లేకపోవడంతో టాస్క్ పూర్తి చేయలేకపోతారు. ఇక బాలు-మీనా మాత్రం తమ సమన్వయాన్ని చాటారు. చూపులు, సంకేతాలతోనే పర్ఫెక్ట్‌గా ఇల్లు నిర్మించడంతో జడ్జెస్ పూర్తిగా ఫిదా అయ్యారు.

ఇక అప్‌కమింగ్ ఎపిసోడ్‌లో బెస్ట్ కపుల్ కాంపిటీషన్ ఉత్కంఠభరితంగా సాగింది. డ్రీమ్ హౌస్ టాస్క్‌లో భాగంగా ప్రతి జంట తమ తమ ఆలోచనలతో ఇళ్లను నిర్మించేందుకు ప్రయత్నించింది. ముందుగా మనోజ్‌ను ప్రశ్నించారు. 'డ్రీమ్ హౌస్‌ను ఎందుకు పూర్తి చేయలేకపోయారు?' అని అడగగా, తాను లగ్జరీ విల్లా కట్టాలని భావించానని మనోజ్ చెప్పాడు. అదే సమయంలో రోహిణి మధ్యలో జోక్యం చేసుకుని, కాంపౌండ్ వాల్ కట్టడానికే ఇచ్చిన సమయం పూర్తయ్యిందని సెటైర్లు వేయడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. ఇక రవి-శృతి జంట కూడా టాస్క్‌ను పూర్తి చేయలేకపోయింది. ఇద్దరి మధ్య సరైన సమన్వయం లేకపోవడం, స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం వల్ల డ్రీమ్ హౌస్ అసంపూర్తిగా మిగిలిపోయింది. దీంతో పోటీలో వారు వెనుకబడిపోయారు. జడ్జెస్ వారి ప్రయత్నాన్ని గుర్తించినప్పటికీ, ఫలితాల పరంగా మాత్రం పాయింట్లు తగ్గాయి.

ఈ పోటీలో పూర్తిగా భిన్నంగా ఆలోచించింది మాత్రం బాలు-మీనా జంటే. వారు లగ్జరీపై కాకుండా తమ జీవిత వాస్తవాలపై దృష్టి పెట్టారు. అందుకే ఒక పెద్ద ఇల్లు కాకుండా, అవసరమైనంత మాత్రాన ఒక చిన్న సింగిల్ రూమ్‌ను మాత్రమే నిర్మించారు. జడ్జెస్ 'మీరు కేవలం ఒక గది మాత్రమే ఎందుకు కట్టారు?'అని ప్రశ్నించగా, తమకు ఇప్పటివరకు ఇంట్లో బెడ్‌రూమ్ కూడా లేదని, కనీసం మాకంటూ ఒక చిన్న గది ఉంటే చాలని మీనా చెప్పింది. మీనా మాటల్లో ఉన్న నిజాయితీ, భావోద్వేగం జడ్జెస్‌ను బాగా ఇంప్రెస్ చేసింది. ఇక అన్ని టాస్క్‌ల ఫలితాలను బేరీజు వేసిన తర్వాత జడ్జెస్ చివరకు బెస్ట్ కపుల్ కాంపిటీషన్ విజేతలుగా బాలు-మీనా జంటను ప్రకటించారు.

ఈ ప్రకటనతో మీనా ఆనందంతో బాలును హగ్ చేసుకుంది. ఫలితాన్ని రవి-శృతి ఎంతో స్పోర్టివ్‌గా స్వీకరించారు. అన్నయ్య, వదినలుగా బాలు-మీనా జంటను అభినందిస్తూ, వారి విజయానికి శుభాకాంక్షలు తెలిపారు. అయితే మనోజ్-రోహిణి మాత్రం ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. గెలవలేదన్న అసూయతో ఇద్దరూ మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. విజయం సాధించిన విషయం తెలుసుకున్న బాలు వెంటనే తన స్నేహితులు సమాచారం అందించాడు. దాంతో వారు బ్యాండ్ భాజాలతో ఊరేగింపుగా వచ్చి బాలు-మీనా జంటను ఇంటికి తీసుకొచ్చారు. ఈ ఊరేగింపు సన్నివేశం ఎపిసోడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మరోవైపు లక్ష రూపాయల ప్రైజ్ మనీ మనోజ్-రోహిణి గెలిచారని భావించిన ప్రభావతి, వారికి దిష్టి తీయడానికి హారతి గుమ్మడికాయ పట్టుకుని బయటకు వచ్చింది. మనోజ్‌ను చూసిన వెంటనే లక్ష రూపాయలు క్యాష్‌గా ఇచ్చారా లేక చెక్‌గా ఇచ్చారా అని ప్రశ్నించడంతో అతడు మాటలేక నిలిచిపోయాడు. అదే సమయంలో మీనా తల్లి పార్వతి ఇంటికి చేరుకోవడం పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మార్చింది. ఇంతలోనే బాలు -మీనా ఊరేగింపుగా రావడంతో అసలు నిజం బయటపడింది. బెస్ట్ కపుల్ కాంపిటీషన్‌లో గెలిచింది బాలు-మీనా జంటనేనని, వారికి లక్ష రూపాయల ప్రైజ్ మనీ వచ్చిందని తెలుసుకున్న ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయింది. సత్యం మాత్రం ఈ విషయంతో తెగ ఆనందపడతాడు. కానీ ప్రభావతి ముఖంలో మాత్రం మనోజ్ ఓడిపోయాడన్న కోపం, బాలు గెలిచాడన్న అసూయ స్పష్టంగా కనిపించింది.

ఎపిసోడ్ చివర్లో బాలు - మీనా విజయం సందర్భంగా అందరూ కలిసి తీన్మార్ స్టెప్పులు వేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ ఆనందకర క్షణాలు ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాయి. అయితే ఈ సంబరాల మధ్య ప్రభావతి అసూయతో కుళ్ళుకుంటూ కనిపించడం, తదుపరి ఎపిసోడ్‌లో ఆమె తీసుకునే నిర్ణయాలపై ఆసక్తిని పెంచింది. ఈ పరిణామం ఇంట్లో ఎలాంటి కలకలం రేపుతుందో, ప్రభావతి ఎలా స్పందిస్తుందో చూడాలంటే ఇక వచ్చే ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X