Gunde Ninda Gudi Gantalu January 10th Episode: రోహిణి గతం.. మనోజ్ బాగోతం.. ప్రభావతి‌ అనుమానం..

Courtesy: jiohotstar

Gundeninda Gudigantalu: గుండె నిండా గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్ ఆరంభంలో మనోజ్‌కు క్రెడిట్ కార్డ్ ఆఫర్ రావడంతో అతడు ఎంతో ఆనందపడుతాడు. ఈ అవకాశాన్ని తన బిజినెస్ అభివృద్ధికి ఉపయోగించుకోవచ్చని భావిస్తాడు. అయితే రోహిణి మాత్రం దీనికి పూర్తిగా వ్యతిరేకంగా స్పందిస్తుంది. క్రెడిట్ కార్డ్ వల్ల ఖర్చులు అదుపు తప్పుతాయని, భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తప్పవని ఆమె భయపడుతుంది. గత అనుభవాల వల్ల మరోసారి అప్పుల ఊబిలో పడకూడదన్న ఆందోళన రోహిణిని వెంటాడుతుంది. కానీ, మనోజ్ మాత్రం 'అవసరమైతే డబ్బు చేతిలో ఉంటుంది, బిజినెస్ గ్రోత్‌కు ఇది హెల్ప్ అవుతుంది'అంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటాడు.

రోహిణిని మెప్పించేందుకు ఆమెను దేవతగా పొగిడుతూ, క్రెడిట్ కార్డ్ వచ్చాక గోవా ట్రిప్‌కు వెళ్దామని కూడా చెబుతాడు. మనోజ్ మాటలు వింటూ రోహిణి నవ్వినప్పటికీ, ఆమె ముఖంలో భవిష్యత్తుపై ఉన్న టెన్షన్ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇదిలా ఉండగా రోహిణికి తన కొడుకు చింటూ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. 'అమ్మా... నీతోనే ఉండాలనిపిస్తుంది' అంటూ చింటూ తన మనసు విప్పి చెబుతాడు. ఈ మాటలు రోహిణిని భావోద్వేగానికి గురిచేస్తాయి.

Gunde Ninda Gudi Gantalu January 10th Episode

Courtesy: jiohotstar

త్వరలోనే నిన్ను నా దగ్గరికి తీసుకువస్తానని, కొత్త స్కూల్ కూడా చూసానని ధైర్యం చెబుతుంది. కానీ చింటూ మాత్రం 'నీవుంటే చాలు అమ్మా, అక్కడికి వచ్చాక కొత్త ఫ్రెండ్స్ చేసుకుంటాను'అంటూ మరింత ఎమోషనల్‌గా మాట్లాడతాడు. అదే సమయంలో రోహిణికి గైనకాలజిస్ట్ అపాయింట్‌మెంట్ దొరుకుతుంది. వెంటనే తన స్నేహితురాలు దివ్యకు ఫోన్ చేసి హాస్పిటల్‌కు కలిసి వెళ్లమని చెబుతుంది.

మరోవైపు,సుమతి ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావడంతో మీనా తల్లి పార్వతి ఆనందానికి అవధులు ఉండవు. స్వీట్స్ పంచుతూ తన సంతోషాన్ని అందరితో పంచుకుంటుంది. పొరుగింటి మహిళ సుమతిని పొగడ్తలతో ముంచెత్తుతూ, తండ్రి లేని లోటు లేకుండా పిల్లలను చదివించావని పార్వతిని ప్రశంసిస్తుంది. దీనికి పార్వతి 'దేవుడి ఆశీర్వాదం, సుమతి కష్టమే ఈ విజయం వెనుక ఉందని చెబుతుంది. ఇంతలో మీనా, బాలు గుడికి చేరుకుంటారు.

మీనా తన చెల్లిని హగ్ చేసుకుని ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. అయితే సుమతి మాటల్లో మీనా చేసిన త్యాగం బయటపడుతుంది. తన చదువులు మానేసి, తమ్ముడు-చెల్లెల కోసం మీనా చేసిన త్యాగం విని బాలు షాక్ అవుతాడు. ఈ విషయం తనకు ఇప్పటివరకు చెప్పలేదని ఆశ్చర్యపోతాడు. ఈ సీన్‌లో మీనా పాత్ర గొప్పతనం మరోసారి ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది.

మరోవైపు రోహిణి దివ్యతో కలిసి హాస్పిటల్‌కు వెళ్తుంది. అక్కడ దివ్య 'ఇప్పుడే చెకప్ ఎందుకు?'అని ప్రశ్నించగా, రోహిణి తన అసలు ప్లాన్‌ను బయటపెడుతుంది. తాను తల్లిని అయితే మనోజ్ తనను క్షమిస్తాడని, అత్తగారి వైఖరి కూడా మారుతుందని నమ్మకంతో ఈ ప్రయత్నం చేస్తున్నానని చెబుతుంది. డాక్టర్ పరీక్షల తర్వాత ఫిజికల్‌గా ఎలాంటి సమస్యలేదని, కానీ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలని సూచిస్తుంది. ఈ మాటలు రోహిణిని కొంత ఊరట కలిగించినా, దివ్య మాత్రం వ్యంగ్యంగా మాట్లాడుతూ ఆమె దాచిన గతాన్ని గుర్తు చేస్తుంది.

దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. ఇదే సమయంలో అదే హాస్పిటల్‌లో సుమతి ఇంటర్వ్యూకు వచ్చి జాబ్‌లో సెలెక్ట్ అవుతుంది. ఈ శుభవార్తను మీనాకు ఫోన్ చేసి చెబుతుంది. మీనా ఆనందంతో ఉప్పొంగిపోతుంది. అయితే ఫోన్ పెట్టేముందు సుమతి 'ఇంటర్వ్యూ సమయంలో రోహిణిని హాస్పిటల్‌లో చూశాను'అని చెప్పడంతో మీనాకు ఒక్కసారిగా అనుమానం మొదలవుతుంది.

ఇక రాబోయే ఎపిసోడ్ ఉత్కంఠను పీక్స్‌కు తీసుకెళ్లేలా సాగనుంది. ఇంట్లో ఒక్కసారిగా ఆనంద వాతావరణం నెలకొంటుంది. మీనా స్వీట్ చేసి అందరికీ పంచుతూ కనిపించడంతో అసలు విషయం ఏంటని రోహిణి అడగకముందే మీనా పెద్ద ట్విస్ట్ ఇస్తుంది. 'నువ్వు తల్లివి కాబోతున్నావు కదా... అందుకే ఈ స్వీట్'అంటూ చిరునవ్వుతో చెబుతుంది. ఆ మాటలు విన్న క్షణంలో ఇంట్లో అందరి ముఖాల్లో ఆశ్చర్యం, ఆనందం కలిసిపోతాయి. ప్రభావతి కూడా ఒక్కసారిగా నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంటుంది.

కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవదు. వెంటనే రోహిణి గట్టిగా 'నేను ప్రెగ్నెంట్‌ని కాదు'అని చెప్పడంతో ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంటుంది. మీనా నుంచి ప్రభావతి వరకు అందరూ షాక్ అవుతారు. కొన్ని క్షణాల్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ప్రభావతి ఆగ్రహంతో 'నా ఆశలన్నీ అడియాశలు చేసింది నీ పెళ్లాం'అంటూ రోహిణిపై అరిచేస్తుంది. కుటుంబంలో ఉద్రిక్తత ఒక్కసారిగా పెరిగిపోతుంది.

ఈ క్రమంలో రోహిణి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తూ మనోజ్ దగ్గరకు వెళ్లి, 'మనిద్దరం కలిసి హాస్పిటల్‌కి వెళ్లి చెక్ అప్ చేసుకుందామా?'అని అడుగుతుంది. అయితే మనోజ్ మాత్రం కాస్త కఠినంగా స్పందిస్తూ.. 'కన్సీవ్ కానిది నువ్వు, నేను ఎందుకు చెక్ అప్ చేసుకోవాలి?'అని ప్రశ్నిస్తాడు. ఈ మాటలు రోహిణిలో మరింత కోపాన్ని రేపుతాయి. వెంటనే ఆమె అనుమానంతో, 'నీ మాజీ లవర్‌తో లివింగ్ రిలేషన్ లో ఉన్నావు కదా?'అంటూ అనుమానం వ్యక్తం చేస్తుంది. ఈ మాటలు విన్న ప్రభావతి ఒక్కసారిగా రోహిణిని నిలదీస్తుంది.

'నువ్వు విదేశాల్లో ఉన్నప్పుడు నేను కానీ,మనోజ్ కానీ ఎప్పుడైనా నిన్ను అనుమానించామా?'అంటూ ప్రశ్నించి, కుటుంబంలో నమ్మకం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది. ఆ తర్వాత ప్రభావతి మనోజ్‌ను పక్కకు తీసుకెళ్లి వ్యక్తిగతంగా మాట్లాడుతుంది. 'పెళ్లికి ముందు రోహిణి జీవితం ఏంటో మనకు పూర్తిగా తెలియదు. ఆమె ఏదో దాస్తున్నట్లే అనిపిస్తోంది' అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తుంది.

ఈ మాటలతో మనోజ్ ఆలోచనల్లో పడిపోతాడు. రోహిణి గతం ఏంటి? చింటూ విషయం మనోజ్‌కు తెలిసిపోతుందా? రోహిణి దాచిన రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడతాయా? అనే ఎన్నో ప్రశ్నలతో ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా ముగుస్తుంది. రాబోయే ఎపిసోడ్‌లో కీలక నిజాలు బయటపడే సూచనలు కనిపించడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X